Podharillu Serial Today Episode: గ్యాస్ ప్రాబ్లం రావడంతో కన్నాతో కలిసి మహాలక్ష్మీ బయటకు వెళ్లి ఇండక్షన్ స్టవ్ కొనుక్కొని వస్తుంది. ఇప్పుడు దానిపైనే పుట్టగొడుగులకూర వండుతానని చెప్పడంతో అందరూ పారిపోవాలని చూస్తారు. కానీ అందరినీ ఆపి నేను చేయడంలేదని...మనం అందరం సాయంచేస్తే పెద్ది వంట చేస్తాడని చెప్పడంతో ఊపిరిపీల్చుకుంటారు. అయితే మాధవ్ దగ్గర ఉండి మహాలక్ష్మీతో కూర చేయిస్తాడు. అందరూ కలిసి అన్నం తినబోతూ.....ముందుగా చక్రిని తినమని ఒత్తిడి చేస్తారు. మీ అందరూ ఉండగా నామీద ప్రయోగాలు ఏంటని అన్నా సరే అందరూ కలిసి బలవంతంగా మహాలక్ష్మీ వండిన కూర చక్రితో తినిపిస్తారు. అతను తిని చాలాబాగుందని చెప్పడంతో మిగిలిన వాళ్లు కూడా వేసుకుని తింటారు. అయితే చక్రి మాత్రం కూర చాలా బాగుందంటూ మొత్తం వేసుకుని అన్నం కలుపుకుని తింటుంటే పై నుంచి పెచ్చుఊడిపడి అతని పల్లెంలో పడుతుంది.ఇంకా నయం నిద్రపోతున్నప్పుడు తలమీదపడి ఉంటే చచ్చి ఊరుకునేవాళ్లమని అంటాడు.
మహాలక్ష్మీ ఈ ఇంటిని ఎందుకు బాగుచేయించడం లేదని అడగ్గా....ఈ ఇంటిపై మా అత్తయ్య, పెదనాన్న కలిసి కోర్టులో దావా వేశారని అందుకే ఈ ఇంటిని అమ్మడం గానీ, బాగుచేయించడం గానీ కుదరదని చెబుతాడు.మా తాతయ్య అందరికీ సమానంగా వాటాలు పంచి ఇచ్చినా.....వాళ్ల వాటా ఎప్పుడో అమ్ముకున్నారని మళ్లీ మా వాటా కోసం కావాలనే కోర్టులో కేసు వేశారని చెబుతాడు. అయితే మీ ఇంటి కాగితాలు ఎక్కడ ఉన్నాయో చూసి మీరే కోర్టులో కేసు గెలవచ్చు కదా అని మహాలక్ష్మీ అంటుంది. నిజమేగానీ..ఈ ఇంటి కాగితాలు ఎక్కడ ఉన్నాయో మానాన్న చెప్పడం లేదని అంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన నారాయణను ఇంటి కాగితాలు గురించి అడగ్గా....ఏమో నాకేం తెలుసని వెళ్లిపోతాడు. అటకమీద ఉండి ఉంటాయని....ఆయనకు చూడటం బద్ధకమై కోర్టుకే వెళ్తున్నాడు తప్ప పట్టించుకోవడం లేదని మాధవ్ అంటాడు. అయితే మనమే వెతుకుదాం అని మహాలక్ష్మీ అంటుంది.
Also Read: మీనా-చింతామణి మధ్య యుద్ధం మొదలు, విల్లాకు బయలుదేరిన సత్యం ఫ్యామిలీ - గుండెనిండా గుడిగంటలు ఏప్రిల్ 30 ఎపిసోడ్
అటకమీద ఉన్న పాతసామాన్లు,పెట్టలన్నీ కిందకు దింపి ఇంటి కాగితాల కోసం వెతకడం ప్రారంభిస్తారు. కేశవ్, చక్రి చిన్నప్పటి వస్తువులన్నీ బయటపడుతుంటాయి. వాళ్ల అమ్మతో వాళ్లు దిగిన ఫొటోలు కనిపిస్తాయి.అందులో ముగ్గురు మాత్రమే ఉండటంతో కన్నాకు అనుమానం వచ్చి నేను ఎక్కడె అని అడుగుతాడు. దీంతో మాధవ్ ఇదేదే తేడాకొట్టేలా ఉందని వెంటనే ఆపెట్టెలు మూసివేయమని కోప్పడతాడు. అప్పటికీ నువ్వు పుట్టలేదురా అందుకే మేం ముగ్గురమే ఉన్నామని మాధవ్ వాడికి సర్ధిచెబుతాడు. అయినా సరే కన్నా వినకుండా పెట్టేలో ఉన్న మిగిలిన ఫొటోలు వెతుకుతుంటాడు.అప్పుడు ఒకావిడ కన్నాను ఎత్తుకుని ఉండటంతో ఈమె ఎవరని అడగ్గా....తను మనకు పిన్ని అవుతుందని అబద్ధం చెబుతారు. ఇంతలో మహాలక్ష్మీ ఆ ఫొటో చూసి ఆమె నార్త్‌ఇండియన్‌లా ఉందికదా అని అడుగుతుంది.
Also Read: చిన్ని సీరియల్: చిన్నికి దెయ్యం పట్టిందా! ఇద్దరు భార్యల్లో దేవాని చంపేదెవరు? ఆత్మ ఎందుకు అలా చెప్పింది?
అప్పుడే లోపలికి వచ్చిన నారాయణ ఈ పెట్టెలు ఎవరు తెరవమన్నారని అందరిమీద కోప్పడతాడు. దీంతో కన్నా తనను ఎత్తుకున్న ఆవిడ ఎవరని నారాయణను నిలదీస్తాడు.మా అమ్మ చనిపోయిన తర్వాత నువ్వు ఇంకో ఆవిడను తీసుకొచ్చావని ఊర్లో అందరూ అంటున్నారని...ఆవిడ మధ్యలోనే వెళ్లిపోయిందని చెబుతున్నారని అడుగుతాడు. ఆవిడే ఈవిడ అని నిలదీస్తాడు. అలాంటి బజారు మనిషి నన్ను ఎందుకు ఎత్తుకుందని గళ్లా పట్టుకుని ప్రశ్నిస్తాడు. దీంతో నారాయణకు కోపం వచ్చి ఆవిడ మీ అమ్మరా అని చెబుతాడు. మాధవ్‌తోపాటు చక్రి మిగిలిన అందరూ తండ్రిమీద అరుస్తారు.ఇప్పుడు వాడికి ఇవన్నీ చెప్పడం అవసరమా అని మండిపడతారు. వాడు వాళ్ల అమ్మ గురించే తప్పుగా మాట్లాడుతుంటే ఏం చేయమంటారని నారాయణ అంటాడు.దీంతో కన్నా నేను మీ సొంత తమ్ముడిని కాదా అని బాధపడతాడు.మిగిలిన అందరూ మేం ఎప్పుడైనా నిన్ను అలా చూశామా అని ఓదార్చుతారు. అయితే ఈ ఇల్లు ఇలా కావడానికి మాఅమ్మ, నేనే కారణమని....నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతే అన్ని సమస్యలు తీరిపోతాయని కన్నా అనుకుంటాడు. అందరూ నిద్రపోయిన తర్వాత ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు.
