Chinni Serial Today Episode మ్యాడీ నీరసంగా ఉన్న చిన్నిని లేపి పాలు తాగిస్తాడు. ఇక ఇంటికి వచ్చిన బూతవైద్యుడు.. ఓం భీం బుష్.. డాం భీం డుస్.. అంటూ అరుస్తాడు. ఏంటి ఆ అరుపులు అని చిన్ని కంగారు పడుతుంది. చెప్తాను చిన్ని కానీ నేను చెప్పేది విని నువ్వు ఫీలవ్వొద్దు అని చెప్పి ఈ మధ్య నువ్వు మెంటల్‌గా చాలా డిస్ట్రబ్ అవుతున్నావ్.. వింత వింతగా ప్రవర్తిస్తున్నావ్..గాలి సోకిందేమో అని మమ్మీ వాళ్ల అనుమానం.. అందుకే బూతవైద్యుడిని పిలిచారు అని అంటాడు.
చిన్ని మ్యాడీ చేయి పట్టుకొని నాకు చాలా భయంగా ఉందని అంటుంది. ఏం కాదు అని మ్యాడీ చెప్తాడు. ఇంతలో చిన్ని సడెన్‌గా నిద్ర వస్తుందేంటి అని అంటే నువ్వు కాసేపు పడుకో అని మ్యాడీ చిన్నిని పడుకో పెడతాడు. దెయ్యం ఎవరికి పట్టింది.. అని బూత వైద్యుడు అంటే లోహిత భయపడుతూనే అతన్ని చిన్ని గదికి తీసుకెళ్తుంది. బూత వైద్యుడు చిన్నిని చూసి నా చేయి పట్టుకుంటే నిన్ను అలా తీసుకెళ్లి స్మశానంలో పెట్టేస్తా.. కాదు కూడదు అంటే నిన్ను పాతాళంలో కలిపేస్తా అని నిద్రపోతున్నా చిన్నిని లేపుతాడు. దాంతో చిన్నిలోకి కావేరి ఆత్మ దూరం అందర్ని సీరియస్‌గా చూస్తుంది. చిన్నిలోకి కావేరి ఆత్మ బూత వైద్యుడు దగ్గరకు వెళ్లి చేయి అందిస్తుంది. వెంటనే లోహిత వైపు తిరిగి గొంతు నలిపేస్తుంది. మ్యాడీ షాక్ అయిపోతాడు. బూత వైద్యుడు మంత్రించిన పౌడర్ వేయడంతో చిన్నిలో ఆత్మ వెళ్లిపోతుంది. మళ్లీ చిన్ని బెడ్ మీద పడిపోతుంది. మ్యాడీ కంగారు పడితే కాసేపు తర్వాత తను మేలుకుంటుంది. మీరు తనని డిస్ట్రబ్ చేస్తే మిమల్ని చేస్తుంది అని చెప్పి కిందకి వెళ్తాడు. లోహిత అయితే పారిపోతుంది.
Also Read: జేడీ,కేడీ ఎవరో కనిపెట్టిన అవినాష్...మంత్రి కొడుకును ఎన్‌కౌంటర్ చేయమని ఆదేశించిన సాధూ..
బూత వైద్యుడు కింది వెళ్లి శోకాలు పెట్టి దెయ్యం అంటే ఏదో పిల్ల దెయ్యం అనుకున్నా ఇంత ముదురు దెయ్యం అని చెప్పాలి కదా.. ఇంత ధృడమైన పిల్లనే పట్టి పైకి లేపేసింది అంటే ఎంత పవర్ ఫుల్‌నో అది.. ఆ సీన్ చూడగానే పై ప్రాణాలు కింద నుంచి పోయావి అని బూత వైద్యుడు భయపడి ఆ దెయ్యాన్ని రాత్రికి బంధించి తీసుకెళ్తా అని అంటాడు. రాత్రి వరకు ఆ దెయ్యాన్ని ఏం చేయలేమా అని లోహిత కంగారు పడుతుంది. ఇక మ్యాడీ చిన్నికి భోజనం తీసుకెళ్తాడు. చిన్ని చేతులు వణుకుతూ ఉంటే నేను తినిపిస్తాలే అని అంటాడు. నిన్ను ఏదో అయింది కదా మ్యాడీ అందుకే ఇలా ఒళ్లు నొప్పులు వచ్చాయా.. నీరసంగా ఉందా అని అడుగుతుంది. ఏం కాదులే చిన్ని బూత వైద్యుడు వచ్చాడు సాయంత్రం ఏదో పూజ ఉంది కదా దాంతో తగ్గిపోతుందిలే.. ఒకవేళ దీంతో కాకపోయినా ఈ మందులు వేసుకుంటావ్ కదా రేపటికి తగ్గిపోతుందని అంటాడు. దగ్గరుండి చిన్నికి తినిపిస్తాడు. మందులు వేస్తాడు.
Also Read: మోడ్రన్ డ్రెస్‌లో మెరిసిపోయిన శ్రీలక్ష్మీ...అటవీలో మ్యాడీతో లక్ష్మీ ఏం ఆట ఆడింది...?
నాగవల్లి దేవాతో బూత వైద్యుడి గురించి చెప్తే ఆ కావేరి ఆత్మ మనల్ని వదిలేసి వెళ్లిపోతుందని నమ్మకం నాకు లేదు అని అంటాడు. నాకు నమ్మకం ఉంది బావ ఆ బూత వైద్యుడు ఆ దెయ్యాన్ని చిన్ని బాడీలో నుంచి తరిమేసిన వాడు మన ఇంటి నుంచి కూడా తరిమేస్తాడు అని అంటుంది. నాగవల్లి వెళ్లిపోయిన తర్వాత కావేరి ఆత్మ దేవా దగ్గరకు వచ్చి అతి తొందర్లోనే నీ భార్య నిన్ను చంపుతుంది అని అంటుంది. చచ్చిన నా భార్య నన్ను చంపడం ఏంటి అని దేవా అడిగితే చచ్చింది కాకపోతే బతికున్న నీ భార్య చంపుతుంది అని అంటే నాగవల్లి నన్ను చంపడం ఏంటి.. ఇద్దరిలో నన్ను ఎవరు చంపుతారో చెప్పు అని దేవా అరుస్తాడు. నేను చెప్పను అని ఆత్మ నవ్వుతుంది. బూతవైద్యుడు హాల్‌లో దెయ్యాన్ని పట్టుకోవడానికి ఏర్పాట్లు చేస్తాడు. మ్యాడీ చిన్నిని తీసుకొని కిందకి వస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
