Podharillu Serial Today Episode: గాయత్రి ఎంగేజ్‌మెంట్‌ కోసం పెద్దఎత్తున మైక్‌సెట్లు పెట్టి పాటలు పెట్టడంతో మాధవ్‌ చాలా చిరాకు పడుతుంటాడు.వాళ్లు కావాలనే ఇదంతా చేస్తున్నారని చక్రి అంటాడు. వెళ్లి ఆ ఎంగేజ్‌మెంట్ చెడగొడదామని చక్రి అంటాడు.అలాంటి పనులేవీ పెట్టుకోవద్దని మాధవ్‌ హెచ్చరిస్తాడు. అది తట్టుకోలేక పనికి వెళ్లిపోవడానకి మాధవ్‌ రెడీ అవుతాడు. ఇంతలో బన్సీ ఫోన్‌ చేసి ఇవాళ అసలు పనే లేదని చెప్పడంతో మహాలక్ష్మీతోపాటు అందరూ మాధవ్‌ను నిలదీస్తారు.గాయత్రికి ఇంకొకరితో పెళ్లి అయిపోతుందన్నబాధతో వెళ్లిపోతున్నావు కదూ అని అడుగుతారు.

Continues below advertisement

నువ్వు అలాంటిదేవీ చేయడానికి వీల్లేదని...ఇవాళ నువ్వు రెస్ట్‌ తీసుకుంటే మేం వంటచేసిపెడతామని మహా చెబుతుంది. అయితే మహాకు వంటచేయడం రాదని తెలిసి ఇంట్లో అందరూ భయపడుతుంటారు. కానీ తాను చేసి తీరతానని మహా అంటుంది. సాయం చేయడానికి కన్నా వెళ్తాడు. కానీ ఇంట్లో గ్యాస్‌ అయిపోవడంతో ఊరుకుంటారు. చేసేదిలేక అందరూ కలిసి బయట తినడానికి వెళ్దామని మహా అంటుంది.దీనికి ఇంట్లో వాళ్లు కూడా సరేననడంతో అందరూ కలిసి రెస్టారెంట్‌కు వెళ్లడానికి కారులో బయలుదేరతారు.                 

సరిగ్గా గాయత్రి వాళ్ల ఇంటి వద్దకు వచ్చేసరికి కారుకు ఎదురుగా పెళ్లి కొడుకు తండ్రి అడ్డువస్తాడు. దీంతో చక్రి కారు ఆపగానే...మాధవ్‌ను చూసిగుర్తుపట్టి దగ్గరకు వస్తాడు. మీకు ఈ కుటుంబానికి గొడవలు ఉన్నాయని తెలిసినా...పిలవగానే ఎంగేజ్‌మెంట్‌కు వచ్చినందుకు థ్యాంక్స్‌ అని చెబుతాడు.వాళ్లు చెప్పేది వినిపించుకోకుండానే కిందకు దిగమని ఆహ్వానిస్తాడు. వీళ్లు సరిగ్గా దొరికిపోయారని....ఇప్పుడు వీళ్లతో ఓ ఆట ఆడుకుందామని నారాయణ అంటాడు.పెళ్లికొడుకు తండ్రి వాళ్లను బలవంతంగా  కారులో నుంచి కిందకు దింపుతాడు.ఇంతలో అక్కడే ఉన్న గాయత్రి తండ్రిని,పెదమామను పిలిచి మీఇంటికి బంధువులు వచ్చారని లోపలికి ఆహ్వానించండని చెబుతాడు. వాళ్లు తటపటాయిస్తుంటే...మీకు మీకు ఎన్ని గొడవలు ఉన్నా పిలవగానే వచ్చారు కాబట్టి లోపలికి ఆహ్వానించడం మర్యాద అని అంటాడు. అప్పటికీ గాయత్రి తండ్రి పిలవకపోవడంతో....అసలు ఈసంబంధం కలుపుకుందే ఈ అబ్బాయి మీఅమ్మాయి గురించి మంచిగా చెప్పడం వల్లేనని అంటాడు.

Continues below advertisement

మీ  కుటుంబాల మధ్య గొడవలు ఉన్నప్పటికీ...మీ అమ్మాయి గుణగణాలు గురించి,మీ కుటుంబం గురించి ఎంతో గొప్పగా చెప్పాడని మాధవ్‌ను చూపిస్తాడు. ఆ అబ్బాయి చెప్పిన తర్వాతే మేం ఈ  సంబంధం ఖాయం చేసుకున్నామని చెబుతాడు. దీంతో రమణయ్య వాళ్ల బావతో పిలవమని చెబుతాడు. లేదంటే ఇప్పుడు మన అమ్మాయి ప్రేమ విషయం బయటపడి పెళ్లి క్యాన్సిల్‌ అవుతుందని హెచ్చరిస్తాడు. ఎంతసేపటికి వాళ్లను పిలవకపోవడంతో పెళ్లికొడుకు తండ్రి మండిపడతాడు. అంటే ఊర్లో చెప్పినట్లు మీది మర్యాద లేని కుటుంబమా అని నిలదీస్తాడు. పెళ్లికొడుకు తండ్రిని నేను చెప్పిందే మీరు పట్టించుకోవడం లేదంటే....రేపు పెళ్లయ్యాక నా మాటకు ఏం విలువ ఇస్తారని మండిపడతాడు. ఇలా చేస్తే మేం ఈ ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్‌ చేసుకుని వెళ్లిపోతామని అంటాడు. దీంతో భూషణం వెళ్లి తాయర్‌ను తీసుకుని వస్తాడు. అందరూ కలిసి వాళ్లను లోపలికి ఆహ్వానిస్తారు.                         

పెళ్లికొడుకు తండ్రి మాధవ్‌ను తీసుకుని వెళ్లి అతిథులు కూర్చున్న చోట కూర్చోబెట్టి తన కుమారుడికి పరిచయం చేస్తాడు. మాధవ్‌ను అక్కడ చూసిన గాయత్రి షాక్‌కు గురవుతుంది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని చాలా బాధపడతారు. మాధవ్‌ అక్కడ చాలా ఇబ్బందిపడుతూ వెళ్లిపోదామని చెబుతాడు.కానీ నారాయణ మాత్రం అక్కడే ఉందామని అంటాడు. అందరూ కలిసి స్టేజీమీదకు వెళ్లి గ్రూఫ్‌ ఫొటో కూడా దిగుతారు. ముహూర్తం సమయం దగ్గరపడుతుండంటో ఉంగరాలు మార్చుకోమని పంతులుగారు చెప్పినా  గాయత్రి పెళ్లికొడుకుకి ఉంగరం పెట్టకుండా చూస్తుంటుంది. వాళ్ల అమ్మ గట్టిగా హెచ్చరించే సరికి నాకు  ఈ పెళ్లి ఇష్టంలేదని...బావను మాత్రమే చేసుకుంటానని స్టేజీ దిగి కిందకు పరుగులు తీస్తుంది.