Chinni Serial Today Episode మధు మ్యాడీకి హల్వా తినమని ఇస్తే మ్యాడీ అవసరం లేదు అనేస్తాడు. దాంతో మధు నీతో హల్వా ఎలా తినిపించాలో నాకు తెలుసు అని హల్వా తింటూ మ్యాడీ నోరూరిస్తుంది. మ్యాడీ హర్ట్ అయి వెళ్లి దుప్పటి కప్పేస్తాడు. మధు మ్యాడీకి వినిపించినట్లు ఇప్పుడు వద్దులే రేపు తింటా అని బెడ్ మీదకు వెళ్లి పడుకోవడంతో మ్యాడీ మధుకి తెలీకుండా హల్వా తీసుకొని దుప్పట్లో దూరి మొత్తం తినేస్తాడు. మ్యాడీ హల్వా తింటూ ఉంటే ఎక్కిళ్లు రావడంతో మధు లేచి కూర్చొని నీరు ఇస్తుంది. మ్యాడీ షాక్ అయిపోతాడు. మధు నవ్వుకుంటుంది. 

Continues below advertisement

ఆఫ్‌ టికెట్ అతని మనిషి చిన్నికి దేవా కొడుకుకి పెళ్లి జరిగిందని చెప్తాడు. ఇలా అయిందేంటి అని ఆఫ్ టికెట్ అనుకుంటారు. చిన్ని దేవా ఇంటి కోడలు అయిపోయింది.. దేవా ఎంత దుర్మార్గుడో చిన్నికి చెప్పుంటే బాగుండేది అంతా నా వల్లే అని ఆఫ్ టికెట్ బాధ పడతాడు. చిన్నిని కలిసి దేవా ఎలాంటి వాడో చెప్పాలని అనుకుంటాడు. 

మధు రిసెప్షన్కి రెడీ అయివుతుంది. మ్యాడీ తనకు ఏం ఇష్టం లేదని అంటాడు. దేవా నాగవల్లితో తనకు ఈ రిసెప్షన్ ఇష్టం లేదు అని అంటాడు. ఈ ఒక్క రోజు ఓపిక పట్టు అని నాగవల్లి అంటుంది. మధు తల్లిదండ్రులు వచ్చి మధు, మ్యాడీల రిసెప్షన్ బ్యానర్ చూసి మురిసిపోతారు. నాగవల్లి వాళ్లని చూసి మధుని పిలుస్తారు. నాగవల్లి మధు తల్లిదండ్రుల్ని ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చారు అని అడిగితే ఆర్టీసీ బస్‌లో వచ్చుంటారు అందుకే లేట్‌గా వచ్చుంటారు అని దేవా అంటే లేదండీ ఆటోలో వచ్చాం అని సుబ్బు అంటాడు. 

Continues below advertisement

చంటి మ్యాడీతో బావగారు మొన్న నేను రాలేదు కదా పెళ్లిలో చేయాల్సిన పనులు అన్నీ ఇప్పుడు చేస్తా అంటాడు. దానికి ప్రమీల మ్యాడీ బామర్ది నీ కాలు కడుగుతా అని చెప్తున్నాడు అని అంటుంది. అందరూ సరే అంటారు. దాంతో చంటి మ్యాడీ కాళ్లు కడుగుతాడు. తర్వాత చంటి మీ కాళ్లు కడిగేశా కట్నం ఏం ఇస్తారు అని అడుగుతాడు. దానికి మ్యాడీ తన మెడలో చైన్ తీసి ఇస్తాడు. లోహిత వెంటనే ఓ గోల్డ్ చైన్ కోసమా కాళ్లు కడిగింది అని అంటుంది. మ్యాడీ చంటికీ చైన్ ఇస్తుంటే చంటి ఆపి నేను అడిగిన కట్నం ఈ బంగారు గొలుసు కాదు బావగారు.. బంగారం లాంటి మా అక్కని మీరు జీవితాంతం బాగా చూసుకోవడం కావాలి.. మా అక్క అంటే మాకు ప్రాణం మా అక్క ఏమైనా తప్పు చేస్తే మమల్ని తిట్టండి కానీ మా అక్కని ఏం అనొద్దు అని చెప్తాడు. మ్యాడీ ప్రేమగా చంటిని హగ్ చేసుకుంటాడు. ఎప్పుడో అయిన పెళ్లికి ఇప్పుడు అప్పగింతలు ఏంటో అని లోహి అంటుంది. 

నాగవల్లి వాళ్లతో మీ అక్క ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. నువ్వు సంతోషంగా ఉండు అని చెప్తుంది. శ్రేయ హర్ట్ అయి వెళ్లిపోతుంది. లోహిత వెళ్లి ఓదార్చుతుంది. అత్తయ్యా నిజంగా నాకు బావకి పెళ్లి చేస్తే సరే లేదంటే ఆ మధుని చంపేస్తా అంటుంది. తర్వాత వరుణ్ వచ్చి ఏమైంది శ్రేయ ఎందుకు అంత కోపంగా ఉంది అని అడుగుతాడు. ఏం జరగలేదు అని శ్రేయ బాధపడుతుందని అంటుంది. ఏంటి అని వరుణ్ అడిగితే మన వ్రతం జరగలేదు రిసెప్షన్ జరగలేదు అని బాధ పడుతుంది అని లోహిత అంటే మీ తల్లిదండ్రుల్ని పిలు అప్పుడు చేస్తారు అని వరుణ్ అంటే లోహిత బిత్తరపోతుంది.  మధు తల్లిదండ్రులు మధు, మ్యాడీ కోసం బట్టలు తీసుకొస్తారు. నాగవల్లి దగ్గరకు వెళ్లి కూతురు అల్లుడికి బట్టలు తీసుకొచ్చాం అని చెప్తే ఏ సంతలో కొన్నారు అని నాగవల్లి అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.