Jagadhatri Serial Today Episode: సుజాత హత్య కేసులో నువ్వు ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా....మహేశ్‌ ఉన్నాడని నాకు తెలిసిందని జేడీ దివ్యాంకను ఫోన్‌లో బెదిరిస్తుంది. అతి త్వరలోనే వాడిని పట్టుకుంటానని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది.మహేశ్ పేరు చెప్పగానే దివ్యాంకకు చెమటలు పట్టేస్తాయి. సుజాత హత్య కేసుతో కౌషికికి  ఎలాంటి సంబంధం లేదని న్యూస్ రాగానే  కౌషికితోపాటు సుధాకర్ ఎంతో ఆనందపడతారు. నాకు కష్టం వచ్చిన ప్రతిసారీ ఆ జేడీ సాయం చేస్తూనే ఉందని కౌషికి అంటుంది. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ కౌషికి తప్పించుకోలేదని చెప్పావు కదా  అని వైజయంతి నిషికను నిలదీస్తుంది. నాకు కూడా తెలియదు అత్తయ్య....ఈసారి చాలా పకడ్బందీ ప్లాన్ వేసినట్లు  దివ్యాంక చెప్పిందని చెబుతుంది. అంతలో అక్కడికి వచ్చిన జగధాత్రి, కేదార్‌ కౌషితో ఆనందం పంచుకుంటారు. ఎలాగైతేనే ఈకేసు నుంచి బయటపడిపోయామని అంటారు.ఇదంతా ఆ జేడీ దయవల్లేనని కౌషికి అంటుంది. ఈ జగధాత్రి సాయం చేస్తుందంటే...వదినపై ప్రేమతో చేస్తుందని అనుకోవచ్చు. కానీ ఆజేడీ ఎందుకు వదినకు ప్రతిసారీ సాయం చేస్తుందో అర్థం కావడం లేదని నిషిక అంటుంది.                      ఈ కేసులో నుంచి బయటపడేసినందుకు జేడీకి  థ్యాంక్సు చెబుతానని కౌషికి అంటుంది. వెంటనే ఫోన్  తీసుకుని జేడీకి  ఫోన్ చేయగానే కేదార్ పాకెట్‌లో  ఫోన్ రింగవుతుంది. అదేంటి జేడీకి ఫోన్ చేస్తుంటే మనఇంట్లో రింగవుతుందని కౌషికి అంటుంది. అప్పుడు యువరాజు కేదార్‌ వంక చూస్తాడు. అమ్మా దొరికావురా కేదార్ అని అనుకుంటాడు. ఆ  జేడీ ఫోన్ నువ్వు పట్టుకుని వచ్చావన్నమాట అని అనుకుంటాడు. నిన్ను చూడు అక్క దగ్గర ఎలా ఇరికిస్తానో అని అనుకుంటాడు. వెంటనే కౌషికి చెబుతాడు. ఫోన్  మోగుతున్నది కేదార్ జేబులో అని అంటాడు. వెంటనే కౌషికి కేదార్ దగ్గరకు వచ్చి ఫోన్ ఇవ్వమని అడుగుతుంది.తమ బండారం భయటపడుతుందని భయపడిన జగధాత్రి కళ్లు తిరిగి కిందపడినట్లు నాటకం ఆడుతుంది. వెంటనే కేదార్ కంగారుపడి వెళ్లి నీళ్లు తీసుకుని వస్తాడు.ఆమె ముఖంపై నీళ్లు కొట్టి లేపుతాడు. అలసటగా ఉండటంతో కళ్లు తిరిగాయని చెబుతుంది. అయితే జగధాత్రిని పైకి తీసుకెళ్లమని కౌషికి చెబుతుంది. మళ్లీ కౌషికి కేదార్‌ను ఫోన్ చూపించమని చెప్పగా....నీళ్లు తీసుకురావడానికి వెళ్లినప్పుడే  కేదార్ ఫోన్ మార్చేయడంతో జగధాత్రి ఫోన్‌ తీసి చూపిస్తాడు. దీంతో సరేనని కౌషికి వెళ్లమంటుంది.                            మీరామీనన్‌ను తన భార్య కాదని ఒప్పించడానికి మీనన్ రకరకాల ప్రయత్నాలు సాగిస్తుంటాడు. ఆమెను టార్చర్‌ పెట్టడానికి వంట చేయమని  నీళ్లు తీసుకురమ్మని పనులు చెబుతుంటాడు. అవన్నీ చేయలేక డ్రాగన్ నానా అవస్థలు పడుతుంది.చివరకు దెయ్య వేషం వేసినా కానీ వదిలిపెట్టడు. ఇదంతా ఫోన్‌లో చూసి జేడీ,కేడీ నవ్వుకుంటారు.ఇంతలో ఆస్పత్రి నుంచి జేడీకి ఫోన్ వస్తుంది.మీరు ఆస్పత్రిలో చేర్పించిన ఆవిడకు స్పృహ వచ్చిందని చెప్పడంతో  ఉదయం ఆస్పత్రికి వెళ్తుంది జేడీ. అక్కడ ఆస్పత్రిలో ఉంచి చికిత్స చేయిస్తోంది ఎవరికో కాదు.....మీనన్‌ కాల్పుల్లో చనిపోయిందని అందరూ అనుకుంటున్న వాళ్ల మేనత్త రాగిణి. ఆమె కోమాలో నుంచి బయటపడి జగధాత్రిని చూసి ఏడుస్తుంది. నేను నిన్ను ఎన్ని బాధలు పెట్టినా నన్ను ప్రాణాలతో రక్షించావని అంటుంది. నాభర్త చేసిన తప్పునకు మీఅమ్మ నిందలుపడాల్సివచ్చిందని అంటుంది. వెంటనే  అన్నయ్యను పిలిస్తే నిజం చెప్పేస్తానని చెబుతుంది. అయినా మీరే వచ్చారేంటి వాళ్లంతా రాలేదా అని అడుగుతుంది.లేదు అత్తయ్య నువ్వు బతికి ఉన్నట్లు నాకు కేదార్‌కు తప్ప  మిగిలిన ఎవరికీ తెలియదని చెబుతుంది.అందరూ మీరు చనిపోయారనే అనుకుంటున్నారని చెబుతుంది.      

Continues below advertisement

 

Continues below advertisement