Lakshimi Raave Maa Intiki Serial Today Episode: లక్ష్మీని చూసుకోవడానికి వచ్చిన పెళ్లికొడుకుని ఆమె నచ్చడంతో కట్నం కూడా వద్దని అంటాడు. ఇంతలో ఆమె తండ్రి కోటేశ్వరావు కలుగజేసుకుని...మా అమ్మాయి బాగా చదువుకుంటుందని...గోల్డ్‌మెడల్ కూడా వచ్చిందని చెబుతాడు. కాబట్టి చదవించే అబ్చాయికే మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తామని చెబుతాడు. ఈ మాటలకు నూకాలు అడ్డుచెబుతుంది. మంచి సంబంధం వస్తే లేనిపోనివి చెప్పి చెడగొట్టేలా ఉన్నావ్ అని అంటుంది. దీనికి కోటేశ్వరరావు అడ్డుచెబుతాడు. వాళ్లు చదివిస్తానంటేనే ఈపెళ్లికి ఒప్పుకుంటానని అంటాడు. దీనికి మగపెళ్లివారు ఒప్పుకోరు...కానీ పెళ్లి కొడుకు మాత్రం తనకు ఓకే అని అంటాడు. దీనికి శ్రీలక్ష్మీ ఎంతో సంతోషపడుతుంది. మంచిరోజులు చూసి ముహూర్తులు పెట్టుకుందామని అంటాడు. మా అమ్మానాన్నల ఇష్టమే తన ఇష్టమని లక్ష్మీ చెబుతుంది.
శ్రీలక్ష్మీని ఒకసారి చూడాలని ఉంది పిలిపించమని సూర్యనారాయణ చెప్పడంతో...గోపీ లక్ష్మీకి ఫోన్ చేసి రమ్మని చెబుతాడు. దీంతో తండ్రీ, కుమార్తెలిద్దరూ అక్కడికి బయలుదేరి వెళ్తారు. ఇంతలో ఈ పెళ్లి చెడగొట్టి ఈ ఊరి నుంచి సింధూను పంపించేయడానికి మ్యాడీ, ప్రియం వద కుట్రలు పన్నుతుంటారు. ఇంతలో లక్ష్మీ అక్కడికి వచ్చి సూర్యనారాయణ ఆశీస్సులు తీసుకుంటుంది. ఆమెను పొగుడుతూ నువ్వు బాగా చదువుకుంటున్నావని గోపి చెప్పాడని...ఆమెను సూర్యనారాయణ అభినందిస్తాడు. ఇంట్లో ఉన్న వాళ్లందరికీ కోటేశ్వరరావును,శ్రీలక్ష్మీని సూర్యనారాయణ పరిచయం చేస్తాడు. ఈయన వల్లే మనకి ఇంత గొప్ప సంబంధం దొరికిందని చెబుతాడు. శ్రీలక్ష్మీ ని బాగా చదివించాలని చెబుతాడు.అప్పుడే ఎందుకు పెళ్లి చేస్తున్నావని అడగ్గా...పెళ్లి తర్వాత కూడా చదివిస్తానన్న అబ్బాయికే ఇచ్చి పెళ్లిచేస్తున్నాని కోటేశ్వరావు చెబుతాడు. శ్రీలక్ష్మీని మెచ్చుకుంటూ తనకు ఎంతో ఇష్టమైన, తన గౌరవాన్ని కాపాడే పెన్నును తీసి ఆమెకు ఇస్తాడు. ఇది పెన్నుకాదని...అది నా గౌరవం అంటాడు. దాన్ని తీసుకుని కళ్లకు అద్దుకుని లక్ష్మీ తీసుకుంటుంది. లక్ష్మీ కాసేపు ఇక్కడే ఉంటుందని...తర్వాత పంపిస్తానని చెప్పడంతో కోటేశ్వరరావు వెళ్లిపోతాడు.
