Podharillu Serial Today Episode: మహా, చక్రిని చూసిన  భూషణ్‌ కారుతో వాళ్ల కారును వెంబడిస్తుంటాడు. ఈవిషయం ప్రతాప్‌,ఆదికి ఫోన్ చేసి చెబుతాడు. లైవ్‌ లొకేషన్ పంపించి  వెంటనే రౌడీలను తీసుకుని రమ్మని చెబుతాడు. ఈలోగా భూషణ్‌కు దొరక్కుండా చక్రి తన కారును వేగంగా దొంగదారిలో పోనిస్తుంటాడు. కానీ భూషణ్ కారుతో వెంటపడుతూనే ఉంటాడు. అతనికి ప్రతాప్‌,ఆది కూడా  తోడవ్వడంతో...అందరూ కలిసి చక్రి కారును అడ్డగించి ఆపుతారు. కారు  ఆగిపోవడంతో  చక్రి, మహా కిందకు దిగుతారు. ప్రతాప్‌ తన కూతురిని వచ్చేయమని చెబుతాడు. ఆమె చక్రి వెనక్కి వెళ్లి దాక్కుంటుంది. ప్రతాప్‌ రౌడీలను ఆదేశిస్తాడు. చక్రిని చంపేసి మహాను తీసుకుని రమ్మని చెబుతాడు. అప్పుడు ఓ అద్భుతం జరుగుతుంది. సర్రుమంటూ  ఓ ఎర్రకారు దూసుుకొచ్చి వాళ్ల మధ్యకు వస్తుంది. వెంటనే మహా, చక్రి ఆ కారులో ఎక్కి పారిపోతారు. 

Continues below advertisement

చేతికి చిక్కినట్లే చిక్కి మహా మళ్లీ పారిపోవడంతో భూషణ్‌,ఆది మళ్లీతమకార్లతో ఎర్రకారు వెంటపడతారు. కూతురు చేసిన పనికి ప్రతాప్‌ చాలా అవమానంగా భావిస్తాడు.చక్రి తనకు ముందు నుంచీ తెలుసు అనుకుంటాడు. కారులో సగం దూరం వెళ్లిన తర్వాత ఇతను ఎవరని మహా చక్రిని అడుగుతుంది. ఇంతలో  ఎర్రకారులో వచ్చిన డ్రైవర్‌ తనను తాను పరిచయం చేసుకుంటాడు. తనపేరు బాలు అని చెబుతాడు. చక్రి డ్రైవర్ల గ్రూప్‌లో మెసేజ్‌ పెట్టాడని...ఆపదలో ఉన్నాం కాపడండని  అందుకే నేను వచ్చానని చెబుతాడు. అయితే బాలు వాళ్లిద్దరూ లవర్స్‌ అని...లేచిపోయి వచ్చారని అనుకుంటాడు. ఆ విధంగానే మహా వాళ్లతో మాట్లాడి మహాకు ఇరిటేషన్ తెప్పిస్తుంటాడు. తాము లవర్స్‌ కాదని...పెళ్లి చేసుకోవడం ఇష్టంలేక పారిపోయి వచ్చామని చెబుతుంది. దీనికి మా డ్రైవర్ సహాయం తీసుకున్ననని అతనికి వివరిస్తుంది. అయినప్పటికీ బాలు ఇవేమీ నమ్మకుండా వాళ్లిద్దరూ లేచిపోయి వచ్చారనే అనుకుంటాడు.ఇంతలో భూషణ్ వాళ్లను తరుముకుంటూ  వస్తుంటాడు. వాళ్లను తప్పించుకుని బాలు తన కారును వేగంగా తీసుకెళ్తుంటాడు.           

చక్రి తమ కూమార్తెను తీసుకెళ్లిన విషయం ప్రతాప్‌.. తనకు డ్రైవర్‌ను పంపించిన కార్ల యజమాని ఓంకారేశ్వరరావుకు ఫోన్ చేసి బెదిరిస్తాడు. దీంతో ఓంకారేశ్వరరావు చక్రిని వెతుక్కుంటూ వాళ్లఇంటికి వస్తాడు. మీ తమ్ముడు ఓ పెద్దింటి అమ్మాయిని లేపుకుని వెళ్లాడని...వాళ్లకు దొరికితే మీ తమ్ముడిని చంపేస్తారని మాధవ్‌తో అంటాడు.కాబట్టి  వాడు ఎక్కడ ఉన్నాడో చెప్పండని నిలదీస్తాడు.మీరు చెప్పే వరకు ఈ విషయాలేవీ తమకు తెలియదని  వాడు అసలు మా ఇంటికి రాలేదని చెబుతాడు.

Continues below advertisement

ప్రతాప్‌ చాలా డబ్బు , పరపతి ఉన్న వ్యక్తని...ఖచ్చితంగా మీ తమ్ముడిని చంపేస్తాడని బెదిరిస్తాడు. డ్రైవింగ్ చేసుకుని రమ్మని పంపిస్తే...ఇలాంటి పనులు చేస్తాడా అని తిడతాడు.ఇప్పటికే మీ ఇంటికి పిల్లను ఇవ్వడానికి ఎవరూ రావడం లేదని...ఇప్పుడు ఇలాంటి పనులు చేస్తే...ఈ జన్మలో మీ అన్నదమ్ములకు పెళ్లిళ్లు కావని హెచ్చరిస్తాడు. కాబట్టి చక్రి అందుబాటులోకి వస్తే వెంటనే ఆ అమ్మాయిని వాళ్ల ఇంట్లో దిగబెట్టి రమ్మని హెచ్చరించి వెళ్లిపోతాడు. చక్రికి ఏమవుతుందోనని మాధవ్‌ బయపడుతుంటాడు.                

భూషణ్‌, ప్రతాప్‌ వాళ్ల వెంటపడుతుండటంతో ఇకలాభం లేదనుకుని బాలు మహాను,చక్రిని తన కారులో నుంచి దింపి పోలీసుస్టేషన్‌కు వెళ్లమని సూచిస్తాడు. అక్కడికి వెళ్తే వాళ్లే రక్షణ కల్పిస్తారని చెబుతాడు. నేను ఈలోగా వీళ్లందరినీ దారిమళ్లిస్తానని చెప్పి వాళ్లను దింపి వెళ్లిపోతాడు. దీందో చక్రి, మహా ఇద్దరూ పోలీసుస్టేషన్‌కు వెళ్లిపోతారు.