Podharillu Serial Today Episode: మాధవ్ పెళ్లి ఎలాగైనా చేయాలని పట్టుదలతో ఉన్న మహాలక్ష్మీతోపాటు తమ్ముళ్లు....పెళ్లిళ్ల బ్రోకర్‌ను పిలిచి మంచి సంబంధాలు చూడమని చెబుతారు. ఆల్రెడీ మీకు చూసిన సంబంధాలన్నీ మీఅత్త,పెదనాన్న చెడగొడుతూ వచ్చారని...కానీ ఒకే ఒక్క సంబంధం మాత్రం మీతో పెళ్లికి ఓకే చెప్పారని అంటాడు.కాకపోతే వాళ్ల ఒక కండీషన్ పెట్టారంటా...అది కూడా ఆ పెళ్లికూతురు మీ అన్నయ్యను కలిసి విషయం చెప్పిందని....దానికి మీ అన్నయ్య అంగీకరించలేదని తెలిసిందని చెబుతాడు. అదేంటో కనుక్కుని మీరు దానికి అంగీకరిస్తే వెళ్లి మాట్లాడదామని చెప్పి వెళ్లిపోతాడు. అన్నయ్య మన దగ్గర ఇంత విషయం దాచాల్సిన అవసరం ఏముందని వాళ్లు అనుకుంటారు. ఇంతలో మాధవ్ పని నుంచి రావడంతో అందరూ కలిసి రౌండప్ వేస్తారు.మాకు తెలియకుండా వెళ్లి అమ్మాయిలను కలవడం....సీక్రెట్‌గా మాట్లాడుకోవడం అని ఏడిపిస్తారు. ఇంతకీ ఆ అమ్మాయి ఏం చెప్పిందని అడుగుతారు. ఏం లేదని అది ముగిసిపోయిన కథ అంటూ ఇంతకు మించి తనను ఏం అడగొద్దని చెప్పి వెళ్లిపోతాడు. మాధవ్ అన్నయ్యను ఎంత అడిగినా చెప్పడు కాబట్టి....మనమే వెళ్లి ఆ అమ్మాయి వాళ్ల ఇంటికి వెళ్లి విషయం కనుక్కుని వద్దామని మహాలక్ష్మీ అంటుంది. అయితే చక్రి,నువ్వు వెళ్లిరండని కేశవ్, కన్నా అంటారు. దీనికి వారిద్దరూ సరేనని అంటారు. ఇంట్లో ఒంటరిగా బోరుకొడుతోందని రీల్ చేద్దామని కన్నా కేశవ్‌ను అడుగుతాడు.అన్నయ్యకు తెలిస్తే చంపేస్తాడని కేశవ్ అంటే...ఏం కాదులే చేద్దామని అంటాడు.అయితే ఓకే అంటాడు కేశవ్...ట్రెండింగ్‌లో ఉన్న రీల్ ఏదో చూసి చేద్దామని చెప్పి...ఫోన్ ఓపెన్ చేసి రీల్ కోసం వెతుకుతాడు కన్నా. అప్పుడే కేశవ్ చేయిపట్టుకుని శైలు చేసిన రీల్ కనిపిస్తుంది.ఇది మంచి ట్రెండింగ్‌లో ఉందని ఇదే చేద్దామని కన్నా అంటే....అది చూసిన కేశవ్ అదిరిపడతాడు.ఇప్పుడుగానీ వీళ్లు అది నా చేయి అని తెలుసుకున్నారంటే నేను అయిపోతానని అనుకుంటాడు. కన్నామీద కోప్పడి బయటకు వెళ్లిపోతారు.అప్పుడే అక్కడికి వచ్చి మహాలక్ష్మీ ఏమైందని అడిగితే..రీల్ చేద్దామంటే ఓకే అన్న కేశవ్ అన్నయ్య ఆ తర్వాత మాటమార్చి వెళ్లిపోయాడని చెబుతాడు.ఏం రీల్ చేద్దామన్నావో చూపించమని మహా అడుగుతుంది.అప్పుడు కన్నా ఆ రీల్ చూపించేసరికి...మహాలక్ష్మీ కనుక్కుంటుంది. అది ఖచ్చితంగా కేశవ్ చేయేనని...ఆ వెనక ఉంది కూడా అతని షాపేనని చెబుతుంది.అందుకే అలా విసుక్కుని వెళ్లిపోయాడని చెబుతుంది.అమ్మాయి చాలా బాగుందని....