Jagadhatri Serial Today Episode: రాగిణి అత్తయ్యను ఇంట్లోకి ఎలా తీసుకురావాలా అని జగధాత్రి, కేదార్ ఆలోచిస్తుంటారు. మీ అత్తయ్యకు మీనన్‌ను నుంచి ఆపద ఉందని చెప్పి..తాను బతికే ఉన్నట్లు ఆ మీనన్‌కు తెలియకూడదని నిజం చెప్పి ఇంట్లోకి తీసుకొచ్చి పెడదామని కేదార్ అంటాడు. నిషికకు కూడా మీ అత్తయ్య అంటే ఇష్టమే కదా అని అంటాడు. నిషికకు మా అత్తయ్య అంటే ఇష్టమే అయినప్పటికీ...తన ప్రాణాల మీదకు వస్తుందంటే మాత్రం ఎదురించి నిలిచేంత ప్రేమ లేదని ధాత్రి అంటుంది. తనకు ఏదైనా జరుగుతుందని తెలిస్తే...ఖచ్చితంగా అవతలి వాళ్ల ప్రాణం పోయినా పర్వాలేదనుకుంటుందని చెబుతుంది. ఇక వైజయంతి, యువరాజు ఎవరో ఒకరు మళ్లీ మీనన్‌కు దగ్గరయ్యారంటే....అత్తయ్య ప్రాణాలతో ఉందన్న విషయం ఆ మీనన్‌కు తెలియడం ఎంతోసేపు పట్టదని అంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ రాగిణి అత్తయ్య బతికే ఉందన్న నిజం తెలియకుండానే ఆమెను ఈ ఇంట్లోకి తీసుకురావాలని అంటుంది.మారువేషంలో ఆమెను ఈ ఇంట్లో పెడితే....మన కళ్లముందే ఉంటుందని ధాత్రి చెబుతుంది. అప్పుడు ఆ మీనన్‌కు ఆమె గురించి ఆలోచించడని అంటుంది. కేదార్,జగధాత్రి గదిలో మాట్లాడుతుండగా....అప్పుడే పనిమనిషి రాధ టీ తీసుకుని అక్కడికి వస్తుంది. మేం కిందకు వచ్చి తాగేవాళ్లం కదా అక్క అని జగధాత్రి అంటుంది. పర్వాలేదమ్మా అని వెళ్లబోతుండగా....ఆమె చెంపై ఉన్న చేతి గుర్తులు చూసి ఆపుతుంది. ఏం జరిగిందని అడగ్గా...నిషిక అమ్మగారు కొట్టిన విషయం చెబుతుంది. అప్పుడే జగధాత్రికి ఓ మెరుపులాంటి ఆలోచన వస్తుంది. రాధక్క నువ్వు నాకు పని చేసిపెట్టాలని చెబుతుంది. ఏంటమ్మా అని అడగ్గా...నువ్వు వెంటనే ఈ ఇంట్లో పని మానేయాలని అంటుంది. ఆ మాటలు విన్న పనిమనిషి రాధకు ఏం మాట్లాడాలో అర్థం కాదు. నా కుటుంబం మొత్తం నాపై ఆధారపడి బతుకుతుందని..అందుకే ఎంత ఓపిక లేకపోయినా ఈ పదేళ్లల్లో ఒక్కరోజు కూడా పనిమానేయ్యలేదని చెబుతుంది. ఒంట్లో బాగుండకపోయినా పనికి వస్తున్నానని అంటుంది. ఈ ఇంట్లో నిషిక, వైజయంతి అమ్మగారు ఎంత అవమానించినా...కౌషికి మేడం కోసమే వస్తున్నానని ధాత్రితో అంటుంది. ఒకవేళ నేను పని మానేస్తే....కౌషికి అమ్మగారిని ఎవరూ మంచిగా చూసుకోలేరని చెబుతుంది. మాకు కావాల్సిన ఒక ఆవిడను ఈ ఇంట్లో ఉంచాలని అనుకుంటున్నామని...కానీ ఆమె ఎవరో ఎవరికీ తెలియకూడదని చెబుతుంది. వెంటనే ఆమెకు 6నెలల జీతం ఇస్తుంది.ఈ డబ్బులు తీసుకుని నువ్వు వెళ్లి హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకోమని చెబుతుంది. ఇప్పటికిప్పుడు నువ్వు ఇంట్లోనుంచి వెళ్లిపోతానంటే అందరికీ అనుమానం వస్తుంది కాబట్టి...నిషికకు కోపం వచ్చేలా ఏదో ఒకటి చేస్తే,తనే నిన్ను ఇంట్లో నుంచి బయటకు పంపివేస్తుందని ధాత్రి చెబుతుంది.ఆమె చెప్పినట్లే నిషిక చీరపై జ్యూస్ పోయగానే...కోపంతో రగిలిపోయిన నిషిక రాధను కొడుతుంది. దీంతో రాధ ఇంట్లో అందరిముందు గొడవ చేస్తుంది. నేను తెలియక కొంచెం జ్యూస్ ఆమె చీరపై వేశానని...దానికి తప్పు అయ్యిందని క్షమాపణలు కూడా అడిగానని అయినా నిషిక అమ్మగారు నన్ను కొట్టిందని కౌషికికి చెబుతుంది. మర్యాదగా వచ్చి నీ చీర కొంగుతో నా కాళ్లు తూడిస్తేనే నిన్ను క్షమిస్తానని నిషిక అంటుంది.దీంతో రాధకు కోపం వచ్చి మీరు ముందు నాకు క్షమాపణలు చెప్పాలని లేకపోతే నా తడాఖా ఏంటో చూపిస్తానని హెచ్చరిస్తుంది. దీంతో వైజయంత్రి కూడా ఆమెను తిట్టి ఇంట్లో నుంచి బయటకు వెళ్లగొడతారు. దీతో రాధ వెళ్లి వాళ్ల యూనియన్ సభ్యులందరినీ తీసుకుని వచ్చి ఇంటి ముందు గొడవ చేస్తుంది. ఇది చూసిన యువరాజు...నిషికపై కోప్పడతాడు. ఎప్పుడూ ఏదో ఒక గొడవ చేస్తూనే ఉంటావని మండిపడతాడు.
Jagadhatri Serial Today April 20th: రాగిణి అత్తను కౌషికి ఇంట్లోకి తీసుకురావడానికి జగధాత్రి వేసిన పథకం ఏంటి...? నిషిక పనిమనిషి మీద చేయిచేసుకోవడానికి కారణం ఏంటి..?
Ajay Kumar | 20 Apr 2026 10:49 PM (IST)
Jagadhatri Serial Today Episode April 20th: రాగిణి అత్తను కౌషికి ఇంట్లోకి తీసుకురావడానికి జగధాత్రి వేసిన పథకం ఏంటి...? నిషిక పనిమనిషి మీద చేయిచేసుకోవడానికి కారణం ఏంటి..?

జగద్ధాత్రి సీరియల్ టుడే ఏపిసోడ్