Brahmamudi Serial Today Episode: రేఖ ఆడుతున్న నాటకం ఇందుకు అర్థం కావడం లేదని బలి ఇచ్చే ముందు పొటేలుకు దండ వేసినట్టు అది ఇందును చేస్తుందని అపర్ణ, సుభాష్‌తో బాధపడుతుంది. సుభాష్‌: ఇందు తెలివైనదే కానీ మన కోసం బలహీనపడుతుంది అపర్ణ: తను ఏ నిర్ణయం తీసుకోవడం లేదు కదండి సుభాష్‌: నీకు గుర్తుందో లేదో ఒకప్పుడు కావ్య కూడా అచ్చం ఇలాగే ఉండేది. ఒకసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఇక మనం చెప్పినా వినేది కాదు.. అప్పుడు తననే ఒప్పించలేకపోయాము ఇప్పుడు తన కూతురును మాత్రం ఎలా ఒప్పించగలం అపర్ణ: మనం ఒప్పించలేము కానీ వాళ్ల అమ్మ ఒప్పించవచ్చు కదాసుభాస్‌: ఏం మాట్లాడుతున్నావు అపర్ణ ఇప్పుడు తను బతికి లేదు కదా..? తను ఒప్పించడం ఏంటిఅపర్ణ: తను లేకపోవచ్చు కానీ తన జ్ఞాపకం ఉంది కదా ఒక్క నిమిషం ఉండండిఅని వెళ్లి కళ్యాణ్‌ రాసిన కావ్య జీవిత చరిత్రను బుక్‌ను తీసుకొచ్చి సుభాష్‌కు చూపిసతుంది. సుభాష్‌ గతం గుర్తు చేసుకుంటాడు. అపర్ణ ఆ బుక్‌ ఇందుకు ఇస్తాను అంటూ వెళ్తుంది. ఇందు బాధగా కూర్చుని ఉంటుంది. అపర్ణ: ఇందు ఇంకా పడుకోలేదా.? ఇందు: లేదు నాన్నమ్మ  ఆ బుక్ ఏంటి..? ఎవరిది ఆ బుక్‌ అపర్ణ: నీదే నీకోసం నీ దగ్గరకు చేరాల్సిన మీ ఆమ్మ జ్ఞాపకం ఈ బుక్‌ దీన్ని చాలా కష్టపడి దాస్తూ వచ్చాను. ఇది మీ అమ్మ జీవితం. ఇందులో మీ అమ్మ మనస్సు.. మీ అమ్మ ధైర్యం. మీ అమ్మ కలలు కన్నీళ్ళు.. ఆవేశం ఆశయం అన్ని ఇందులో ఉన్నాయి. తనను ఎప్పుడూ చూడలేదని బాధపడుతూ ఉంటావు కదా..? ఒక్కసారి ఈ పుస్తకం చదువు నీ మనసు నిండా తనే నిండిపోతుంది

Continues below advertisement

ఇందు: నాన్నమ్మ ఇందులో నిజంగా మా అమ్మ గురించి రాసి ఉందా..? అపర్ణ: మీ బాబాయ్‌ మీ అమ్మ జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని ఒక మహాకావ్యంలా రాసి దేవతలా బావించే తన వదినకు అంటే మీ అమ్మకు అంకితం చేశాడు. నువ్వు ఈ ఇంటి మహాలక్ష్మీ అయిన నా కొడలు కావ్య గురించి తెలుసుకోవాలి. ఇందులో మీ అమ్మ ఇంటిని ఎలా చూసుకుందో..? ఈ కుటుంబం కోసం ఎలా పోరాడిందో నువ్వు తెలుసుకోవాలి.. మీ అమ్మ గురించి చదివి తెలుసుకుని అప్పుడైనా నీ నిర్ణయం మార్చుకుంటావని అనుకుంటున్నాను తీసుకో ఇందు బుక్‌ ఇచ్చి అపర్ణ వెళ్లిపోతుంది. బుక్‌ మీద కావ్య ఫోటో చూసి ఇందు ఎమోషనల్‌ అవుతుంది. బయట రుద్రాణి ఫోటో దగ్గర నిలబడిన రేఖ ఎమోషనల్‌ అవుతుంది. మమ్మీ నువ్వు కోరుకున్న ఆస్థి మొత్తం రేపే నాకు దక్కబోతుంది.. అంటూ చెప్తుండగానే భ్రమరాంబ వచ్చి తనకు ఎందుకో డౌటుగా ఉందని చెప్తుంది. దీంతో డౌటు ఎందుకని రేఖ అడగ్గానే.. ఇంతకుముందే ఆస్థి కోసం ఆ ముసలిది లాయరు దాకా వెళ్లింది. ఇప్పుడు అంత ఈజీగా ఇందు సంతకం పెండుతుందా అని అడగ్గానే.. ఆ ముసలొళ్ల ప్రాణాలు మన చేతుల్లో ఉన్నంత వరకు అది సంతకం పెడుతుందని రేఖ చెప్తుంది. మరోవైపు రూంలో కూర్చుని బుక్‌ మొత్తం చదివి కూర్చున్నచోటే నిద్రపోతుంది ఇందు. అప్పుడే కావ్య ఆత్మ వచ్చి ఇందును నిద్ర లేపుతుంది. కావ్యను చూసిన ఇందు షాక్‌ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది. 

 

Continues below advertisement