Podharillu Serial Today Episode: మహా రిజిస్ట్రర్‌ మ్యారేజీ పనులు చురుగ్గా సాగుతుంటాయి. హైదరాబాద్‌లో పెళ్లి షాపింగ్ పూర్తవ్వడంతో....యాదగిరిగుట్ట నరసింహస్వామిని దర్శించుకుని మహావాళ్లు తిరిగి వెళ్లిపోవడానికి సిద్ధమవుతారు. దీంతో చక్రిని ఇకపై రావొద్దని ఆది చెబుతాడు.  ఆ మాటలకు చక్రి చాలా ఫీలవుతాడు. మహాను  లైన్‌లో పెడదామనుకుంటుంటే... ఇప్పుడు డ్రైవర్‌ ఉద్యోగం నుంచి వెళ్లిపొమ్మంటున్నారే అనుకుంటాడు. తమను యాదగిరిగుట్టలో దింపి నువ్వు వెళ్లిపోవచ్చని ఆది చెబుతుండగా....అప్పుడే  అక్కడికి వచ్చిన ప్రతాప్‌...మాకు పెళ్లి అయ్యేవరకు తాత్కాలిక డ్రైవర్‌ కావాలని నువ్వు మా  ఊరు వచ్చి ఉండగలవా అని అడగడంతో చక్రి ముఖంలో వెలుగు వస్తుంది. తప్పకుండా తానే వస్తానని ప్రతాప్‌తో అంటాడు. దీంతో అందరూ కలిసి యాదగిరి గుట్ట బయలుదేరతారు.

Continues below advertisement

యాదగిరి గుట్ట వెళ్తుండగా మార్గమధ్యలోచిన్న స్పీడ్‌బ్రేకర్ వద్ద కారు ఎత్తివేయడంతో ప్రతాప్‌ కంగారుపడి  మహాకు ఏమైనా అయ్యిందా అని అడుగుతాడు. చక్రిని చిన్నగా బండి పోనివ్వాలని అరుస్తాడు. అలాగే దారిలో మహాకు ఇష్టమైన స్వీట్‌ కొనాలి ఆపమని డ్రైవర్‌ను ఆదేశిస్తాడు. దీంతో మహా వాళ్ల నాన్నపై కోప్పడుతుంది. నాకు చిన్న దెబ్బతగిలినా ఓర్చుకోలేని మీరు...నా లైఫ్‌కు సంబంధించిన విషయంలో మాత్రం ఎందుకు ఇంత కఠినంగా ఉంటున్నారని నిలదీస్తుంది. నాకు ఇష్టం లేని పెళ్లి ఎందుకు చేస్తున్నారని మండిపడుతుంది. ఈ డిష్కషన్‌లో మహాకు భూషణ్‌ను పెళ్లిచేసుకోవడం ఇష్టం లేదన్న సంగతి చక్రికి తెలిసిపోతుంది. అందరూ  స్వీట్స్‌ కొనడానికి కిందకు దిగడంతో  మహా ఒక్కరే కారులో ఉంటుంది. దీంతో చక్రి ఆమెకు ధైర్యం చెప్పడానికి  ట్రై చేస్తుంటాడు. ఈ రిజిస్ట్రర్ మ్యారేజీ ఆగిపోతుందని...మీరు భయపడొద్దని చెబుతాడు. ఇంటికి తిరిగివచ్చిన మహా భోజనాల దగ్గర మళ్లీ ఈ పెళ్లివద్దని గొడవ చేస్తుంటుంది. అతని సంగతి తెలిసే వాళ్ల అమ్మానాన్న ఈపెళ్లి ఎక్కడ చెడగొడతాడోనని ముందుగానే రిజిస్ట్రర్‌ మ్యారేజీ చేయాలని అనుకుంటున్నట్లు ఉన్నారని వాళ్ల నాన్నతో అంటుంది.  ఒక ఆడపిల్ల అభిప్రాయాలకు విలువ ఇవ్వని వాడితో జీవితాంతం ఎలా కాపురం చేయాలని అంటుంది. నువ్వు నెగిటివ్‌గా ఆలోచించవద్దని... ప్రతాప్ సర్దిచెబుతాడు. ఈవిషయంలో ఎలాంటి మార్పు లేదని....అతనిపై నీకు ఉన్న అభిప్రాయం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని తల్లి తేల్చి చెబుతుంది. దీంతో మహా అలిగి అన్నం తినకుండా  వెళ్లిపోతుంది.

Continues below advertisement

బయట ఆకలితో చక్రి అటూ ఇటు తిరుగుతుంటాడు. ఇంతలో మహా అక్కడికి వచ్చి కూర్చుంటుంది. నేను బయటకు వెళ్లి అన్నం తిని రావాలా అని అడుగుతాడు. మీ భోజనాల దగ్గర ఏదో గొడవ జరిగినట్లు ఉంది కదా...నాకు అన్నం పెడతారో లేదో అని అంటాడు. దీంతో మహా లోపలికి వెళ్లి అన్నం పట్టుకుని వస్తుంది. చక్రి వాటిని తీసుకుని కిందకూర్చుని తినబోతుంటే..ఛైర్‌లో కూర్చుని తినమని చెబుతుంది. అతను తింటూ  మీ చేతివంట అద్భుతంగా ఉందని చెప్పడంతో....నాకు వంట చేతగాదని మహా చెబుతుంది.

ఇంతలో రిజిస్ట్రర్ మ్యారేజీ నేను ఆపిస్తానని చెప్పాను కదండి...మీరు మళ్లీ బాధపడొద్దని అంటాడు. దీంతో మహాకు కోపం వచ్చి చక్రిపై అరుస్తుంది. నీకు ఈవిషయంతో ఏం సంబంధం...నువ్వు ఎందుకు జోక్యం చేసుకుంటున్నావని నిలదీస్తుంది. అసలు నా పెళ్లి ఆపడానికి నువ్వు ఎవరని గట్టిగా మండిపడుతుంది. ఒక ఆడపిల్లకు సాయం చేయడం కూడా తప్పా అని అంటాడు. రిజిస్ట్రర్ మ్యారేజీ జరగకుండా చూస్తానని హామీ ఇస్తాడు.