వెళ్లి కేశవ్‌ను ఏడిపిద్దామని అంటుంది. బయట ఉన్న కేశవ్ దగ్గరకు వెళ్లి మొత్తానికి విషయం లాగుతారు.అలాంటిదేమీలేదని...ఆ అమ్మాయి నాకు డబ్బులు ఇవ్వాలని మీకు తెలుసుకదా ఓసారి ఫోన్ ఇస్తే రీల్ చేసుకుని ఇస్తానంటే ఇచ్చానని చెబుతాడు. తను ఎక్కడ పారిపోతుందేమోనని అలా చేయిపట్టుకున్నానని వివరిస్తాడు. అంతకు మించి ఏం లేదని చెప్పి వెళ్లిపోతాడు. పెళ్లిళ్ల బ్రోకర్‌ను వెంటబెట్టుకుని మహా,చక్రి అమ్మాయి వాళ్ల ఇంటికి వెళతారు. మీ అన్నయ్యకు చేయకుండా మీరు ఎందుకు పెళ్లి చేసుకున్నారని అడగ్గా....వాళ్ల ఇంట్లో వాళ్లు వేరే పెళ్లి చేయాడనికి ప్రయత్నిస్తుంటే...తప్పనిసరి పరిస్థితుల్లో తాళి కట్టాల్సి వచ్చిందని చక్రి చెబుతాడు.ఇంతకు మీరు పెళ్లికి పెట్టిన కండిషన్ ఏంటో చెప్పమని అడగ్గా...మాకు మీ అన్నయ్య బాగా నచ్చాడని.....ఈ కాలంలోనూ అలాంటి వాళ్లు ఉండటం అరుదేనని పిల్ల తండ్రి అంటాడు. మా అమ్మాయి కూడా బాగా నచ్చాడని అందుకే ఈ పెళ్లికి మాకు ఎలాంటి అభ్యంతరం లేకపోయినా.....ఆ ఇంటికి పంపించడమే కొంచెం కష్టంగా ఉందని పెళ్లికూతురు తల్లి అంటుంది. మీరు భయపడాల్సిన పనేమీ లేదని...ఐదుగురు మగాళ్లు ఉన్నా ఆ ఇంట్లో ప్రేమకు ఎలాంటి లోటులేదని..ఆ ఇంట్లోనే నేను ఎంతో ధైర్యంగా, సౌకర్యవంతంగా ఉంటున్నానని మహా చెబుతుంది. పెళ్లి అయిన తర్వాత వేరుగా ఉండటానికి మాధవ్‌గారు ఒప్పుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెబుతారు.అయితే ఇది జరిగే పెళ్లికాదని మహా అంటుంది. తమ్ముళ్లను వదిలి ఆయన బయటకు రాలేరని చెబుతుంది. మిగిలిన వాళ్లతో కూడా మాట్లాడి మళ్లీ చెబుతామని చెప్పి వచ్చేస్తారు.ఇంటికి వచ్చిన తర్వాత కన్నా, కేశవ్‌కు చెబుతారు. అన్నయ్య పెళ్లి జరగాలంటే మనం ఆయనకు అడ్డుగా ఉండకూడదని...అందుకే అన్నయ్యకు చెప్పకుండా వేరుగా ఉంచేందుకు ఆడపెళ్లివారికి చెబుదామని అంటారు. అన్నయ్య ఏ విషయమైనా చెప్పి చేస్తేనే మంచిదని కేశవ్ చెబుతాడు. అలా చెబితే అన్నయ్య ఒప్పుకోడని.....అప్పుడు ఎప్పటికీ పెళ్లిజరదని చెప్పి తమ్ముళ్లను చక్రి ఒప్పిస్తాడు.
Podharillu Serial Today April 20th: మాధవ్‌ను పెళ్లి చేసుకోవడానికి ఆడపెళ్లివారు పెట్టిన కండీషన్ ఏంటి..? దీనికి తమ్ముళ్లు తీసుకున్న నిర్ణయం ఏంటి...?
Ajay Kumar | 20 Apr 2026 08:31 AM (IST)
Podharillu Serial Today Episode April 20th: మాధవ్‌ను పెళ్లి చేసుకోవడానికి ఆడపెళ్లివారు పెట్టిన కండీషన్ ఏంటి..? దీనికి తమ్ముళ్లు తీసుకున్న నిర్ణయం ఏంటి...?

పొదరిల్లు సీరియల్