Jagadhatri Serial Today Episode: శ్రీవల్లిని చూసుకోవడానికి వచ్చిన పెళ్లికొడుకు వ్యవహారం తేడాగా ఉందని కేదార్‌, ధాత్రి మాట్లాడుకుంటుండగా...కౌషికి అక్కడికి వస్తుంది.తనకు కూడా ఏదో తేడాగా అనిపిస్తోందని అంటుంది. అత్తయ్య శ్రీవల్లిని వదిలించుకోవడానికే ఈ సంబంధం తెచ్చినట్లు ఉందని అనుకుంటారు.ఏదీ ఏమైనా మనం పూర్తిగా  వాళ్ల గురించి తెలుసుకున్న తర్వాతే ఈ సంబంధం ఓకే చేద్దామని అనుకుంటారు. ఇంతలో మీనన్ తన మనుషులతో లడ్డూల్లో వజ్రాలు పెట్టి వైజయంతికి అందించడానికి పంపిస్తాడు. ఆ లడ్డూలు తీసుకుని వచ్చిన వ్యక్తిని ఎవరని కౌషికి,సుధాకర్ నిలదీయగా.... సంక్రాంతికి మా పుట్టింటికి వెళ్లలేదని మావాళ్లు లడ్డూలు చేయించి పంపించారని వైజయంతి అబద్ధం చెబుతుంది. ఆమె కంగారు చూసి కేదార్‌, ధాత్రికి అనుమానం వస్తుంది. ఖచ్చితంగా మీనన్‌ ఆ లడ్డూల్లో వజ్రాలు పెట్టి పంపించాడని  జగధాత్రి అంటుంది. డబ్బులు కోసం అత్తయ్య మీనన్‌కు పనిచేస్తోందని ధాత్రి అంటుంది. ఆ రోజు కూడా కుంకుమ భరణిల్లో  వజ్రాలు పెట్టి సరఫరా చేశారని గుర్తు చేసుకుంటారు.             పిన్ని నిద్రపోగానే ఆ లడ్డూలు క్యాన్‌ తీసుకుని వచ్చేద్దామని కేదార్ అంటాడు. అత్తయ్య ఖచ్చితంగా  ఎక్కడో పెట్టి లాక్ వేసుకుంటుందని ఇప్పుడు ఆ లడ్డూలు బయటకు  తీయడం సాధ్యం కాదని జగధాత్రి అంటుంది. మరి ఎలా ఆ వజ్రాలను పట్టుకోవాలని కేదార్ అంటాడు. ఇంట్లోకి వచ్చిన వజ్రాలు  దుకాణాలకు చేరాలంటే  ఖచ్చితంగా అత్తయ్య  మళ్లీ ఏదో పూజగానీ, కిట్టీ పార్టీగానీ ఏర్పాటు చేస్తుందని...అప్పుడే వాటిని  బయటకు పంపించగలుగుతుందని అప్పుడు పట్టుకుందామని జగధాత్రి అంటుంది. మనం మీనన్‌ అరాచకాలు ఆపేందుకు ఊరంతా తిరుగుతుంటే...మన ఇంట్లోనే  అతనికి పనిచేసేవాళ్లను పెట్టుకున్నాడని కేదార్ బాధపడిపోతాడు. ఎలాగైనా పిన్ని బండారం బయటపెట్టాలని అనుకుంటాడు. వాళ్లు ఊహించినట్లుగానే  వైజయంతి ఇంట్లో కిట్టీ పార్టీ ఏర్పాటు చేస్తుంది. తన ప్రెండ్‌ అమెరికా వెళ్లిపోతుందని...అందుకే అందరం  ఒకసారి కలిసినట్లు ఉంటుంది ఈ పార్టీ ఏర్పాటు చేశానని కౌషికి చెబుతుంది. కేవలం తన ప్రెండ్స్‌ను మాత్రమే పిలిస్తే అనుమానం వస్తుందని నిషిక ప్రెండ్స్‌ను కూడా పిలవమని చెబుతుంది. వైజయంత్రి ప్రెండ్స్‌ వేషంలో వజ్రాలు తీసుకెళ్లడానికి  కొందరు మహిళలు వస్తారు. అలాగే  నిషిక ప్రెండ్స్‌ కూడా  వస్తారు. వజ్రాలు వాళ్ల చేతికి చిక్కితే మళ్లీ దొరకరని కేదార్ అనగా....దీనికి ఓ ఉపాయం ఆలోచించానని ధాత్రి అంటుంది.                            మారువేషంలో ఇద్దరు లేడీ కానిస్టేబుళ్లను  ఇంటికి పిలిపిస్తుంది. నిషి అడిగితే వైజయంతి ప్రెండ్స్‌ అని....వైజయంతి అడిగితే నిషిక ప్రెండ్స్‌ అని చెప్పమని చెబుతుంది. లడ్డూల బాక్స్‌ చేతికి రాగానే  వాటిల్లో  వజ్రాలు ఉన్నది లేనిది తేలిపోతుందని అంటుంది.ఇంతలో నిషికకు అనుమానం వచ్చి ఈ పార్టీ ఎందుకు ఏర్పాటు చేశారని వాళ్ల అత్తను అడుగుతుంది. ధాత్రి,  కౌషికి బుద్ధి చెప్పడానికే ఈ పార్టీ ఏర్పాటు చేశానని అబద్ధం చెబుతుంది. మన వాళ్లందరితో ఆటలపోటీలు పెట్టి దానికి వాళ్లను కూడా పిలుద్దామని....అప్పుడు వాళ్లను ఓడిద్దామని అంటుంది. ఆమె  చెప్పినట్లే  నిషిక ఆటలపోటీలు పెట్టి వారిద్దరినీ పిలుస్తుంది.

Continues below advertisement

 

Continues below advertisement