Lakshimi Raave Maa Intiki  Serial Today Episode: కొత్త కోడల్ని దీపం వెలిగించమని  గోపి వాళ్ల అమ్మ చెప్పగా....దేవుడి దగ్గర దీపం వెలిగించి  వెంటనే ఊది ఆర్పేస్తుంది. శ్రీలక్ష్మీ కలగజేసుకుని  ఏంటి ఇలా చేశావంటే  బర్త్‌డేకు ఇలాగే దీపం వెలిగించి  ఆర్పేస్తాం కదా అని అంటుంది. ఇలా చేయకూడదని చెబుతుంది. తనకు సంప్రదాయాలు పెద్దగా తెలియదు సారీ అని సింధూజాక్షి నాటకం ఆడుతుంది.  సర్లే మళ్లీ వెలిగించమని అత్తగారు చెబితే....దీపం కిందపడేస్తుంది.  దీంతో గోపీ వాళ్ల అమ్మకు  కోపం వస్తుంది.

Continues below advertisement

గుమ్మంలో భర్త పేరు చెప్పి వచ్చావని....కుడి కాలు పెట్టమంటే  ఎడమకాలు పెట్టి వచ్చావని...ధాన్యం గిన్నె నెట్టమంటే గట్టిగా తన్ని వచ్చావని ప్రతీది కావాలనే చేస్తున్నావని గట్టిగా  మందలిస్తుంది.  ఈ తాతయ్యకు సంప్రదాయాలన్నా, ఆచారాలన్నా ఎంతో  గౌరవమని...అలాంటిది  ఇవన్నీ నీకు చెప్పుకుండానే  పెంచాడా అని నిలదీస్తుంది.  నీ వ్యవహారం  అంతా  తేడా తేడాగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీనికి సింధూజాక్షి కూడా గట్టిగానే ఆమెకు సమాధానం చెబుతుంది. దీపం పొరపాటున కిందపడిపోతే ఇంత రాద్ధాంతం చేస్తున్నారని మండిపడుతుంది.                   

వెంటనే కలుగుజేసుకున్న గోపీ...మాఅమ్మకే కాదు నువ్వు చేస్తున్న పనులు నాకు కూడా  ఆశ్చర్యం కలిగిస్తున్నాయని అంటాడు. పెద్దాయన పెంపకంలో పెరిగిన నీవు ఇలా ప్రవర్తిస్తావని ఎవరూ అనుకోరు కదా అంటాడు.  మా అమ్మ నిన్ను అర్థం చేసుకోలేదని....ఆమె అర్థం చేసుకునేందుకు  కొంత సమయం పడుతుందని అంటాడు. వాళ్లంటే చదువుకోలేదని నీవు చదువుకున్నదానివే కదా...నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావేంటని అంటాడు. ఇంతలో  శ్రీలక్ష్మీ కలుగజేసుకుని సర్దిచెబుతుంది. ఫస్ట్‌నైట్‌కు ముహూర్తం పెట్టారు కదా అన్ని సర్దుకుంటాయిలే అని చెబుతుంది. దీంతో సింధూ ఏడుస్తూ  తన రూమ్‌లోకి వెళ్లిపోతుంది. మ్యాడీ కూడా ఆమె వెంటే వెళతాడు. శ్రీలక్ష్మీ వాళ్ల అన్నకు క్లాస్‌ పీకుతుంది. పట్నం నుంచి వచ్చిన అమ్మాయికి పల్లెలో ఎలా ఉండాలో ఎలా తెలుస్తుందని నీవు వదినతో అలాగేనా మాట్లాడేదని కోప్పడుతుంది. తనకు  అర్థమయ్యేలా  వివరించి చెప్పి నీకు నచ్చినట్లు మలుచుకోవాలని అంటుంది.

Continues below advertisement

అటు మ్యాడీ కూడా వాళ్ల అక్కకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుంటాడు. పెళ్లికానంత వరకు నిన్ను ఎలాగైనా  ఇక్కడ నుంచి తప్పించాలనుకున్నాను కానీ...ఇప్పుడు పెళ్లి అయిపోయింది కాబట్టి ఏం చేయలేకపోతున్నానని అంటాడు. వాడి మాటాల్లో తేడా గమనించి  సింధూ నాటకం మొదలుపెడుతుంది. ఇది అసలు తాళి కాదని నా మెడకు బిగించిన ఉరితాడు అని అంటుంది. ఇంట్లో  అడుగుపెట్టగానే మా అత్త పెత్తనం మొదలుపెట్టిందని....గోపీ కూడా నాకు సపోర్ట్‌గా లేడని అంటుంది. ఈ పల్లెటూరు వాడితో కాపురం చేయలేనని....తాతయ్య కోసం తలవంచి తాళి కట్టించుకున్నానని అంటుంది. తనను వీలైనంత త్వరగా ఈ నరకం నుంచి బయటపడేయాలని కోరుతుంది.

ఈరోజే ఇక్కడ నుంచి నన్ను పంపించేయాలని అడుగుతుంది. దీనికి మ్యాడీ కుదరదని  అంటాడు. అయితే నేను చచ్చిపోతానని సింధూ బెదిరిస్తుంది.  దీంతో మ్యాడీ  సరేనంటాడు. వాళ్లిద్దరూ మాట్లాడుకుంటుండగా శ్రీలక్ష్మీ అక్కడికి వస్తుంది. మా వదిన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్లడానికి ఇంకా పిచ్చిపిచ్చి ప్రయత్నాలు చేస్తుంటే మానుకోవాలని మ్యాడీకి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ రోజు రాత్రికే నిన్ను ఇక్కడి నుంచి పంపించేస్తానని మ్యాడీ వాళ్ల అక్కకు మాటిస్తాడు.