Lakshimi Raave Maa Intiki  Serial Today Episode: కాలేజీలో డ్యాన్స్ కాంపిటేషన్ మొదలవ్వడంతో మ్యాడీ, శ్రీలక్ష్మీ ప్రాక్టీస్‌ చేస్తుంటారు.అది చూసిన త్రిష..అక్కడికి వచ్చి శ్రీలక్ష్మీని చూసి పగలబడి నవ్వుతుంది. ఇది అసలు డ్యాన్స్ అంటారా అని ఎగతాళి చేస్తుంది. ఊరిలో వేసే కుప్పిగంతులు ఇక్కడ వేస్తే కుదరదని హేళన చేస్తుంది.అసలు నాది,విక్రమ్ జోడీ చూసి నువ్వు సగం చచ్చిపోతావని అంటుంది.మేం చేసే డ్యాన్స్‌ చూసి నీకు కళ్లు తిరగడం ఖాయమని చెబుతుంది. దీనికి శ్రీలక్ష్మీ కూడా  ఆమెకు గట్టిగా బదులిస్తుంది.అసలు ఇప్పటి వరకు నేను అసలు డ్యాన్స్ చేయలేదని...మ్యాడీతో కాస్త చనువుగా కలిసే ఉండే అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని ఉపయోగించుకుంటున్నానని అంటుంది. రేపు అసలు సిసలు డ్యాన్స్‌ స్టేజీపై చూస్తావని సవాల్ విసురుతుంది.నువ్వే కాస్త జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తుంది. అసలు నాది,మ్యాడీ జోడీ చూసి నీ గుండెజారిపోయే ప్రమాదం ఉందని చెబుతుంది. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చూసి నీకు మైకం వచ్చి పడిపోయే ప్రమదం ఉందని అంటుంది. అయినా ఈ డ్యాన్స కాంపిటేషన్‌లో నువ్వు ఓడిపోవడం ఖాయమని....అయినా నీకు డబ్బులు రావని ఏం బాధపడొద్దని త్రిష అంటుంది.మేం గెలుచుకున్న ప్రైజ్‌మనీ నీకు ముష్టి వేస్తామని అంటుంది. అసలు నువ్వు గెలిచినప్పుడు సంగతి కదా అని శ్రీలక్ష్మీ కౌంటర్‌ ఇస్తుంది. నువ్వు నామీద ఉన్న కోపంతో డ్యాన్స్ చేస్తున్నావని...నేను ఓ మంచి సంకల్పంతో  ఆడుతున్నానని శ్రీలక్ష్మీ అంటుంది. ఎవరి దయాదాక్షన్యాలపై నేను ఆధారపడనని....ఖచ్చితంగా ఈ డ్యాన్స్ కాంపిటేషన్‌లో గెలిచి ప్రైజ్‌మనీ తీసుకుంటానని సవాల్‌ విసురుతుంది.                         కాలేజీలో డ్యాన్స్ కాంపిటేషన్‌కు  సమయం అవ్వడంతో అందరూ టీవీల ముందు కూర్చుకుని చూస్తుంటారు. మ్యాడీ వాళ్లఇంట్లోనూ అందరూ తీక్షణంగా డ్యాన్స్‌ ప్రోగ్రాం వీక్షిస్తుంటారు.తొలిరౌండ్‌లో త్రిష,విక్రమ్ వచ్చి దుమ్మురేపిపోతారు. ఆ తర్వాత మ్యాడీ, శ్రీలక్ష్మీ జోడీ వస్తారు. హైదరాబాద్ వచ్చి ఫ్రెండ్‌ ఇంట్లో ఉండి టీవీ చూస్తున్న గోపీ మ్యాడీని చూడగానే గుర్తుపట్టి సింధూజాక్షిని గట్టిగా పిలుస్తాడు. విసుక్కుంటూ అక్కడికి వచ్చిన సింధూ ఏంటని నిలదీస్తుంది. టీవీలో మీ తమ్ముడు,మా చెల్లి కలిసిడ్యాన్స్ చేస్తున్నారని చెబుతాడు.అది చూసి సింధూ....వీడికి ఏం పిచ్చిపట్టిందని, ఆ  ఎర్రబస్సుతో కలిసి డ్యాన్స్ ఏందుకు చేస్తున్నాడా అని అనుకుంటుంది.కాసేపటికే వాళ్ల తమ్ముడు డ్యాన్స్‌ ఇరగదీస్తుండటంతో విజిల్స్‌ వేసి ఎంకరేజ్‌ చేస్తుంది. తొలిరౌండ్ పూర్తికాగానే జడ్జిలు ఎలిమినేషన్ మొదలుపెడతారు. మొత్తం నాలుగు జంటల్లో రెండు జంటలు ఎలిమినేట్ కాగా...త్రిష, విక్రమ్‌తోపాటు మ్యాడీ, లక్ష్మీ జంట తర్వాత రౌండ్లకు వెళ్తాయి.                         నాది పల్లెటూరు డ్యాన్స్‌ అని ఎగతాళి చేసిన మీతోనే నేను పోటీకి వచ్చానని మహాలక్ష్మీ త్రిషతో అంటుంది.ఇక ఈ రౌండ్‌లో నిన్ను ఓడించి విజయం సాధిస్తానని అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతుంది.అనవసరంగా ఆ లక్ష్మీతో ఛాలెంజ్‌ చేసి తప్పుచేశామోమోనని త్రిష ఫ్రెండ్స్‌ అంటారు.  ఆ ఎర్రబస్సు గెలిచినా గెలిచేలా ఉందని...దాని కాన్ఫిడెంట్‌ చూస్తే భయమేస్తుందని అంటారు. నువ్వు ఊ అంటే చాలు అది స్టేజీపైకి రాకుండా మేం చూసుకుంటామని అంటారు. లేదని అది ఖచ్చితంగా డ్యాన్స్‌ చేయాలని కానీ గెలవకూడదని త్రిష అంటుంది. ఇప్పుడు దాని కాన్ఫిడెంట్ దెబ్బతీస్తే చాలని అదే ఓడిపోతుందని చెబుతుంది.ఇంతలో విక్రమ్ అక్కడికి రాగా....నువ్వు వెళ్లి ఇప్పుడు శ్రీలక్ష్మీకి నీ ప్రేమ గురించి చెప్పమని అంటుంది.ఇది సరైన  టైం కాదనుకుంటా అని విక్రమ్ అంటాడు.ఇప్పుడైతేనే శ్రీలక్ష్మీ ఎవరికి చెప్పలేదని...ఇదే మంచి సమయమని చెప్పి రెచ్చగొట్టి విక్రమ్‌ను శ్రీలక్ష్మీ ఉన్న గదిలోకి పంపుతుంది.

Continues below advertisement

 

Continues below advertisement