Podharillu Serial Today Episode: భూషణ్‌కు ఎర్రరంగు చీర ఇష్టం లేదని తెలిసికూడా కావాలనే మహా ఎర్రరంగు చీర పెళ్లి కోసం సెలక్ట్ చేస్తుంది. వాళ్ల అత్తయ్య చెప్పినా వినకుండా రెడ్‌కలర్ నా ఫేవరెట్ అంటుంది. భూషణ్‌మాత్రం తనకు నచ్చిందే తీసుుకోమని చెప్పడంతో మహా షాక్ అవుతుంది. వద్దని గొడవ చేస్తాడనుకుంటే...ఇలా అన్నాడేంటని ఫీల్‌అవుతుంది. పెళ్లిచూపుల సంగతి ఏమైందని తన వద్ద పనిచేసేవాళ్లు మాధవ్‌ను అడుగుతారు. దీనికి అతను చాలా ఫీల్అవుతాడు. మా ఇంటి గురించి ఎవరో వారికి తప్పుగా చెప్పారని...అందుకే మళ్లీ చెడిపోయిందని అంటాడు. ఇంతలో ఓ కుర్రాడు వచ్చి మీ నాన్న గాయత్రి వాళ్ల ఇంటికి వెళ్లి గొడవ చేస్తున్నాడని మాధవ్‌కు చెప్పడంతో అతను పరుగుపరుగునా అక్కడికి వెళ్తాడు. ఇంతలో నారాయణ అక్కడ గొడవ చేస్తుంటాడు. నా కొడుకు పెళ్లి చెడగొడతారా అంటూ మండిపడతాడు. నీఇల్లు, నిన్ను చూసి వాళ్లే వెళ్లిపోయి ఉంటారంటూ తాయర్ తిడుతుంది. ఇంతలో నారాయణ వాళ్ల అన్న,చెల్లి ఇద్దరినీ కొడతాడు. ఇంతలో అక్కడికి వచ్చిన మాధవ్ వాళ్ల నాన్నను ఆపుతాడు. నీ పెళ్లి చెడిపోయిందని మా ఇంటిమీదకు మీనాన్నను పంపిస్తావా అని తాయర్ మాధవ్‌ను నిలదీస్తుంది. మీ అన్న నాకళ్లముందే వాళ్లకు మా గురించి చెడుగా చెప్పి పెళ్లి చెడగొట్టాడని మాధవ్ చెబుతాడు. అందుకే మానాన్నకు కోపం వచ్చిందని అంటాడు. ఇంటిలో వాటా కోసం కోర్టులో కేసు పెట్టామని కావాలనే ఇలా గొడవపడుతున్నారంటూ తాయర్ వాళ్ల అన్నను తీసుకుని లోపలికి వెళ్లిపోతుంది. అటు మహాను పెళ్లికి ఒప్పించేందుకు నిహారికి ప్రయత్నిస్తుంటుంది. కేవలం మనం భూషన్‌లో చెడును మాత్రమే చూస్తున్నామని...ఇవాళ చూడువాళ్ల అమ్మకు నచ్చకపోయినా, తనకు రెడ్‌కలర్ ఇష్టం లేకపోయినా నీకోసం ఆ చీర కొన్నాడని చెబుతుంది. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ పెళ్లి అతనితోనే మీనాన్న జరిపిస్తాడని చెబుతుంది. నువ్వు కొంచెం అతనితో ఫ్రీగా మాట్లాడని సూచిస్తుంది. నీ గోల్స్,ఫ్యూచర్‌లో ఏం చేయాలనుకుంటున్నావో అతనితో మనసు విప్పి చెప్పమని చెబుతుంది. పెళ్లి ఎలాగూ తప్పించుకోలేవు కాబట్టి....అతనితో నీ మనసులో ఉన్న మాట చెప్పి ఒప్పించమని అంటుంది. దీనికి మహా సరేనంటుంది. ఇంతలో మహాను లైన్‌లో పెట్టడానికి ట్రై చేస్తున్న చక్రికి తనే పెళ్లికూతురు అని తెలిసి షాక్ తింటాడు. ఆది, నిహారికి ఇద్దరూ భూషణ్ వద్దకు వెళ్లి మహాను బయటకు తీసుకెళ్లాలని చెబుతారు. ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకోవచ్చని సూచిస్తారు. దీంతో అతను సరే అనడంతో ఇద్దరూ కారులోబయటకు బయలుదేరతారు.కారులోనూ ఇద్దరూ పోట్లాడుకుంటూనే ఉంటారు. నా గోల్ గురించే చెప్పాలనే వచ్చానని మీరు కొంచెం నాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని మహా అంటుంది. నేనొక డ్రీమ్ ప్రాజెక్ట్ రెడీ చేశానని ఓ పెద్ద కంపెనీ నా ప్రాజెక్ట్ ఓకే కూడా అందని చెబుతుంది. ఇంతలో పెళ్లిచూపులు జరిగాయని అంటుంది.అయితే ఇప్పుడు ఏం చేయమంటావని భూషణ్ అంటాడు. పెళ్లయిన తర్వాత కూడా నా కల ఆగిపోకూడదని....పెద్ద ఆర్కిటెక్ట్‌గా పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నట్లు మహా భూషణ్‌కు చెబుతుంది. పెళ్లయిన తర్వాత కూడా జాబ్ చేయాలని అనుకుంటున్నట్లు మహా అతనికి వివరించి చెబుతుంది. దీంతో అతని కోపంతో రగిలిపోతాడు. నువ్వు జాబ్ చేస్తుంటే నేనే ఇంట్లో పనిచేసుకోవాలా అని అంటాడు. నాకు కావాల్సినంత డబ్బు ఉందని...నా పెళ్లాం జాబ్ చేసి సంపాధించాల్సిన అవసరం లేదని అంటాడు. నాకు వంట వండిపెట్టాలని అంటాడు. నా భార్య పెద్దచదువులు చదివిందని గర్వంగా నా ప్రెండ్స్‌కు చెప్పుకోవడానికే నీ చదువు పనికొస్తుందని అంటాడు. నీ జాబ్ చేస్తుంటే...ఇంటిపని, వంటపని ఎవరుచేస్తారని అంటాడు. ఇల్లు చూసుకుని..నా అవసరాలు చూసుకుంటే చాలని తేల్చి చెబుతాడు. ఇకపై ఇదే నీ డ్రీమ్ కావాలని అనడంతో మహాకోపంతో రగిలిపోతుంది.
Podharillu Serial Today December22nd: భూషణ్‌కు తన డ్రీమ్ గురించి చెప్పడానికి బయటకు తీసుకెళ్లిన మహాకు ఎలాంటి అనుభవం ఎదురైంది..?
ABP Desam | 22 Dec 2025 08:52 AM (IST)
Podharillu Serial Today Episode December 22nd: భూషణ్‌ను బయటకు తీసుకెళ్లి తన కలలు,డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి మహా అతనికి చెబుతుంది. దీంతో మండిపడిన భూషణ్ ఏం చెప్పాడు..? దీనికి మహా రియాక్షన్ ఏంటి..?
పొదరిల్లు సీరియల్