Podharillu Serial Today Episode: మహాఎదురుపడటంతో నేను కిడ్నాప్‌కు గురైనందుకు నీకు అసలు బాధగా లేదనుకుంటా అని నిలదీస్తాడు.అలాంటిదేమీ లేదని...వాళ్లు మిమ్మల్ని ఏమీ చేయకుండా వదిలిపెట్టినందుకు సంతోషంగా ఉందని అంటుంది. రిజిస్టర్ మ్యారేజీ  ఆగిపోయినందున మనం బాగా ఆలోచించి మళ్లీ నిర్ణయం తీసుకుందామని మహా అనగా....నేను ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నానని చెప్పి భూషణ్‌ వెళ్లిపోతాడు.

Continues below advertisement

                  పెళ్లి చెడిపోయిందన్న ఆనందంతో మహా పరుగులు పెట్టుకుంటూ  డైనింగ్ టేబుల్‌ వద్దకు వస్తుంది.అప్పటికే అక్కడ అందరూ అన్నం తింటుంటారు. పెళ్లి ఆగిపోయినందుకు ఏదో కీడులా ఉందని కాబట్టి గుడికి వెళ్లి పూజ చేయిద్దామని మహా వాళ్ల అమ్మ అంటుంది. ఏ ఆటంకాలు రాకుండా వినాయకుడికి పూజ చేయిద్దామని ప్రతాప్‌ అంటాడు. ఇదే తనకు తగిన టైం అని భావించిన మహా...నిజంగా అతను నాకు కరెక్ట్ కాదని వాళ్ల నాన్న ప్రతాప్‌తో  అంటుంది. అందుకే  దేవుడే ఈ పెళ్లివద్దని ఆపాడేమో అంటుంది.

ఇక ఇంతటితో ఈ సంబంధం క్యాన్సిల్‌ చేద్దామని చెప్పగా....ప్రతాప్‌ తీవ్రస్థాయిలో మండిపడతాడు. అసలు రిజిస్టర్ మ్యారేజీ ఆగిపోవడానికి కారణమే నువ్వు అని అంటాడు. పెళ్లి చూపులు మొదలైనప్పటి నుంచి నువ్వు అడ్డుతగులుతూనే ఉన్నావు. పెళ్లి ఆగిపోవాలని పదేపదే కోరుకున్నావు...అందుకే ఇలా అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. నెగిటివ్‌గా మాట్లాడి మాట్లాడి నీ పంతం నెగ్గించుకున్నావ్ అంటాడు. ఏం చేసినా ఈ పెళ్లి జరిపిస్తానని..ఎలాంటి అడ్డంకులు రాకూడదనే మూడురోజుల్లో  పెళ్లి ముహూర్తం పెట్టించానని చెప్పడంతో  మహా షాక్‌కు గురవుతుంది. ఈ పెళ్లిని ఏ శక్తి  ఆపలేదని...దీని గురించి మళ్లీ మాట్లాడి నాకు ఆగ్రహం తెప్పించొద్దంటూ చేతులు కడుక్కుని లేచి వెళ్లిపోతాడు ప్రతాప్‌.                             మాధవ్‌ పెళ్లిచూపులకు వెళ్లిన అమ్మాయి కవిత తిరిగి మాధవ్‌కు ఫోన్ చేసి పలకరిస్తుంది. మీ అమ్మానాన్నలు మమ్మల్ని అపార్థం చేసుకుని వెళ్లిపోయారు కదా...మళ్లీ ఎందుకు ఫోన్ చేశారని మాధవ్ అంటాడు. మిమ్మల్ని పర్సనల్‌గా కలిసి మాట్లాడాలని అంటుంది. రెస్టారెంట్‌లో కలుద్దామని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇంతలో వాళ్ల నాన్న చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి మహాకు కోపంతో నిద్రపట్టదు. వచ్చి చక్రితో గొడవపడుతుంది.

Continues below advertisement

నువ్వు కిడ్నాప్ చేసి పెళ్లి ఆపేస్తే....వాళ్లు మూడురోజుల్లో ముహూర్తం పెట్టించారని చెబుతుంది. పెళ్లికొడుకును కిడ్నాప్ చేశారంటే...ఎవరో ఈ పెళ్లి ఆపడానికి ట్రై చేస్తున్నారన్న సంగతి మా వాళ్లకు అర్థమై ఉంటుందని...అందుకే ఈపెళ్లి ముందుకు జరిపారని మహా చెబుతుంది. ఇందులో నేను చేసిన తప్పు ఏంటని చక్రి అంటాడు. మీవాళ్లు ముహూర్తం మందుకు తెస్తే...నాకు ఏం సంబంధం అంటాడు. అయితే ఈ పెళ్లి ఎలా ఆపాలని మహా అడుగుతుంది. మీరు ఇప్పుడే కదా చెప్పారు...ఇంకా మూడురోజుల సమయం ఉందిలేండి అని చక్రి అభయమిస్తాడు. అంతా నేను చూసుకుంటానని మీరు హ్యాపీగా వెళ్లి పడుకోండని చెబుతాడు.                          మహాలక్ష్మీ వాళ్ల ఇంట్లో తెల్లారగానే పెళ్లిపనులు మొదలుపెట్టేస్తారు. పసుపు కొట్టడం స్టార్ట్‌ చేస్తారు. ఇల్లంతా బంధువులతో కళకళలాడుతుంటుంది. చక్రికి ఏం చేయాలో అర్థం కాదు. మహాకూడా  చాలా భయపడుతుంటుంది.