Lakshimi Raave Maa Intiki  Serial Today Episode: మ్యాడీ, శ్రీలక్ష్మీ కలిసి డ్యాన్స్‌ చేయబోతున్నారని తెలుసుకున్న త్రిష కోపంతో రగిలిపోతుంది. అయినా మనం ఇద్దరం డ్యాన్స్ చేసి ఆ వచ్చిన డబ్బులు లక్ష్మీకి ఇద్దామని త్రిష మ్యాడీకి చెబుతుంది.నేను కూడా ఇదే విషయం చెప్పానని...కాకపోతే తాను డ్యాన్స్ చేసి సంపాధించిన డబ్బులతోనే సాయం చేయాలని లక్ష్మీ అనుకుంటుందని చెబుతాడు.అందుకే నేను కూడా కాదనలేకపోయానని వివరిస్తాడు.ఈ మాటలు విన్న త్రిషకు ఇంకా కోపం పెరుగుతుంది. వెంటనే విక్రమ్ వద్దకు వెళ్లి మరో నాటకానికి తెరలేపుతుంది. మీరు నాకు సాయం చేయాలని అడుగుతుంది.కాలేజీలో జరగబోయే డ్యాన్స్‌ కాంపిటేషన్‌లో మీరు నాతో కలిసి  డ్యాన్స్ చేయాలని అడుగుతుంది. ఎందుకంటే ఆ లక్ష్మీ మ్యాడీతో కలిసి డ్యాన్స్ చేయబోతుందని చెబుతుంది.అందుకే మీరు నాతో డ్యాన్స్ చేసి వాళ్లను ఓడించాలని అంటుంది.ఎందుకు అలా అని విక్రమ్‌ అడగ్గా....మీరు నాతో కలిసి డ్యాన్స్ చేస్తే ఆ లక్ష్మీ జల్సీగా ఫీల్‌ అవుతుందని...అప్పుడు మీకు దగ్గరవుతుందని త్రిష చెబుతుంది. దీనికి విక్రమ్ సరేనని ఒప్పుకుంటాడు                    డ్యాన్స్ కాంపిటేషన్‌లో పేర్లు ఇవ్వడానికి  శ్రీలక్ష్మీ అటెండర్‌ దగ్గరకు వెళ్లగా....త్రిష కూడా వచ్చి  విక్రమ్‌ పేరు రాయిస్తుంది. దీంతో  శ్రీలక్ష్మీ త్రిషకు బ్రతిమలాడుతుంది.నాకు ఈ కాంపిటేషన్‌లో వచ్చే డబ్బులు చాలా అవసరమని మీరు ఎందుకు నాకు పోటీగా వస్తున్నారని అంటుంది.దీంతో శ్రీలక్ష్మీని అవమానిస్తుంది.పోటీకి ముందే ఓడిపోయానని ఒప్పుకుంటున్నావా అని అంటుంది. నేను డ్యాన్స్ చేసి మిమ్మల్ని ఓడించగలనన్న ధైర్యం ఉందని కాకపోతే అనవసరంగా పోటీ ఎందుకని అడుగుతున్నానని అంటుంది. మ్యాడీ నా పక్కన ఉన్నాడన్న ధైర్యమే నన్ను సగం గెలిపించిందని...రేపు కాంపిటేషన్‌లో మిగిలిన విజయం సాధిస్తానని అంటుంది.ఆ మాటలు విన్న త్రిష శ్రీలక్ష్మీ ముఖంపై ఇంకు చల్లుతుంది.రేపు స్టేజీపై ఇలాంటివి చాలా చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తుంది. దీంతో శ్రీలక్ష్మీ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోయి ముఖం కడుక్కుని వస్తుంది. లక్ష్మీ డల్‌గా ఉండటం చూసి మ్యాడీ అడుగుతాడు.ఆ త్రిష,విక్రమ్‌ మనకు పోటీగా వస్తున్నారని చెప్పగా...మ్యాడీ వెళ్లి త్రిషను నిలదీస్తాడు. లక్ష్మీకి డబ్బులు ఎంత అవసరమో నీకు చెప్పాను కదా అని అంటే...నేను పోటీకి రాలేదని, ఆ విక్రమ్‌ నా దగ్గరకు వచ్చి నన్ను అడిగాడని అందుకే ఒప్పుకున్నానని అబద్ధం చెబుతుంది.                        సూర్యనారాయణ బయట నుంచి ఇంటికి వచ్చి  అందరినీ పిలుస్తాడు.మ్యాడీ,శ్రీలక్ష్మీ ఇంకా కాలేజీ నుంచి రాకపోయేసరికి కొడుకుని ఫోన్ చేయమని చెబుతాడు.అతను ఫోన్‌ చేస్తుండగానే వాళ్లు ఇంట్లోకి వస్తారు.ఎందుకు  ఇంత ఆలస్యమైందని అడగ్గా....రేపు కాలేజీలో డ్యాన్స్‌ కాంపిటేషన్ఉందని అందులో మేం ఇద్దరం పాల్గొంటున్నామని రిహార్సల్‌ చేసి వచ్చే సరికి ఆలస్యమైందని మ్యాడీ చెబుతాడు. ఇలాంటి రికార్డింగ్ డ్యాన్స్‌లు మీకు ఎందుకని ప్రియంవద అరుస్తుంది. ఇందులో పాల్గొంటే ఫ్రైజ్‌మనీ వస్తుందని ఆ డబ్బుతో తాను సీక్రెట్‌గా వైద్యం చేయిస్తున్న అతనికి ఉపయోగిస్తానని చెబుతుంది. అతనికి ఎంత డబ్బులు అవసరమైతే అంత నేను చూసుకుంటానని చెప్పానుగా అని సూర్యనారాయణ అంటాడు. నా డబ్బులతోనే వైద్యం చేయిస్తానని శ్రీలక్ష్మీ చెబుతుంది.దీంతో ప్రియంవద మండిపడుతుంది. రోడ్డున పోయేవారందరికీ మనం ఎందుకు సాయం చేయాలని అరుస్తుంది.అయినా అతను ఎక్కడ ఉన్నాడో చెప్పు నేను అన్ని విషయాలు చూసకుంటానని చెబుతుంది. నేను చేయలేనప్పుడు అతని బాధ్యతలు మీకే అప్పగిస్తానని శ్రీలక్ష్మీ చెబుతుంది.అవన్నీ సరేగానీ ఇంతకు వీళ్లందరినీ మీరు ఎందుకు పిలిచారో చెప్పండని ఇందరి అంటుంది.అప్పుడు ఐశ్వర్యకు మంచి జమిందార్ల సంబంధం కుదిరిందని త్వరలోనే వాళ్లు పిల్లను చూడడానికి వస్తున్నారని సూర్యనారాయణ చెబుతాడు. ఐశ్వర్యకు అప్పుడే పెళ్లేంటని చిన్న కోడలు సుకన్య చెప్పినా...మంచి సంబంధమని సూర్యనారాయణ చెబుతాడు.దీంతో ఐశ్వర్య ఏడుస్తూ లోపలికి వెళ్లిపోతుంది.