Podharillu Serial Today Episode: చక్రి ఫోన్‌ తీయకపోయే సరికి మాదవ్ చాలా కంగారుపడుతుంటాడు.  వాడికి ఏం అయ్యిందోనని ఆందోళన చెందుతుంటాడు. అమ్మాయిని తీసుకుని వచ్చాడని తెలియడంతో  ఆ  అమ్మాయి తరపు వాళ్లు ఏమైనా చేసి ఉంటారేమోనని అనుకుంటాడు. కానీ వాళ్లిద్దరు  అన్నదమ్ములు మాత్రం వాడికి  ఏం కాదులే అని అంటాడు. ఫోన్ స్విచ్ఛాప్‌ చేసి ఉంటాడు అందుకే  మనకు దొరకడం లేదని అంటారు. ఇంతలో మాధవ్‌కు ఓ కొత్త నెంబర్‌ నుంచి ఫోన్‌కాల్‌ రావడంతో మరింత కంగారుపడతాడు. అవతలి  నుంచి  ఎస్‌ఐ ఫోన్‌ చేసి చక్రి మీవాడేనా అని అడుగుతాడు. మాతమ్ముడే అని మాధవ్‌ సమాధానమిస్తాడు.  మీవాడు  ఓ అమ్మాయిని తీసుకుని స్టేషన్‌కు  వచ్చాడని వాడికి, ఆ అమ్మాయికి  పెళ్లి చేశామని చెబుతారు.

Continues below advertisement

వచ్చిన అమ్మాయిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని....ఆ అమ్మాయి చాలా పెద్దింటి అమ్మాయని చెబుతారు. ఆ అమ్మాయికి ఏం  జరిగినా...మీ అందరినీ అరెస్ట్‌ చేస్తామని ఎస్‌ఐ హెచ్చరిస్తాడు.  ఆ అమ్మాయి కోసం వాళ్ల నాన్న కూడా ఏదైనా  అపాయం తలపెట్టే అవకాశం ఉందని....కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తాడు. మాధవ్‌ కూడా  ఈ పెళ్లి మాకు ఇష్టమేనని మేం ఆ అమ్మాయిని చాలా జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు.                     

మహా, చక్రి ఇద్దరూ పోలీసుస్టేషన్‌ నుంచి ఇంటికి వస్తూ మార్గమధ్యలో  రెస్టారెంట్ వద్ద ఆగుతారు. మహా హాస్టల్‌లో ఉండటానికి  వాళ్ల ప్రెండ్‌కు కాల్ చేస్తుంది. తాను బెంగళూరు వెళ్లిపోతున్నానని  కుదరదని చెబుతాడు.అయితే తనకు ఏదైనా  హాస్టల్‌లో  ఉండేలా ఏర్పాట్లు చేయాలని చక్రిని అడుగుతుంది. హాస్టల్‌లో గానీ రూమ్‌లో గానీ ఉండాలంటే ఐడీ ఫ్రూప్‌ అవసరరమని ఇప్పుడు అది నీ దగ్గర లేదు కదా అని అంటాడు. తన ఫోన్‌లో ఉన్నా సరే ఆమె తన  ఇంటికి రాదని చెప్పి చూపించడు.

Continues below advertisement

పైగా పోలీసులు ఇప్పటికే  మా అన్నయ్యకు ఫోన్ చేసి మన పెళ్లి అయిపోయిందని చెప్పారని....ఇప్పుడు నువ్వు మా ఇంటికి రాకుంటే.... పోలీసులు మా అన్నయ్యను తీసుకెళ్తారని చెబుతాడు. కాబట్టి నువ్వు తప్పనిసరిగా  మా ఇంటికి రావాల్సిందేనని  చెబుతాడు. మరి మీ ఇంట్లో వాళ్లు ఏమీ అనరా నువ్వు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావని అని మహా నిలదీస్తుంది. మా అన్నయ్యలు  అర్థం చేసుకుంటారని..ఏమీ అనరని చక్రి సమాధానమిస్తాడు. ఆ తర్వాత చక్రి మాధవ్‌కు ఫోన్‌ చేసి అమ్మాయిని తీసుకుని ఇంటికి వస్తున్నానని అంతా రెడీ చేసి ఉంచండని చెబుతాడు.                       

తొలిసారి ఓ అమ్మాయి ఇంటికి వస్తుండటంతో  మాదవ్‌కు ఏం చేయాలోఅర్థం కాదు. అంతా కంగారుపడిపోతుంటాడు.  ఇప్పుడు ఎలా ఏం చేయాలని గాబరా పడుతుంటాడు. ముందు ఇళ్లంతా శుభ్రం చేసి కొంచెం డెకరేట్ చేద్దామని తమ్ముళ్లుచెప్పడంతో  సరేనంటాడు. ఇంట్లోకి కావాల్సినవన్నీ తెప్పించి  ఇంటిని అందంగా  ముస్తాబు చేస్తారు. అందరూ కలిసి చక్రి రాక కోసం ఎదురుచూస్తుంటారు.