Podharillu Serial Today Episode: నిహారిక ఆధార్‌ నెంబర్‌ పంపించడంతో మహాలక్ష్మీ ఆనందానికి అవధులు లేవు. తన ఆధార్‌కార్డు తనచేతికి వచ్చిందంటే హాయిగా తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవచ్చని కలలు కంటుంది. ఆధార్‌కార్డు తీసుకోవడానికి చక్రిని తీసుకుని బయలుదేరుతుంది. నా ఆధార్‌కార్డు రాగానే నేను పెద్ద ఆర్కిటెక్ట్‌ అయిపోయి కంపెనీ స్టార్ట్‌ చేస్తానని చెబుతుంది. అప్పుడు ఆ కంపెనీలో కారు సర్వీస్ కాంట్రాక్ట్‌ నీకే ఇస్తానని చక్రికి చెబుతుంది. పగటికలలు ఆపమని చక్రి హెచ్చరిస్తాడు. ఇంకా ఆధార్‌కార్డు రాలేరాలేదని...అప్పుడే పగటికలలు కంటున్నారని మండిపడతాడు.మంచి పీజీ చూసుకుని వెళ్లిపోతానన్న మహాతో మా ఇంట్లోనే ఉంటానని మాటిచ్చారు కదా అని అంటాడు. మీ అన్నయ్యకు పెళ్లి అయ్యేవరకు ఉంటానని జీవితాంతం ఉండలేను కదా అని మహా అంటుంది. అలాగే  ఆధార్‌కార్డు వచ్చిన వెంటనే మనం వెళ్లి ఆ లాయర్‌ను కలిసి విడాకులు తీసుకుందామని చెబుతుంది. మీరు ఆ విడాకుల గోల మర్చిపోరా అని అంటాడు. పెళ్లికాని నాకు మీరు విడాకులు ఇస్తే....నన్ను ఇంకా ఎవరు పెళ్లిచేసుకుంటారండీ  అని నిలదీస్తాడు.నేను వచ్చి మనకు జరిగిందంతా  చెప్పి నీ పెళ్లికి హెల్ఫ్‌ చేస్తానని మహాలక్ష్మీ చెబుతుంది. మీరు చెబితే వాళ్ల నమ్ముతారా అని చక్రి ప్రశ్నిస్తాడు                    మీసేవా సెంటర్‌ రావడంతో మహాలక్ష్మీ కారు దిగి వెళ్లి ఆధార్‌కార్డు డౌన్‌లోడ్ చేసుకోవాలని చెబుతుంది. అతను నెంబర్‌ ఇవ్వమని అడగ్గా ఇస్తుంది. మీ ఫోన్‌కు ఓటీపీ వచ్చి ఉంటుందని చెప్పమని అడుగుతాడు. ఫోన్‌ నెంబర్‌ నా దగ్గర లేదని చెప్పడంతో....అయితే మీ ఆధార్‌ మీరు  తీసుకోలేరని చెప్పడంతో చక్రి ఆనందపడిపోతాడు.బయటకు వచ్చిన తర్వాత మహా చక్రిపై కేకలు వేస్తుంది. ఆ రోజు మీరు చెప్పడం వల్లే సిమ్‌కార్డు తీసిపడేశానని..లేకపోతే ఇవాళ  నాకు ఏప్రాబ్లం ఉండేది కాదని చెబుతుంది.ఖచ్చితంగా ఆ సిమ్‌ ఎవరికో దొరికి ఉంటుందని...వాళ్లను ఓటీపీ చెప్పమని అడుగుదామని అంటాడు. చక్రి వద్దని చెప్పినా వినకుండా  మహా ఫోన్ చేయగా...ఓ తాగుబోతు వాడు పిచ్చితిట్లు తిడతాడు.దీంతో మహా ఆ ప్రయత్నం విరమించుకుంటుంది.                    నిహారిక ఇంట్లో బట్టలు సర్దుకుంటుండగా ఆది వచ్చి ఆమెను తదేకంగాచూస్తుంటాడు.ఏమైందని నిహారిక అడుగుతుంది.ఏంలేదు మళ్లీ ఎలాంటి తింగరి పనులు ఏమైనా చేస్తున్నావేమోనని అంటాడు. అలాంటిదేమీ లేదని చెబుతుంది. ఇంతలో నిహారిక ఫోన్‌కు  ఆధార్ ఓటీపీ రాగా....మీరు ఏమైనా నా ఆధార్‌ తీసుకున్నారా అని అడుగుతుంది.లేదని ఆదిచెబుతాడు. మరి ఎందుకు ఓటీపీ వచ్చిందని అడగ్గా....అది మీ మరదలు తీసుకున్నదని చెబుతాడు. అదేంటని నిహారిక అడగ్గా....నువ్వు ఆధార్‌కార్డు దొంగలించడం,ఆ నెంబర్‌ మహాకు పంపడం అన్నీ నేను చూశానని అంటాడు. అందుకే మహా నెంబర్ ప్లేస్‌లో నీ నెంబర్‌ ఉంచానని చెబుతాడు. అది ఆధార్‌కోసం ట్రైస్తే నీ నెంబర్‌ వచ్చి ఉంటుందని చెబుతాడు. మరోసారి ఇంట్లో నుంచిదానికి  ఎలాంటి సాయం చేయాలని చూసినా ముందు నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోతావని హెచ్చరిస్తాడు.దీంతో నిహారిక మహాకు అసలు విషయం చెబుతుంది.                               ఆధార్‌కార్డు కోసం తాను కూడా  నిజంగానే ట్రై చేస్తున్నట్లు చక్రి ఆమెన నమ్మించడానికి తెలిసిన జిరాక్స్‌ షాపు వద్దకు తీసుకెళ్తాడు. అక్కడ కూడా ఆధారాలు లేకుండా ఆధార్ ఇవ్వడం సాధ్యంకాదని చెప్పడంతో ఉసూరుమంటూ మహా బయటకు వచ్చేస్తుంది. అయితే నీ సిమ్ బ్లాక్‌ చేయించి కొత్త సిమ్‌ తీసుకుందామని చక్రి చెప్పడంతో ఇద్దరూ కలిసి మొబైల్‌ దుకాణానికి వెళ్తారు. అక్కడ చెక్‌చేయగా...ఆ సిమ్‌ మహాలక్ష్మీ తండ్రి పేరిట ఉంటుంది.  మీనాన్నగారు వచ్చి వేలిముద్రలు ఇస్తేనే కొత్త సిమ్ తీసుకోవడం సాధ్యమవుతుందని చెబుతారు. దీంతో చేసేదిలేక మహలక్ష్మీ ఇంటికి వెళ్లిపోతుంది. శైలూకు ప్రమోషన్ వీడియో అవకాశం రావడంతో కేశవ్‌ వద్దకు వచ్చి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. నీ డబ్బులు రేపు నీకు వడ్డీతో సహా నీ ముఖాన కొట్టేస్తాని చెబుతుంది. ఎగిరేగిరిపడే ఒకసారి బోల్తాపడ్డావని...ఇప్పుడు మళ్లీ అలాగే అవుతుంది కేశవ్‌ తిట్టిపంపిస్తాడు.    

Continues below advertisement

 

Continues below advertisement