Jagadhatri Serial Today Episode: ఇంట్లో కిట్టిపార్టీ పెట్టి అందరితో ఆటలు ఆడించేందుకు వైజయంతి, నిషికి ప్లాన్ చేస్తారు. టగ్‌ఆప్ వార్‌లో జగధాత్రి, కౌషికిని కిందపడేసి దెబ్బలు తగిలిస్తే....వాళ్లు ఆస్పత్రికి వెళ్తారని అప్పుడు తమ వాళ్లకు వజ్రాలు ఉన్న లడ్డూ బాక్స్‌లు ఇచ్చి పంపించేలా వైజయంతి పథకం వేస్తుంది. అనుకున్నట్లుగానే ఆటలో తాడు వదిలేయడంతో కౌషికి వెనక ఉన్న గచ్చుమీద పడిపోయి చేతికి దెబ్బతగిలించుకుంటుంది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లమంటూ వైజయంతి హడావుడి చేస్తుంది. కానీ కౌషికి చిన్న దెబ్బే కదా అవసరం లేదని ఇంట్లోకి వెళ్లి ఫస్ట్‌ఎయిడ్ చేసుకుంటుంది. ఈ సమయంలో వైజయంతి తమ వాళ్లు లడ్డూలు గిప్ట్ ప్యాక్ చేసి వాటిల్లో వజ్రాలు పెట్టి పంపించే ప్రయత్నం చేస్తుంది. తమ వాళ్లకు ఓ రకం ప్యాకెట్,...నిషిక ప్రెండ్స్‌కు ఇంకోరకం ప్యాకెట్‌లు అందించడం ధాత్రి గమనిస్తుంది. తాను సైగ చేయడంతో వజ్రాలు ఉన్న లడ్డూ ప్యాకెట్‌ను నిషిక ప్రెండ్ వేషంలో ఉన్న కానిస్టేబుల్ అందుకుంటుంది. వెంటనే కంగారుపడిన వైజయంతి నీకు ఇంకో ప్యాకెట్ ఇస్తానని ఆమె చేతుల్లో నుంచి గిప్ట్ బాక్స్ లాక్కుంటుంది. అయినా సరే కానిస్టేబుల్ ఇదే కావాలని గొడవ చేస్తుంది. మరింత కంగారుపడిపోయిన వైజయంతి ఆమె చేతిలో ఉన్న లడ్డూల బాక్సు లాక్కుని తన మనిషికి ఇస్తుంది. వైజయంతి కంగారు చూసి ఖచ్చితంగా ఆ బాక్స్‌లో వజ్రాలు ఉన్నాయని ధాత్రి నిర్థారించుకుంటుంది. వజ్రాల లడ్డూ బాక్స్ తీసుకుని వెళ్తున్న మహిళను ఫాలో చేయడానికి బయట తన మనుషులు ఇద్దరిని పెడుతుంది. వజ్రాలు ఉన్న లడ్డూ బాక్స్ తీసుకుని మీనన్ మనిషి ఆటో ఎక్కగానే...పోలీసు ఇన్‌ఫార్మర్‌లు ఆమెను అనుసరిస్తారు. ఇదంతా మేడపైన ఉన్న వైజయంతి చూస్తుంది. వెంటనే మీనన్‌కు ఫోన్ చేసి చెబుతుంది. ఇంతలో జేడీ, కేడీ కూడా ఆ మహిళను వెతుకుతూ వెంటపడతారు. ఎట్టకేలకు ఆటో కనిపించడంతో తమ కారుతో అడ్డుపెట్టి ఆటోను ఆపుతారు. అందులో ఉన్న రాధను బాక్స్‌లో ఏం ఉన్నాయని నిలదీస్తారు. లడ్డూలు మాత్రమే ఉన్నాయని ఆమె చెప్పడంతో ఆ బాక్స్ లాక్కుని లడ్డూల్లో దాచి ఉంచిన వజ్రాలను జగధాత్రి బయటకు తీస్తుంది. ఇవి ఎలా వచ్చాయో తనకు తెలియదని రాధ చెబుతుంది. నువ్వు ఎవరో ఎవరి కోసం పనిచేస్తున్నావో అన్నీ మాకు తెలుసని జగధాత్రి బెదిరిస్తుంది. ఈలడ్డూల్లోకి వజ్రాలు ఎలా వచ్చాయో వైజయంతికి కూడా తెలుసని చెప్పగా...ఆమెకు ఏం తెలియదని రాధ అంటుంది. అయితే స్టేషన్‌కు పదా అంటూ రాధను కారు ఎక్కిస్తుండగా...మీనన్ తన మనుషులతో అక్కడికి వచ్చి కాల్పులు జరుపుతాడు. దీంతో జగధాత్రి, కేదార్ కూడా ఎదురుకాల్పులు జరుపుతారు. ఈ హడావుడిలో రాధను తీసుకుని మీనన్ అక్కడి నుంచి పారిపోతాడు. రాధను అయితే జగధాత్రి చేతిలో నుంచి తప్పించగలిగాడు కానీ...వజ్రాల లడ్డూల బాక్స్‌మాత్రం అక్కడే వదిలేసి వెళ్లిపోతాడు. అయితే ఇంట్లో వైజయంతి కంగారుపడుతూ ఉంటుంది. ఇంతలో మీనన్ ఆమెకు ఫోన్ చేసి చెబుతాడు. వజ్రాల లడ్డూల బాక్స్ జగధాత్రికి దొరికిపోయిందని చెప్పగానే ఆమె గుండెలు జారిపోతాయి. ఇప్పుడు ఆ బాక్స్ పట్టకుని ధాత్రి మీ ఇంటికే బయలుదేరిందని....నువ్వు ఏదో విధంగా తప్పించుకోమని చెప్ి ఫోన్ కట్ చేస్తాడు. ధాత్రి వస్తుందని చెప్పడంతో వైజయంతిలో వణుకు మొదలవుతుంది.
Jagadhatri Serial Today January 15th: వైజయంతి పంపించిన వజ్రాల లడ్డూ బాక్స్ జేడీ, కేడీ చేతికి చిక్కిందా..? మీనన్ వైజయంతికి ఫోన్ చేసి ఏం చెప్పాడు...?
ABP Desam | 15 Jan 2026 09:42 PM (IST)
Jagadhatri Serial Today Episode January 15th: వైజయంతి పంపించిన వజ్రాల లడ్డూ బాక్స్ జేడీ, కేడీ చేతికి చిక్కిందా..? మీనన్ వైజయంతికి ఫోన్ చేసి ఏం చెప్పాడు...?
జగద్ధాత్రి సీరియల్ టుడే ఏపిసోడ్