Podharillu Serial Today Episode: పెళ్లి చూపులకు ఆడవాళ్లు లేకుండా వెళ్లడంతో ఆడపెళ్లి వారు అడిగిన మాటలకు నారాయణతోపాటు ఆయన కొడుకులు చాలా బాధపడుతుంటారు. అటు పెళ్లి కొడుకుక్కి మహా నచ్చడంతో ఆమె తల్లిదండ్రులు చాలా ఆనందపడిపోతుంటారు. మొదటి పెళ్లిచూపుల్లోనే ఓకే అవ్వడంతో వారు మహాకి కంగ్రాట్స్ చెబుతారు. దీంతో మహా చిరాకుపడిపోతుంది.అతనికి నేను నచ్చితే సరిపోతుందా...నాకు పెళ్లికొడుకు నచ్చాల్సిన పనిలేదా అని నిలదీస్తుంది.అబ్బాయికి ఏం తక్కువ అమ్మా అంటూ ప్రతాప్ అడుగుతాడు. నాకు పెళ్లికొడుకు ఏమాత్రం నచ్చలేదని చెబుతుంది. వాడికి భార్య అంటే బానిసగా అన్నట్లు ప్రవర్తిస్తున్నాడని....అతను ఏమాత్రం నచ్చలేదని చెబుతుంది. మంచి కుటుంబం,ఆస్తిపాస్తులు,ఉద్యోగం అన్నీ బాగున్నాయని తండ్రి ప్రతాప్ మహాకి నచ్చబెబుతాడు. మనకన్నా చాలా రిచ్‌గా బతకొచ్చని వివరిస్తాడు. అతనికి ఉద్యోగం చేసే భార్య అవసరం లేదంటా అని మహా చెప్పగా...అంత ఆస్తి ఉండగా ఉద్యోగం చేయాల్సిన ఖర్మ ఏంటమ్మా అని అంటాడు. నా చదవు, గోల్డ్‌మెడల్ అన్నింటికీ అర్థం లేకుండా పోతాయని ఆమె బాధపడుతుంది. చిన్నపిల్లవి నీకు అన్ని విషయాలు తెలియవని ఆమె తండ్రి సర్దిచెబుతాడు. అబ్బాయికి సెలవులు లేని కారణంగా వచ్చే నెలలోనే పెళ్లి చేయాలంటూ ప్రతాప్ చెబుతాడు. పెళ్లి మండపం కూడా బుక్ చేశామని చెబుతారు. పెళ్లి పనులు మొదలుపెట్టాలంటూ అందరూ వెళ్లిపోతారు. ఏదీ ఏమైనా సరే ఈపెళ్లి మాత్రం చేసుకోకూడదని మహా ఫిక్స్ అవుతుంది. సరకులు తీసుకుని వెళ్తున్న మాధవ్‌ను గాయత్రి అడ్డగిస్తుంది. పెళ్లి చూపుల తంతు ఏమైందని అడుగుతుంది. నాకు అమ్మాయి బాగా నచ్చిందని చెప్పడంతో కోప్పడుతుంది. నేను నిన్ను చేసుకుందామని అనుకుంటుంటే...నువ్వు పెళ్లిచూపులకు ఎందుకు వెళ్లావని నిలదీస్తుంది. వాళ్లిద్దరూ మాట్లాడుకుంటుండగానే వాళ్ల అమ్మ అక్కడికి కర్రపట్టుకుని వస్తుంది. గాయత్రిని కొట్టబోతుండగా....మాధవ్ ఆపుతాడు. నా కూతురుకు మాయమాటలు చెప్పి పెళ్లిచేసుకోవాలనుకుంటున్నావా అని మాధవ్‌పై వాళ్ల అత్త మండిపడుతుంది. నా కంఠంలో ప్రాణం ఉండగా..ఆ ఇంట్లో అడుగుపెట్టనివ్వనంటుంది. మళ్లీ నా కూతురితో మాట్లాడినట్లు తెలిస్తే....మీ పరువుతీస్తానని చెప్పి తన కూతురుని లాక్కుని వెళ్తుంది. ఇంటికి వెళ్లిన తర్వాత కూడా గాయత్రిపై మండిపడుతుంది. మాకు లేని చుట్టరికాలు నీకు ఎందుకు అని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. పెళ్లికావాల్సిన పిల్లవి...వీధుల్లో మగాళ్లతో మాట్లాడితే ఏం అనుకుంటారో తెలుసా అని నిలదీస్తుంది. ఇప్పటికే మంచి సంబంధాలన్నీ వచ్చి వెనక్కి పోతున్నాయని బాధపడుతుంది. ఇంకోసారి వాడితో మాట్లాడినట్లు చూసినా...ఆఇంటికి వెళ్లినట్లు తెలిసినా నిన్ను కూడా మీ నాన్న దగ్గరికి దుబాయికి పంపిస్తానని బెదిరిస్తుంది.
మహా ఒంటరిగా కూర్చుని బాధపడుతుండటంతో తండ్రి ప్రతాప్ ఆమె వద్దకు వస్తాడు. ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. నేనంటే నీకు ఇష్టం ఉన్నప్పుడు...నా ఇష్టాలు పట్టించుకోవా అని నిలదీస్తుంది. నిన్ను వదిలి నేను కూడా ఉండలేను...కానీ పెళ్లి చేయకుండా ఇంట్లోనే ఉంచుకోలేను కదా అని అంటాడు. నాకు ఇప్పుడే పెళ్లి వద్దని...పెళ్లికి నేనే రెడీగా లేనని చెబుతుంది. నేను మీతో ఓ విషయం చెప్పాలి నాన్న అంటుంది. పెళ్లి పేరుతో నా గోల్ వదిలేయలేనని అంటుంది. ప్రాజెక్ట్ ఓకేలా అయ్యేలా ఉందని...అది పూర్తయితే మంచి ఇంజినీర్‌గా పేరు వస్తుందని చెప్పడంతో ప్రతాప్ ఊపిరి పీల్చుకుంటాడు. ఎవరినైనా ప్రేమిస్తున్నానని చెబుతుందేమోనని భయపడతాడు. పెళ్లయి కెనడాకు వెళ్లి తర్వాత నీ భర్తను ఒప్పించి ఇంతకన్నా మంచి ప్రాజెక్ట్ చేయవచ్చని చెబుతాడు.ఆ మూర్ఖుడు ఒప్పుకోడు నాన్న అని అంటుంది. ఈ విషయంలో నువ్వు ఏం ఆలోచించకని...నేను వాళ్లకు మాట ఇచ్చానని ప్రతాప్ చెబుతాడు. పెళ్లి బట్టలు కొనేందుకు అబ్బాయితో కలిసి హైదరాబాద్ వెళ్లాలని..అన్న, వదిన కూడా వస్తారని చెబుతారు. ఈ ట్రిప్‌లో అతన్ని పూర్తిగా అర్థం చేసుకోవచ్చని చెప్పి వెళ్లిపోతారు. నేను ఇంత సీరియస్‌గా చెబుతున్నా....వీళ్లు వినడం లేదేంటి అని మహా బాధపడుతుంది.