Podharillu Serial Today Episode: మహాకు పెళ్లి బట్టలు కొనేందుకు వాళ్ల  పెళ్లికొడుకుతో కలిసి హైదరాబాద్‌ వెళ్లేందుకు బయలుదేరతారు. ఈలోగా వాళ్ల నాన్నకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పేందుకు ట్రై చేయడానికి మహా  గదిలో రిహార్సల్స్ చేస్తుంటుంది. ఈలోగా ప్రతాప్ పిలవడంతో పరుగు పరుగున వచ్చేస్తుంది. కిందకు రాగానే అప్పటికే  పెళ్లికొడుకు కుటుంబం రెడీగా వచ్చి ఉండటం చూసి మహా షాక్‌కు గురవుతుంది. ఇప్పుడు వీళ్ల ముందు నాన్నతో ఎలా మాట్లాడేది అనుకుంటుంది. ఇక చేసేది లేక పెళ్లికొడుకుతోపాటు బట్టలు కొనేందుకు  హైదరాబాద్‌ బయలుదేరతారు. మహాతోపాటు అందరూ కారులో కూర్చుంటారు. కారులో మహా పక్కనే పెళ్లికొడుకు భూషణ్ కూర్చోగా...మహా వాళ్ల వదినకు సైగ చేస్తుంది. దీంతో ఆమె భూషణ్‌ను డ్రైవ్‌ చేయమని కోరుతుంది. మా ఆయన డ్రైవింగ్ మధ్యలో నిద్రపోతాడని...కాబట్టి నువ్వు డ్రైవ్ చేయాలని కోరుతుంది. దీంతో అతను సరేనంటాడు.

Continues below advertisement

   నారాయణ ఇంటికి పెళ్లిళ్ల బ్రోకర్‌ వచ్చి..మొన్న వెళ్లిన సంబంధం గురించి చెబుతాడు. అమ్మాయికి అబ్బాయి బాగా నచ్చాడని చెబుతాడు. దీంతో అందరూ సంతోషపడతారు.కానీ వాళ్లు ఒకటే ఒకటి అడుగుతున్నారని...వాళ్లు ఇక్కడికి వచ్చి ఇల్లు,వాకిలి చూసుకున్న  తర్వాతే  పెళ్లి ఖాయం చేసుకోవాలనుకుంటున్నారని చెబుతాడు. అయితే ఇక పెళ్లి అయినట్లేనని నారాయణ అంటాడు. ఈ ఇల్లు చూస్తే పిల్లను ఎవరు ఇస్తాడని అంటాడు. దీంతో బ్రోకర్‌కు కోపం వస్తుంది. నిజంగా ఇతను మీనాన్నేనా అంటాడు. మొదటి నుంచి అన్నీ అశుభం మాటలే మాట్లాడుతున్నాడని మండిపడతాడు. వాళ్లు ఎప్పుడు వస్తారని అడగ్గా...ఇల్లు కొంచెం పాతదిగా ఉందని కొంచెం బాగు చేయించిన తర్వాత చెబితే వాళ్లను పిలుస్తానని చెబుతాడు. ఇది బాగుచేయించడం కుదరదని...కోర్టు అందుకు  ఒప్పుకోదని చెబుతారు. నారాయణ మాటలకు కోపగించుకుని పెళ్లిళ్ల బ్రోకర్ వెళ్లిపోతాడు. మీ నాన్న ఇలా ప్రవర్తిస్తే మీకు పెళ్లిళ్లు అయినట్లేనని అంటాడు.

   చక్రి కారు ఎక్కిన ప్యాసింజర్‌...ఎవరూ పెట్టని విధంగా పెళ్లికాని అమ్మాయిలకు 50శాతం డిస్కంట్‌ పెట్టావేంటని అడుగుతాడు. నాకు ఇప్పటి వరకు పెళ్లికాలేదని...ఎవరైనా పెళ్లికాని అమ్మాయి కారు ఎక్కితే...వివరాలు కనుక్కుని పెళ్లిచేసుకుందామనే అలా పెట్టానని చెబుతాడు.నీకోసం పుట్టిన అమ్మాయి నీకు ఖచ్చితంగా ఎదురుపడుతుందని అతను చెబుతాడు.  ఇంతలో భూషణ్ వేగంగా వచ్చి చక్రి కారును ఢీకొడతాడు. దీంతో ఇద్దరూ కిందకు దిగి గొడవపడతారు. ఇంతలో ఆది కారు దిగి ఇద్దరికి సర్దిచెబుతుంటాడు. ఇంతలో భూషణ్ బూతులు తిడుతూ  చక్రి చొక్కా పట్టుకుంటాడు. గొడవ పెద్దదవుతుండటంతో  భూషణ్ పోలీసులను పిలుస్తానని అంటాడు. ఇంతలో ఆది అతన్ని వారిస్తాడు. అనవసరంగా పోలీసులను పిలిస్తే....అందరినీ స్టేషన్‌కు పిలుస్తారని చెబుతాడు.

Continues below advertisement

కారులో  లేడిస్‌ ఉన్నారు బాగుండదని అంటాడు. అయినా సరే శాంతించని భూషణ్ మరోసారి చక్రి చొక్కా పట్టుకుని గొడవపడతాడు. ఘర్షణ ముదిరేలా ఉండటంతో  మహా కారు దిగి వస్తుంది. అతను కరెక్ట్‌ రూట్‌లోనే  వచ్చాడని...మీరే తప్పుగా వచ్చారని భూషణ్‌ను అంటుంది. మన తప్పు ఉన్నప్పుడు సారీ చెబితే  సరిపోతుంది కదా...దీనికి ఇంత సీన్ చేయడం ఏంటని అంటాడు. దీంతో చక్రికి అవకాశం దొరుకుతుంది. మీకారులో ఉన్నవాళ్లే చెబుతున్నారు కదా...నా తప్పు ఏం లేదని అంటాడు. ఇంతలో ఆది అతనికి డబ్బులు  ఇవ్వబోగా...నా కారుకు ఎలాంటి డ్యామేజీ కాలేదు కాబట్టి డబ్బులు వద్దని అంటాడు.

ఇంతలో మహా కలుగజేసుకుని ఇప్పటికైనా అర్థమైంది కదా...అతను డబ్బుల కోసం గొడవ చేయలేదని ఇక వెళ్లిపోదాం అని అంటుంది. మర్యాద కోసమే గొడవపడ్డాడని...ఇప్పటికైనా  మన మర్యాద మనం కాపాడుకోవాలంటే  ఈ గొడవ ఇంతటితో వదిలేయాలని అంటుంది. వాళ్లంతా కారులో తిరిగి వెళ్లిపోతారు. మహా చేసిన పనికి భూషణ్‌కు చాలా కోపం వస్తుంది. నాదే తప్పని చెప్పి అందరి ముందు నా పరువు తీసిందని మహామీద మండిపడతాడు. ఇండియాలో అందరూ లెప్ట్‌సైడ్‌ వెళ్లాలని...నువ్వు మాత్రం ఫారిన్‌లో మాదిరిగా రైట్‌సైడ్‌ వెళ్లి గుద్దేశావని అంటుంది.