Brahmamudi Serial Today Episode: కావ్యకు ఆపరేషన్‌ చేయడానికి డాక్టర్‌ రెడీ అవుతుంది. ఇంతలో కావ్య హాస్పిటల్‌ నుంచి వెళ్లిపోతుది. డాక్టర్‌ టెన్షన్‌ పడుతూ బయటకు వచ్చి దుగ్గిరాల ఫ్యామిలీకి చెప్తుంది. అందరూ టెన్షన్‌ పడుతుంటే.. కళ్యాణ్‌ వదిన ఎక్కడికి వెళ్లిందో తనకు తెలుసు అన్నయ్య దగ్గరకే వెళ్లి ఉంటుంది నేను వెళ్లి తీసుకొస్తాను అంటూ కళ్యాణ్‌ వెళ్లిపోతాడు. అప్పుడే మంత్రి ధర్మేంద్ర భార్య తులసిని కూడా అదే హాస్పిటల్‌కు డెలివరీ కోసం తీసుకొస్తారు. ఇక కావ్య స్టేసన్‌ లో రాజ్‌ దగ్గరకు వెళ్తుంది.

Continues below advertisement

రాజ్: ఏంటి కళావతి నువ్వు కండీషన్‌ ఏంటి నువ్వు చేస్తున్న పనేంటి

కావ్య: అది కాదండి మీరు ఇక్కడ ఇలా

Continues below advertisement

రాజ్‌: ఈ పరిస్థితుల్లో నువ్వు ఇక్కడకు ఎందుకు వచ్చావు కళావతి

కావ్య: ఏం చేయనండి.. నా వల్ల కావడం లేదు.. మీరెలా ఉన్నారో..? మీ పరిస్థితి ఏంటో నాకు ఏమీ తెలియడం లేదు. ఎంత అడిగినా ఎవ్వరూ ఏమీ చెప్పడం లేదు.. నా మనసు అంతా కకావికలం అయిపోతుందండి.. ఒక్కక్షణం కూడా మీరు లేకుండా హాస్పిటల్‌ లో ఉంలేకపోతున్నానండి

రాజ్‌: కళావతి నాకేం అవుతుంది. అరెస్ట్‌ చేశారు ఈ స్టేషన్‌లో ఉన్నాను.. అంతే కదా..? కానీ నువ్వు ఎంత ప్రమాదంలో ఉన్నావో తెలుసా..?

కావ్య: మీరు పక్కన లేరు కాబట్టే ఇదంతా ప్రమాదంగా మారిందండి.. మీరే కనక నా కళ్ల ముందు ఉండి ఉంటే.. నేను ఇలా ఉండేదాన్ని కాదు..

రాజ్‌: ఇప్పుడేమైంది కళావతి నువ్వెందుకు ఇంత కంగారు పడుతున్నావు.. హాస్పిటల్‌ నుంచి బయటకు వచ్చే సాహసం చేశావు..

కావ్య: ఇంకా ఏం జరగాలి అండి మీరు దొంగ బంగారం కొనడం ఏంటి..? మీ కారులో బంగారం దొరకడం ఏంటి..? ఎవరో చెప్తే ఈ  పోలీసులు మిమ్మల్ని అరెస్ట్‌ చేసి తీసుకుని రావడం ఏంటి..? అంతా అయోమయంగా ఉందండి. మీతో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా తీసుకొచ్చారండి.. మీరు ఎలా ఉన్నారో తెలియదు..? ఎప్పుడు వస్తారో తెలియదు..? ఎలా వస్తారో తెలియదు.. అందుకే నేను వచ్చేశానండి.

రాజ్‌: కళావతి నేను కళ్యాణ్‌కు చెప్పాను కదా..? ఎట్టి పరిస్థితుల్లో నీ ఆపరేషన్‌ టైంకు నీ పక్కనే ఉంటానని చెప్పాను కదా.. వాడు నీకు చెప్పలేదా..?

కావ్య: ఏవండి నేను మీ భార్యనండి వాళ్లు అబద్దం చెబితే పసిగట్టలేనేమో కానీ మీరు అబద్దం చెప్తే మాత్రం తెలుసుకోలేనా..? కవి గారు నాకోసం అబద్దం చెప్పారు.. కానీ మీరు కూడా అదే అబద్దం చెప్పి మోసం చేస్తున్నారా..? మీరు రారని రాలేని పరిస్థితుల్లో ఉన్నారని.. అలా చెప్తే.. నేను తట్టుకోలేనని నాకు అబద్దం చెప్పానని కవి గారు అత్తయ్య వాళ్లకు చెప్తుంటే నేను విన్నాను..

రాజ్‌: సారీ కళావతి నా మాట విని నువ్వు హాస్పిటల్‌కు వెళ్లిపో

కావ్య: మీరు నాతోనే రావాలి.. నేను వెళ్లి ఎస్సై గారినే అడుగుతాను.. ఎస్సై గారు మా వారు ఆ తప్పు చేయలేదండి.. మా వారి గురించి ఈ సిటీలో ఎవరినైనా అడగండి అయన ఎలాంటి వారో చెప్తారు.

ఎస్సై: తెలసమ్మా కానీ సాక్ష్యాలు బలంగా ఉన్నాయి.. ఈ పరిస్థితుల్లో నేను ఏమీ చేయలేను మీరు కోర్టులో చూసుకోండి..

అని చెప్పగానే.. కావ్య బాధగా రాజ్‌ దగ్గరకు వెళ్లి ఏడుస్తుంది. ఇంతలో కళ్యాణ్‌ వచ్చి కావ్యను కన్వీన్స్‌ చేసి అక్కడి నుంచి తీసుకెళ్తాడు. మరోవైపు హాస్పిటల్‌ లో జాయిన్‌ అయిన తులసి రిపోర్ట్స్‌ అని చెక్‌ చేసిన డాక్టర్‌ ఎలాంటి ప్రాబ్లమ్‌ లేదని వెంటనే ఆపరేషన్‌ చేద్దామని చెప్తాడు. ధర్మేంద్ర, తులసి హ్యాపీగా ఫీలవుతారు. ఇక కావ్యను తీసుకుని కళ్యాణ్‌ హాస్పిటల్‌కు రాగానే.. ఫెయిన్స్ మొదలవుతాయి. డాక్టర్‌ వెళ్లి ట్రీట్‌మెంట్‌ చేస్తుంది. ఇంతలో రాజ్, కానిస్టేబుల్‌ ఫోన్‌ తో కళ్యాణ్‌కు కాల్ చేసి కావ్య పరిస్థితి తెలుసుకుని తాను స్టేసన్‌ నుంచి తప్పించుకోవడానికి ఒక ప్లాన్‌ చేశానని అందుకు కళ్యాణ్‌ను సహకరించమని అడుగుతాడు రాజ్‌. కళ్యాన్‌ ఓకే అంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!