ఇంతలో ఊరిలో ఉన్నవాళ్లంతా సూర్యనారాయణను కలవడానికి ఆయన ఇంటికి వస్తారు. వాళ్లకు సింధూజాక్షిని పరిచయం చేయగా....వాళ్లంతా ఆమెను చుట్టుముట్టి ముద్దులుపెడుతుంటారు. దీంతో ఆమె చిరాకుపడి ముసలావిడను కిందకు నెట్టిపడేస్తుంది. దీంతో సూర్యనారాయణకు తీవ్రమైన కోపం వచ్చి ఏం జరిగిందని నిలదీస్తాడు. లక్ష్మీ ఏదో చెప్పబోతుంటే...అడ్డుపడి ఏం జరిగిందో చెప్పమని సింధూను గట్టిగా నిలదీస్తాడు. గొడవను సద్దుమణిగించాలని నువ్వు చూస్తున్నావని అది నీ సంస్కారమని...కాకపోతే ఏం జరిగిందో తెలుసుకోవడం నా బాధ్యత కాబట్టి నిజం చెప్పమని లక్ష్మీని అడుగుతాడు. దీంతో సింధూ,మ్యాడీ నిజం చెప్పొద్దని సైగ చేస్తున్నా....లక్ష్మీ తప్పక నిజం చెబుతుంది. వదినకు జామపండు తినిపించాలని ఆ పెద్దావిడ ప్రయత్నిస్తుంటే...సింధూకు ఇబ్బంది అనిపించి తోసేస్తే కిందపడిందని చెప్పేస్తుంది. దీంతో సూర్యనారాయణ తీవ్రమైన కోపంతో రగిలిపోతాడు. సింధూపై గట్టిగా అరుస్తాడు. పెద్దవాళ్లపై గౌరవం లేకుండా ఇలా ప్రవర్తించడం పద్దతి కాదని...పెద్దావిడ కాళ్లుపట్టుకుని క్షమాపణ కోరాలని అంటాడు. ఎవరు చెప్పినా పెద్దాయన వినడు. దీంతో క్షమించాలని సింధూ ఆవిడను కోరుతుంది. కాళ్లుపట్టుకుని చెప్పమని మరోసారి గద్దిస్తాడు. చేసేది లేక సింధూ పెద్దావిడ కాళ్లుపట్టుకుని క్షమించమని కోరుతుంది. దీనంతటికి లక్ష్మీయే కారణమని మ్యాడీ, సింధూ కక్షపెంచుకుంటారు.
ముసలివాళ్లంతా ఇంటికి వెళ్లిపోతామని చెప్పగా....మీరందరూ ఇక్కడే భోజనం చేయాలని సూర్యనారాయణ చెబుతాడు. ఒంటరి వాళ్లంతా కలిసి రాత్రి భోజనాలు వండుకుని ఒకేచోట రోజూ తింటారని గోపి చెబుతాడు. ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఉంటారని చెప్పగా...ఇదంతా లక్ష్మీ ఆలోచనేనని వాళ్లు చెబుతారు.దీంతో మరోసారి లక్ష్మీని సూర్యనారాయణ మెచ్చుకుంటారు.అయితే ఇవాళ మేం కూడా మీతోనే భోజనం చేస్తామని చెప్పడంతో లక్ష్మీ సరేనంటుంది. దీంతో అందరూ కలిసి భోజనాలకు ఏర్పాట్లు చేస్తుంటారు. ఊరిలో వాళ్లతో కలిసి సూర్యనారాయణ కుటుంబం కూడా భోజనాలకు సిద్ధమవుతారు.అటు ఇదే రాజు రాత్రికి సింధూను ఊరి నుంచి పంపించేందుకు మ్యాడీ ఏర్పాట్లు చేస్తుంటాడు. ఆ విషయం ఆమెకు చెబుతుండగా...లక్ష్మీ గదిలోకి వస్తుంది.