Jagadhatri Serial Today Episode: మీనన్‌  తనంతట తానుగా బయటపడాలని జగధాత్రి అనుకుంటుంది.డ్రాగన్ ద్వారా చిత్రహింసలు పెట్టిస్తే తప్ప అంత సులువుగా మీనన్ బయటపడడని కేదార్‌తో అంటుంది. మీనన్‌ ఇంటికి వెళ్లిన జేడీ,కేడీలు...అక్కడ పుల్లయ్య వేషంలో ఉన్న మీనన్‌ను ప్రశ్నిస్తారు. ఈ మీరామీనన్ నిజంగా మీనన్ భార్య కాదని...మీ భార్య అని నమ్మాలంటే మేం పెట్టే కొన్ని టెస్టుల్లో మీరు పాసవ్వాలని అంటారు. దీనికి మీనన్‌  సరేనంటాడు. అయితే మీరామీనన్ తన భర్తకు తొడపాశం పెట్టినా...కొంటెగా చూస్తూ అరవడని చెబుతుంది. దీంతో డ్రాగన్‌ మీనన్‌కు గట్టిగా తోలు ఊడిపోయి వచ్చేలా తొడపాశం పెడుతుంది.దీంతో మీనన్ నొప్పి తట్టుకోలేకపోతుంటే..అబిమాత్రం కొంచెం ఓర్చుకోమని చెబుతుంటాడు. అయినప్పటికీ మీనన్ తట్టుకోలేక గిలగిల కొట్టుకుంటాడు. అది తొడపాశం పెట్టినట్లు లేదురా..కుక్క కండపీకినట్లు పీకుతుందిరా అని అరుస్తాడు. దీంతో మీరు తొలిటెస్టులో ఓడిపోయారని జేడీ అంటుంది. ఇక రెండో టెస్టుకు సిద్ధమా అని అడుగుతుంది. అప్పుడు డ్రాగన్ కల్పించుకుని ఇది నా టాలెంట్ ఉపయోగించి నేను పెడతానని అంటుంది. పెద్ద పాత్ర తీసుకొచ్చి....నా మొగుడికి నగలు పువ్వులుగా మార్చడంవచ్చని అంటుంది.అబితో ఇంట్లో ఉన్న బంగారం తీసుకురమ్మని చెబుతుంది. వాడు వెళ్లి నగలు తెచ్చిపాత్రలో వేయగానే.....మీనన్‌ చేతిని అందులో పెట్టిస్తుంది.అవన్నీ పువ్వులుగా మారిపోతాయి.ఇదంతా ఉట్టిదేనని ఇది నా నగలన్నీ కొట్టేసిందని మీనన్ గోల చేస్తాడు. సో అయితే రెండో టెస్టులో మీరే గెలిచారన్నమాట అని జేడీ అంటుంది.                       చివరిగా మూడో టెస్టులోనూ మీరు గెలిస్తే....ఈ మీరామీనన్ పెంటమ్మని మేం ఒప్పుుకుని మీతో పాటు పంపిస్తామని అంటారు. అయితే టెస్ట్‌ ఏంటో చెప్పమని అభి అడుగుతాడు.ఇది టెస్టుకాదని...ఓ చిన్న విచారణ మాత్రమేనని అంటుంది. గతంలో మీరామీనన్‌కు కోపం వచ్చి తన భర్త ఒంటిమీద అట్లకాడతో ఎర్రగా కాల్చివాత పెట్టిందని తెలిసింది.అది మీకు ఉంటే మీరే ఆమె భర్త అని ఒప్పుకుంటాం అని అంటారు. దీంతో మాకు ఓ 10నిమిషాల సమయం కావాలని చెబుతారు. లోపలికి తీసుకెళ్లి అట్లకాడతో వాతపెట్టించుకోమని అబి తొందరపెడతాడు. ఆ జేడీ చేతిలో ఓడిపోకూడదంటే నువ్వు ఈ పని చేయాలని చెబుతాడు.దీంతో వాళ్లు కుడివైపు మచ్చఉందని చెబితే పొరపాటుగా ఎడమవైపు అట్లకాడతో అబి కాలుస్తాడు.మళ్లీ రెండోసారి కుడివైపు కూడా కాలుస్తాడు.అమ్మా అయ్యా అనుకుంటూ బయటకురాగా....మా ఆయనకు  ఎలాంటి మచ్చలులేవని నేను సరదాగా చెప్పానని డ్రాగన్ అంటుంది.అంటే మీరు మూడోటెస్టులో ఓడిపోయారని చెప్పి జేడీ,కేడీ అక్కడి నుంచి వెళ్లిపోతారు.                               కౌషికి రూమ్‌లో పెట్టిన డబ్బులు ఏమయ్యాయని దివ్యాంక నిషికను అడుగుతుంది.ఆ డబ్బులు వదిన రూమ్‌లోనే ఉన్నాయని చెబుతుంది.ఇన్నిరోజులు అక్కడే ఉండటం ఏంటని ఎందుకు బయటకు తీసుకురాలేదని నిలదీస్తుంది. నువ్వు చెప్పలేదు  కాబట్టి తీసుకురాలేదని నిషిక అంటుంది. ప్రతీది నేనే చెప్పాలా అని దివ్యాంక మండిపడుతుంది. అవి 10కోట్లు అని నేను వేరే వాళ్లకు ఇవ్వాల్సి ఉందని ఇప్పుడు నాకు డబ్బు కావాలని వెంటనే వెళ్లి తెచ్చి నీదగ్గర పెట్టుకోమని చెబుతుంది. దీంతో నిషిక సరేనని అంటుంది.ఇదంతా విన్న జగధాత్రి, కేదార్‌...ఈ పని మీదేఅన్నమాట  అని అనుకుంటారు.దివ్యాంక చేసిన తప్పు ఆమె నోటి నుంచి చెప్పించాలని ప్లాన్ వేస్తారు. ఈ విషయం వెళ్లి కౌషికి చెప్పి మేం ఒక ప్లాన్ వేశామని నువ్వు సహకరించాలని చెప్పడంతో  కౌషికి ఓకే అంటుంది. వెంటనే ది‌వ్యాంకకు ఫోన్ చేసిన జగధాత్రి....సురేష్‌ అన్నయ్య ఫోన్ కలవడం లేదని నీ దగ్గర ఉంటే ఓ ఇంపార్టెంట్‌ విషయం చెప్పాలని అంటుంది.ఏంటదని అడిగితే....వెంకటేశ్‌గారి దగ్గర తీసుకున్న డబ్బుల  విషయంలో వదిన తన తప్పు ఒప్పుకుని ఆ డబ్బును అనాథ ఆశ్రమానికి ఇవ్వాలని నిర్ణయించుకుందని చెప్పడంతో దివ్యాంక అదిరిపడుతుంది. నా డబ్బులు కౌషికి దానం చేయడం ఏంటని కంగారుపడి పరుగెత్తుతుంది.ఇంతలో కేదార్ సురేష్‌కు ఫోన్‌ చేసి ఇంటికి వస్తేఅన్ని విషయాలు తెలుస్తాయని చెప్పి రమ్మంటాడు. ఉదయం డబ్బులు కొట్టేయడానికి నిషిక,వైజయంతి ప్లాన్ చేస్తుండగా....డబ్బు సంచితో కౌషికి బయటకు రావడం చూసి నోరు వెళ్లబెడతారు.