Podharillu Serial Today Episode: తన ఇంటికి కొత్త కోడలు వస్తుందన్న  ఆనందంలో  నారాయణ ఆనందానికి హద్దులు ఉండవు.  టీకొట్టు దగ్గరకు వెళ్లి వాళ్ల అన్నయ్యను చెడామడా తిడతాడు. నువ్వు నీ చెల్లి శాపనార్థాలు పెట్టినంత మాత్రానా నా ఇంటికి  ఏం కాదని  అంటాడు. మీరు ఎన్ని గుంటనక్క ఎత్తులు వేసినా....నా ఇంటికి కూడా  ఓ ఆడపిల్లవస్తుందని అంటాడు. అలాంటి ఇలాంటి సంబంధం కాదని....పెద్దింటి అమ్మాయిని మా చక్రి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని  అంటాడు. కాసేపట్లో కొత్త దంపతులు వస్తున్నారని ఇక నుంచి మా ఇంట్లో ప్రతిరోజూ  పండుగేనంటాడు.  అంందుకే ఇంటికి లైట్లు పెట్టి బ్యాండ్‌మేళం పెట్టించామని చెబుతాడు. ఈ శుభ సంధర్భంలో అక్కడ  ఉన్న వాళ్లందరికీ  టీ , బిస్కెట్లు  ఫ్రీగా ఇవ్వమని కొట్టు వాడికి చెబుతాడు.              మహా, చక్రి కారు ఊరు పొలిమేరల్లోకి రాగానే డీజే సౌండ్‌,  బ్యాండు మేళం వినిపిస్తుంటుంది.ఊరిలో ఎవరిదో పెళ్లి అవుతుందనుకుంటా అందుకే   ఈ బ్యాండ్‌మేళం పెట్టించి ఉంటారని  మహా అంటుంది. ఇదంతా మా తమ్ముళ్లు చేసిన పనేనని  చక్రి అనుకుంటాడు. ఇంతలో  వీధి దగ్గరకు వచ్చేసరికి  కన్న, కేశవ్‌ ఎదురొచ్చి బ్యాండ్‌మేళంతో  స్వాగతం పలుకుతారు. టపాసులు కాల్చి డ్యాన్స్‌లు వేస్తూ ఊరేగింపుగా  వారిని తీసుకొస్తారు. దీనికి మహాకు కోపం వస్తుంది.ఇదంతా ఉత్తిత్తి పెళ్లి అని చెప్పావు కదా ఇప్పుడు ఇదంతా ఏంటని చక్రిని నిలదీస్తుంది.  మనకు ఇష్టమై ఈ  పెళ్లిచేసుకోలేదని  నీకు తెలుసు కదా...ఇప్పుడు ఇదంతా చేస్తే ఊరువాళ్లంతా మనకు నిజమైన పెళ్లి జరిగిందని అనుకుంటారు కదా అని నిలదీస్తుంది.నాకు కూడా తెలియదని....పోలీసు వాళ్లు చెప్పేసరికి మా వాళ్లు ఇదంతా చేసి ఉంటారని సముదాయిస్తాడు. ఈలోగా  ఇల్లు వచ్చేస్తుంది. మర్యాదగా మీవాళ్లను  ఇవన్నీ ఆపించమనిచెప్పండని మహా అంటుంది. ఇప్పటికిప్పుడు ఇలా చేస్తే మా పరువుపోతుందని...కొంచెం  నిదానంగా అన్నీ నేను చెబుతానని...దయచేసి దండ మెడలో వేసుకుని కారు దిగండని చెబుతాడు..                  మహా, చక్రి ఇద్దరూ  ఇంట్లోకి వస్తుండగా...తాయరు వాళ్ల అన్నయ్యను తీసుకుని అక్కడికి వస్తుంది. ఇంత గొప్పింటి పిల్లను ఎలా పట్టాడని అనుకుంటుంది. మోసం చేసి పెళ్లి చేసుకున్నా ఈ ఇంటిని చూస్తే మాత్రం పారిపోతుందిలే అని వాళ్ల అన్నయ్య అంటాడు.ఇంతలో కొత్త దంపతులకు గాయత్రి హారతి తీసేందుకు రాగా....తాయారు ఆ హారతి పల్లెం కిందపడేసి తన కూతురుని తీసుకుని వెళ్లిపోతుంది. దీంతో కన్నా  హారతి ఇచ్చి వాళ్లను లోపలికి తీసుకెళ్తారు. ఆ తర్వాత  మహా చక్రిని పిలిచి ఇదంతా ఏంటని  మళ్లీ గొడవ పెట్టుకుంటుంది. నువ్వు నిజం చెప్పకుంటే...మీవాళ్లు నిజంగానే మనకు పెళ్లి అయిపోయిందని అనుకుంటారని చెబుతుంది. జుట్టుపోలిగాడితో  ఇష్టంలేని పెళ్లిచేస్తున్నారని తెలిసే కదా నీ సాయం కోరి ఇంట్లో నుంచి బయటకు వచ్చాను...మా వాళ్లు నిన్ను చంపేస్తారని తప్పనిసరి పరిస్థితుల్లో తాళి కట్టించుకున్నాను. ఇదంతా తెలుసుకోకుండా మీవాళ్లు నిజంగానే  మనం లేచిపోయి వచ్చి పెళ్లిచేసుకున్నాం అనుకుంటున్నారని  అంటుంది.