Podharillu Serial Today Episode: రీల్స్ చేసుకోవడం కోసం కేశవ్ షాపుకు వచ్చిన శైలూ...అతనితో కలిసి రీల్స్ చేస్తుంది. ఒక్కటే చేస్తానని చెప్పి మూడు,నాలుగు రీల్స్ చేసేసరికి కేశవ్‌కు ఆమెపై కొంచెం మంచి అభిప్రాయం కలుగుతుంది. ఒక అమ్మాయిని అంత దగ్గరగా ఎప్పుడూ చూడని కేశవ్....శైలూ అలా దగ్గరకు వచ్చి మీదమీదపడటంతో కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాడు.రీల్స్ చేసుకోవడానికి ఫోన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పిన శైలూ... ప్రతిరోజూ ఇలాగే వచ్చి రీల్స్ చేసుకుంటానని బ్రతిమిలాడుతుంది. ఆ అవసరం లేదని ఈ ఫోన్ నువ్వే తీసుకోమని కేశవ్ అనడంతో శైలూ షాక్‌కు గురవుతుంది.
ఈ మాటలు అంటుంది నిజంగా నువ్వేనా అని అంటుంది. అవునని చెప్పిన కేశవ్...నీ దగ్గర ఉన్నప్పుడు డబ్బులు తీసుకొచ్చి ఇవ్వమని చెబుతాడు. ఒకవేళ నేను డబ్బులు ఇవ్వకుండా పారిపోతే ఏం చేస్తావని అడిగితే....నువ్వు అలాంటిదానివని తెలిసే...మీనాన్న నెంబర్ నా ఫోన్‌లో సేవ్ చేసుకున్నానని...నువ్వు తింగరి వేషాలు వేస్తే మీనాన్నకు ఫోన్ చేసి చెబుతానని కేశవ్ బెదిరిస్తాడు.ఎలాగైతేనేం తన ఫోన్ తన చేతికి వచ్చినందుకు శైలూ ఆనందంగా ఇంటికి వెళ్తుంది.
గాయత్రిని ఇచ్చి పెద్దికి పెళ్లి చేయలేమని ఫిక్స్ అయిన మహాలక్ష్మీ...మాధవ్‌కు వేరే సంబంధం చూసి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటుంది. ఆ విషయం చక్రితోపాటు మిగిలిన అన్నదమ్ములకు చెబుతుంది.మనం పెళ్లి సంబంధం మాట్లాడటానికిపోయినందుకే మా అన్నయ్య పిచ్చితిట్టుడు తిట్టాడని...ఇప్పుడు కొత్తగా వేరే సంబంధాలు చూస్తే చంపేస్తాడని చక్రి అంటాడు.అలాగని వదిలేస్తామా మనం ఏం చేసి అయిన పెద్ది పెళ్లి చేయాల్సిందేనని అంటుంది. అందుకే మ్యాట్రీమోనీలో మాధవ్ బయోడేటా పెడదామని చెబుతుంది. దీనికి కేశవ్,కన్నా ఓకే అని చెబుతారు. దీంతో మహాలక్ష్మీ మాధవ్ వివరాలన్నీ ఓ మ్యాట్రీమోనీ సైట్‌లో అప్‌లోడ్ చేస్తుంది.దానికి రిజిస్ట్రేషన్ ఫీజు చక్రి ముక్కుపిండి మరీ వసూలు చేసి కడుతుంది. మాధవ్‌కు ఎలాంటి అమ్మాయి కావాలని మిగిలిన వాళ్లందరినీ అడిగి ఎవరెవరు ఏం అనుకుంటున్నారో కనుక్కుని అలాంటి అమ్మాయి కోసం వెతుకుతుంది. ఇంతలో మాధవ్ అక్కడికి వచ్చి మళ్లీ అంతా కలిసి ఏం గూడుపుఠానీ మొదలుపెట్టారని అడుగుతాడు. ఏం లేదని తప్పించుకుంటారు.
మ్యాట్రీమోనీ సైట్‌లో మాధవ్ బయోడేటా చూసిన ఒకర రిప్లై ఇవ్వడంతో మహా ఆ విషయం అన్నదమ్ములకు చెబుతుంది. అమ్మాయి ఫొటో చూసి చాలా బాగుందని చెబుతారు. ఈ అమ్మాయి ఇదే ఊరిలో ఓ జ్యూవెలరీ షాప్‌లో సేల్స్‌గర్ల్‌గా పనిచేస్తోందని...మన పెద్ది నచ్చి వాళ్ల నాన్న రిప్లై ఇచ్చారని చెబుతుంది. అయితే వాళ్లతో ఎవరు మాట్లాడాలని ఇంట్లో అందరూ చాలాసేపు డిష్కషన్ చేస్తారు. మీనాన్న పెద్దవారు కాబట్టి ఆయనతో మాట్లాడిద్దామని మహా అంటుంది.ఆయన మాట్లాడితే వచ్చిన సంబంధం కూడా చెడిపోతుందని చక్రి వద్దంటాడు. చక్రిని మాట్లాడమంటే...వీడు అన్ని అబద్ధాలు చెబుతారని కేశవ్ వద్దంటే వద్దంటాడు.
అందరూ కలిసి మహాను మాట్లాడమని ఒత్తిడి చేస్తారు. దీంతో చేసేదిలేక మహా ఆడపెళ్లివారికి ఫోన్ చేసి మాట్లాడుతుంది. అవతలి వాళ్లు ఇంతకు నువ్వు ఎవరమ్మా అని అడిగితే....తప్పక నేను వాళ్ల తమ్ముడు చక్రి భార్యనని చెబుతుంది.మా మాధవ్ మీకు నచ్చాడా అని అడిగితే...నచ్చాడని మంచిరోజు చూసుకుని పెళ్లిచూపులకు రమ్మని చెబుతాడు. ఇక దాచిపెట్టి లాభం లేదని....పెళ్లిసంబంధాలు చూస్తున్నట్లు మాధవ్ చెబుతారు. నీకు ఎలాంటి అమ్మాయి కావాలని అడిగితే....అన్నీ గాయత్రి లక్షణాలు చెప్పడంతో...నువ్వు ఇంకా ఆ గాయత్రిని మర్చిపోలేదా అని ఆటపట్టిస్తారు.
