Chinni Serial Today Episode చిన్ని తన తల్లి కావేరి ఫోటో తీసుకొని వచ్చి బెడ్ రూంలో మ్యాడీ తల్లి ఫోటో పక్కన పెడుతుంది. మ్యాడీ వచ్చి చిన్ని వెనకాలే నిల్చొని చూస్తే ఏంటి మ్యాడీ అలా చూస్తున్నావ్ అని అడుగుతుంది. ఏంటి మ్యాడీ మా అమ్మ ఫొటో పెట్టాను అని అనుకుంటున్నావా.. మా అమ్మ ఫొటో మన గదిలో ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. మ్యాడీ పెళ్లి కాకముందు నీకు ఎక్కడికి తీసుకెళ్లమని చెప్పినా నన్ను తీసుకెళ్లేవాడివి.. ఈ రోజు మా అమ్మ తిథి.. నన్ను మా అమ్మ సమాధి దగ్గరకు తీసుకెళ్తావా.. నీ కోపం పక్కన పెట్టి తీసుకెళ్తావని అడుగుతున్నా తీసుకెళ్తావా అంటుంది.
మ్యాడీ సైలెంట్‌గా బయటకు వెళ్లిపోవాలని అనుకుంటే ప్రమీల, వరుణ్ వస్తారు. భార్యాభర్తలు అన్నాక కోపతాపాలు.. అలకలు వస్తూనే ఉంటాయి.. అలాంటివి వస్తే వాటిని దూరం చేసుకోవాలి తప్ప ఇలా చేయకూడదు అని అంటుంది. దేవాకి సపర్యలు చేస్తున్న నాగవల్లిని ప్రమీల మ్యాడీకి చూపించి మీ అమ్మానాన్న ఎంత అన్యోన్యంగా ఉన్నారో చూశావా.. వాళ్ల మధ్య ఎన్ని అపార్థాలు వచ్చినా అన్నింటినీ పరిష్కరించుకొని ఇలా ఉన్నారు అని చెప్తుంది. బావ చిన్ని వాళ్ల అమ్మ తప్పు చేసిందని నువ్వు నమ్ముతున్నావ్.. అది తప్పని నేను నిరూపిస్తా అని చిన్ని చెప్పింది కదా.. చిన్ని నిరూపించకపోతే కదా నువ్వు చిన్నిని ద్వేషించాలి.. అప్పుడు కదా నువ్వు చిన్ని మీద కోపంగా ఉండాలి.. అని వరుణ్ అంటాడు. చిన్ని మీద అంత కోపం వచ్చింది అంటే ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకో.. అని చెప్తుంది. అమ్మానాన్న అక్కాచెల్లి, అన్న తమ్ముడు ఇలా ఏ బంధం దూరం అయినా ఎలోగోలా బతకగలరు కానీ దాంపత్యబంధం దూరం అయితే బతుకే శూన్యం అయిపోతుంది అర్థం చేసుకో నాన్న అని ప్రమీల చెప్తుంది.
చిన్ని తల్లి ఫోటో దగ్గరకు వెళ్లి నీ దగ్గరకు తీసుకెళ్లమని అంటే మ్యాడీ అందుకు ఇష్టపడలేదు.. 30 రోజుల్లో నువ్వు నిర్దోషి అని నిరూపిస్తా అనుకున్నా.. గడువు తీరేలోపు నిజం నిరూపిస్తా.. ఆ రోజు మ్యాడీ తనంతట తానే నీ సమాధి దగ్గరకు వచ్చి సారీ చెప్తాడు అని అనుకుంటుంది. ఇంతలో మ్యాడీ చిన్ని చిన్ని అని పిలుస్తూ ఉంటాడు. చిన్ని మొత్తం చూస్తుంది.. మ్యాడీ చూసి నేనే పిలిచాను అని పిలవడంతో చిన్ని పరుగున వెళ్లి హగ్ చేసుకుంటుంది. అది చూసి లోహిత షాక్ అయిపోతుంది. మీ అమ్మ సమాధి దగ్గరకు తీసుకెళ్తా అని చెప్తాడు. నన్ను తీసుకెళ్తా అంటున్నావ్ అంటే నా మీద కోపం తగ్గింది కదా అని అంటుంది చిన్ని. లేదు మీ మీద కోపం పోలేదు కానీ అమ్మ ఎవరికైనా అమ్మే కదా.. అమ్మ విలువ నాకు తెలుసు అందుకే నిన్ను బాధ పెట్టోద్దు అని తీసుకెళ్తున్నా అంటాడు.
నాగవల్లి దేవా మాట్లాడుకుంటూ ఉంటే లోహిత పరుగున వెళ్లి మీ కొంప మునిగింది అని మొత్తం చెప్తుంది. దేవా, నాగవల్లి ఇద్దరూ షాక్ అయిపోతారు. చిన్ని మన మ్యాడీని వలలో వేసుకుంటూ ఉంటే శ్రేయని ఎలా పెళ్లి చేసుకుంటాడు అని లోహిత అడుగుతుంది. చేసుకుంటాడు.. అని నాగవల్లి అంటుంది. చిన్ని మ్యాడీని ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసుకోవాలని దేవా అంటాడు. నేను ఫాలో అవుతా అని నాగవల్లి అంటే నువ్వు కాదు అని దేవా తన మనిషికి చెప్తాడు. వాళ్లు చిన్ని వాళ్లని ఫాలో అవుతారు. మరోవైపు ఆఫ్ టికెట్ కావేరి చనిపోయిన ప్లేస్‌కి బాలరాజుని తీసుకొస్తాడు.
కావేరి ప్రాణం వదిలేసిన రాయి దగ్గరకు బాలరాజు వెళ్లి ఎమోషనల్ అవుతాడు. అయిన వాళ్లని వదిలేసి నాతో వచ్చిందుకు నేను నిన్ను చాలా అన్యాయం చేశాను.. ఆ దేవా గాడు నిన్ను నాకు శాశ్వతంగా దూరం చేసి నాకు జీవితకాలం శిక్ష వేస్తాడు అనుకోలేదు.. నీ మెడలో తాళి కట్టిన క్షణం నుంచి ఇప్పటి వరకు నేను ప్రతీ సారి ఓడిపోతూనే ఉన్నాను.. చిన్ని విషయంలోనూ తండ్రిగా ఓడిపోతూ ఉన్నాను.. కావేరి నీకు తెలుసా.. మన చిన్ని ఆ దేవా కొడుకు మహిని పెళ్లి చేసుకొని ఆ ఇంటికి కోడలిగా వెళ్లింది.. మన అదృష్టం కొద్ది మహి చాలా మంచోడు కాబట్టి ఆ ఇంట్లో చిన్నికి ఆ ప్రాబ్లమ్ రాకుండా చూసుకుంటాడు.. ఇప్పటి వరకు తండ్రిగా ఓడిపోయినా ఇక ముందు తండ్రిగా ఓడిపోను.. నిండు నూరేళ్లు చిన్ని తన అత్తారింట్లో సంతోషంగా కాపురం చేసుకునేలా చేస్తా అని ఏడుస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
