Podharillu Serial Today Episode:  మహాను చివరిసారిగా  ఒప్పించేందుకు  ప్రతాప్ ప్రయత్నిస్తాడు.  కన్నీళ్లుపెట్టుకుని బ్రతిమలాడతాడు.  దీంతో కరిగిపోయిన మహా నాన్నా అంటూ వెళ్లి అతిని గుండెలపై వాలిపోతుంది. మనం ఇంటికి వెళ్లిపోదాం పదమ్మా అంటూ ప్రతాప్‌ బుజ్జగిస్తాడు. మీరు భూషణ్‌తో  పెళ్లి చేయమని స్టేషన్‌లో  రాసిఇస్తే  సంతోషంగా మీ వెంట వస్తానని అంటుంది. దీనికి ప్రతాప్ ససేమిరా అంటాడు. అయితే నేను  ఇంటికి రావడం కూడా కుదరదని తెగేసి చెప్పేస్తుంది. వీళ్లంతా కలిసి  మహా మనసు మార్చి మాయచేసి తీసుకెళ్లేలా ఉన్నారని గ్రహించిన  ఎస్‌ఐ...వెంటనే పూలదండలు, తాళి తెప్పిస్తాడు.                   పూలదండలు  చక్రి, మహా చేతికి ఇచ్చి ఒకరి మెడలో ఒకరు వేసుకోమని  అంటారు. మహా మాత్రం ఏడుస్తూ  వాళ్ల నాన్న వైపు చూస్తుంది. ఆది కూడా చివరిసారిగా బ్రతిమలాడతాడు. నువ్వు ఈ పనిచేస్తే....నాన్న పరువుపోతుందని ఎంతో వేడుకుంటాడు. ప్రతాప్‌ కూడా కన్నీళ్లు పెట్టుకుంటాడు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో  చక్రి మెడలో దండ వేయగా.. అతను కూడా  పూలదండ మెడలో వేసి తాళి కడతాడు. ప్రతాప్ కళ్లముందే  తన కూతురు పెళ్లి డ్రైవర్‌తో జరగడంతో కుప్పకూలిపోతాడు. మహా అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా....గట్టిగా మందలిస్తాడు. నా  కూతురు కాసేపటి క్రితమే చనిపోయిందని...అంటాడు. తనను చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచి  గొప్ప చదువులు చదివించానని....తను కష్టపడకూడదనే  రాత్రింబవళ్లు కష్టపడి కోట్లు సంపాధించానని  ప్రతాప్‌ అంటాడు.  తన బంగారు భవిష్యత్‌ కోసమే  గొప్ప సంబంధం తెచ్చి పెళ్లి చేయడానికి కోట్ల రూపాయల ఖర్చుతో ఏర్పాట్లు చేస్తే....తను మాత్రం చనిపోయిందని అంటాడు. ఇప్పటి వరకు నా కూతురు భవిష్యత్ ఏమైపోతుందోనని భయపడి ఈ పెళ్లి ఆపడానికి ప్రయత్నించానని....ఇప్పుడు తనే చనిపోతే ఎవరి భవిష్యత్‌ ఏమైపోతే నాకెందుకని అంటాడు. ఇంకెప్పుడు నీ ముఖం నాకు చూపించవద్దని మహాను  అంటాడు. ఈ డ్రైవర్‌ తిడుతున్నాడనో...కొడుతున్నాడో, లేక తిండిపెట్టడం లేదనో  నా గుమ్మం తొక్కవద్దని చెబుతాడు. ఆది కూడా  ఇంకెప్పుడు నీ ముఖం మాకు చూపించడానికి గానీ...మమ్మల్ని కలవడానికి ప్రయత్నించవద్దని  చెప్పి తన తండ్రిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంతలో అక్కడికి వచ్చిన భూషణ్‌....మహాను లాక్కెందుకు ప్రయత్నించగా...చక్రి వచ్చి వాడి చెంపపై ఒక్కటిస్తాడు. ఇప్పుడు  ఆమె తన భార్యని...ఎవడుపడితే వాడు చేయి వేయడానికి ప్రయత్నిస్తే చంపేస్తానని  హెచ్చరించడంతో  అతను కూడా అక్కడి నుంచి వెళ్లిపోతాడు.                          పెళ్లి అయిపోవడంతో  ఆ పెళ్లిని రిజిస్టర్‌ చేయడానికి  రిజిస్ట్రార్ వస్తాడు.  అక్కడ  చక్రి సంతకం పెట్టి మహాను కూడ సంతకం పెట్టడానికి ఎస్‌ఐ పిలుచుకుని రమ్మని చెబుతాడు. ఆమె బాధలో ఉందని....నేనే వెళ్లి సంతకం పెట్టించి తీసుకొస్తానని  చక్రి ఫైల్‌ తీసుకుని వెళ్తాడు. ఇప్పుడు పెళ్లి రిజిస్ట్రర్ చేస్తున్నారని తెలిస్తే మహా ఒప్పుకోదని అరిచి గోల చేస్తుందని గ్రహించి...ఆమెకు అబద్ధం చెప్పి ఆ ఫైల్‌లో సంతకం పెట్టించి  తీసుకొస్తాడు. ఇంతలో పోలీసులు ఫొటోలు తీయించడానికి  కెమెరామెన్‌ను  పిలిపిస్తారు. మహా ఇవన్నీ ఎందుకని  అడిగితే పోలీసు రికార్డ్‌ కోసమేనని చెప్పి ఒప్పిస్తాడు. పెళ్లితంతు పూర్తవ్వడంతో  ఎస్‌ఐ వారిద్దరినీ జాగ్రత్తగా ఉండాలని చెప్పి పంపిస్తాడు. చక్రి తన కారులో మహాను తీసుకుని వాళ్ల ఇంటికి బయలుదేరతాడు.

Continues below advertisement

 

Continues below advertisement