Podharillu Serial Today Episode: ఆడపెళ్లివాళ్లు చెప్పిన కండిషన్ మాధవ్‌కు చెప్పకుండా ఈ పెళ్లికి ఒప్పిద్దామని తమ్ముళ్లు,మహాలక్ష్మీ అనుకుంటారు. వాళ్లు చెప్పిన మాట అన్నయ్యకు తెలిస్తే ఈయన ఒప్పుకోడని....ఆ కండిషన్‌కు అంగీకరించకుంటే పెళ్లికి వాళ్లు ఒప్పుకోరని అనుకుంటారు.కన్నాను బలవంతంగా ఒప్పించి ఆడపెళ్లివారికి చక్రి ఫోన్ చేస్తాడు. మీ సంబంధం చేసుకోవడం మాకు ఇష్టమేనని..త్వరలోనే ముహూర్తాలు పెట్టుకుందామని చెబుతారు. దీనికి వాళ్లు చాలా సంతోషపడతారు. హమ్మయ్యా...ఎలాగైతేనేవాళ్లు ఒప్పుకున్నారని చక్రి కూడా ఆనందపడతాడు. కానీ ఈ విషయం అన్నయ్యకు తెలిస్తే మాత్రం మనల్ని చంపేస్తాడని కేశవ్ అంటాడు. ఏదోవిధంగా అన్నయ్యకు తెలియకుండా ఈ పెళ్లి తంతు ముగించాలని చక్రి అంటాడు.అయితే ఆ గాయత్రి పెళ్లికన్నా ముందే మన ఇంట్లో పెళ్లి జరగాలని అదే నా కండిషన్ అని కేశవ్ చెప్పి వెళ్లిపోతాడు.
డబ్బులు ఇస్తాను రమ్మని చెప్పి ఎంతకూ శైలూ రాకపోవడంతో కేశవ్ రోడ్డుపై ఎదురుచూస్తుంటాడు.తను ఇంకా రాలేదని ఫోన్ చేసి మాట్లాడతాడు. దీంతో శైలూ కేశవ్‌పై మండిపడుతుంది. పదినిమిషాలు ఆగలేవా అని అరుస్తుంది. ఇప్పుడు అక్కడే నాకు పెయిడ్ ప్రమోషన్ షూటింగ్ ఉందని...అది అయిపోగానే వాళ్లు ఇచ్చిన డబ్బులు నీముఖాన కొడతానని అని చెప్పి ఫోన్ కట్టేస్తుంది. ఇంతలో అక్కడ నలుగురు ఐదుగురు అబ్బాయిలు సిగరెట్లు తాగుతూ మాట్లాడుకోవడం చూసిన కేశవ్ వాళ్లు మందలిస్తాడు. వాళ్లు నీకు అంతగా ఇబ్బంది ఉంటే ఇక్కడి నుంచి వెళ్లిపో అని అంటారు. కేశవ్ వెళ్లపోతూ వాళ్ల మాటలు వింటాడు. ఇప్పుడు ఇక్కడికి ఆ స్టైలీష్ శైలూ రాగానే దానితో న్యూడ్ వీడియో తీసి అది చూపించి దాన్ని బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు గుంజాలని వాళ్లు ప్లాన్ వేసుకుంటారు.
ఆ వీడియో చూపించిన దాన్ని ఎప్పుడు ఎక్కడికి రమ్మంటే అక్కికి రప్పించుకోవచ్చని వేసిన ప్లాన్ కేశవ్ వింటాడు. వాళ్లను చితక్కొడుతుండగా....అప్పుడే అక్కడికి వచ్చిన శైలూ ఆపుతుంది. ఎందుకు వాళ్లను కొడుతున్నావని నిలదీస్తుంది. వీళ్లు నీతో అసభ్యకరమైన వీడియోలు తీసి బెదిరించాలనుకుంటున్నారని చెబుతాడు. అయినా ఎవరు పిలిస్తే అక్కడికి వెళ్లిపోవడమేనా అని కేకలు వేస్తాడు. దీంతో వాళ్లు మాటమార్చేస్తారు.మేం అలా ఏం చేయాలనుకోలేదని...మీతో పెయిడ్ ప్రమోషన్ చేయించడానికే ఇక్కడికి పిలిచామని చెబుతారు. వీడికి మనసులో ఏదో దురుద్దేశం పెట్టుకుని ఇలా చేశాడని చెప్పగానే...శైలూ కేశవ్ చెంపపగులగొడుతుంది. నేను నీ షాపు దగ్గరకు వచ్చి గొడవ చేశానని..ఇప్పుడు ఇలా రివేంజ్ తీర్చుకుంటున్నావా అని నిలదీస్తుంది. కేశవ్ ఏం చెప్పినా శైలూ వినకపోడంతో నీ చావు నువ్వు చావు అని అక్కడే వదిలేసి వెళ్లిపోతాడు.వచ్చిన కుర్రాళ్లు అంతకు ముందే పారిపోవడంతో శైలూ కూడా అక్కడ నుంచి వెళ్లిపోతుంది.
ఇంట్లో అందరూ కూర్చుని చర్చించుకుంటుండగా....మాధవ్ అక్కడికి వస్తాడు. అప్పుడు చక్రి తనకు అసలు విషయం చెబుతాడు.ఆ గారెల అమ్మాయి నీతో పెళ్లికి ఒప్పుకుందని అంటాడు. అలా ఎలా జరిగిందని మాధవ్ అంటాడు.ఏమో ఆఅమ్మాయి మనసు మార్చుకుని నిన్నే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టిందంటా అందుకే వాళ్ల అమ్మానాన్నలు పెళ్లికి ఒప్పుకున్నారని చెబుతాడు.ఇదంతా నాకు ఏదో అనుమానంగా ఉందని ఆ అమ్మాయి ఎలాంటి కండిషన్లు పెట్టలేదా అని అంటాడు.
మరి ఆ రోజు రెస్టారెంట్‌లో నీకు ఏమైనా చెప్పిందా అని మహా అడగ్గా...అలాంటిదేమీ లేదని మాధవ్ చెబుతాడు.అయితే ఇప్పుడు ఎందుకు పెడుతుందని ప్రశ్నించడంతో మాధవ్ అక్కడి నుంచి ఓకే చెప్పివెళ్లిపోతాడు.కానీ వంటగదిలో ఒంటరిగా ఉన్న మాధవ్ వద్దకు మహా వెళ్లగా....అసలు విషయం చెబుతాడు. ఆ అమ్మాయికి నేను తమ్ముళ్లతో ఉండటం ఇష్టం లేనది...ఈ ఇంటికి రానని చెప్పిందని అంటాడు.ఇప్పుడు మనసు మార్చుకుని ఉంటుందిలే అని మహాలక్ష్మీ కూడా అబద్ధం చెబుతుంది.
