Podarillu Serial Today Episode: జీ తెలుగు ఛానెల్‌లో అత్యంత ప్రేక్షక ఆదరణతో దూసుకుపోతున్న పొదరిల్లు సీరియల్‌లో ఇవాళ అల్లుడిపై మామదే పైచేయిగా నిలుస్తుంది. కూతురుని పూర్తిగా నమ్మించడానికి ప్రతాప్ వేసిన ఎత్తులకు చక్రి ఉక్కిరిబిక్కిరి అవ్వడంతో ఈరోజు ఏపిసోడ్ రసవత్తరంగా మారుతుంది.మాధవ్‌ మనసు దోచిన మనీషా   పనికి వెళ్తుంటే సైకిల్ పంక్చర్‌ అవ్వడంతో మాధవ్‌కు ఏం చేయాలో తెలియక ఆటోకు వెళ్తామని అనుకుంటాడు. సైకిల్‌రోడ్డుపక్కన పడేసి సాయంత్రం వెళ్లేప్పుడు తీసుకుని వెళ్తామని ఫిక్స్‌అవుతాడు. ఆటోకోసం రోడ్డుపక్కకు వెళ్తుండగా అప్పుడే ఆటోకోసం ఓ హిందీ అమ్మాయి అక్కడ ఉంటుంది. ఇద్దరూ ఆటోను ఆపి ఎక్కబోతుండగా తలలు గుద్దుకుంటాయి. అప్పుడే ఆ అమ్మాయిని చూసి మాధవ్‌ కళ్లు వెలిగిపోతాయి. ఆమెకు తెలుగురాదు....మాధవ్‌కు హిందీరాదు. దీంతో ఆటోవాడు ఎక్కడికి వెళ్లాలని అడిగినా....ఆమె చెప్పేది అర్థంకాదు. దీంతో కొంచెంకొంచెం అర్థంచేసుకున్న మాధవ్‌ అడ్రెస్‌ చెప్పి....తాను కూడా అక్కడికే వెళ్తున్నానని చెప్పి తీసుకెళ్తాడు. డబ్బులు ఇచ్చే దగ్గర కూడా ఆమెకు తెలుగురాకపోవడంతో సాయం చేస్తాడు. దీంతో ఆ అమ్మాయి మాధవ్‌కు థ్యాంక్స్‌  చెప్పి వెళ్లిపోతుంది.

Continues below advertisement

మాధవ్‌ తన పనిలో నిమగ్నమై ఉండగా...అప్పుడే బన్సాల్‌ స్వీట్‌ తీసుకుని వస్తాడు. ఊరు వెళ్లి ఇవాళే వచ్చానని...నీకు ఇద్దామని స్వీట్‌ తెచ్చానని చెబుతాడు. ఈసారి నేను ఒక్కడినే రాలేదని...చెప్పి మనీషాను పిలుస్తాడు.ఎవరు ఈ అమ్మాయి కొంపదీసి పెళ్లిచేసుకుని వచ్చావా అంటే కాదన్నా..ఈ అమ్మాయి  మాచెల్లెలు మనీషా అని చెప్పగానే ఇద్దరూ ఒకరినొకరు మాట్లాడుకుంటారు. మీకు ముందే పరిచయం ఉందా  అని బన్సాల్‌  అడగ్గా...ఉదయం ఆటో వద్ద కలుసుకున్నామని చెబుతాడు.దీంతో వాళ్లిద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు.

Continues below advertisement

చక్రితో ప్రతాప్ మళ్లీ గిల్లికజ్జాలు                          ఇంట్లో ఒంటరిగా ఉండి బోరుకొడుతున్న మహా...నిహారికతో గుడికి వెళ్దామా అని అడుగుతుంది. ఇక్కడ ఉన్నప్పుడు గుడికి వెళ్దామని ఎంత పిలిచినా వచ్చేదానివి కాదని...ఇప్పుడేంటి నువ్వే గుడికి వెళ్దామా అని అడుగుతున్నావని అంటుంది.అక్కడికి వెళ్లిన తర్వాత వారంవారం గుడికి వెళ్లడం అలవాటు  అయిపోయిందని...అందుకే వెళ్దామని అంటున్నానని అంటుంది. ఇద్దరూ లలితకు చెప్పి గుడికి నడిచి వెళ్తారు. ఇంతలో అక్కడికి వచ్చిన చక్రితో ప్రతాప్‌, ఆదిమాటల యుద్ధం మొదలుపెడతారు.దీనికి చక్రి కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తాడు. సిరిపాపను స్కూల్‌లోదింపడానికి కారు డ్రైవర్‌  లేకపోవడంతో ప్రతాప్‌ చక్రిని డ్రైవర్‌ ఇటు రా అని పిలుస్తాడు. దగ్గరు వచ్చిన చక్రిని నువ్వు డ్రైవర్‌వే కదా వెళ్లి పాపను స్కూల్‌లో దింపిరమ్మని చెబుతాడు. నేను చేసే పనిని దైవంగా భావిస్తానని కాబట్టి మీరు డ్రైవర్‌ అన్నా ఏం పట్టించుకోనని చక్రి చెప్పి పాపన తీసుకుని వెళ్లిపోతాడు.చక్రితో బిజినెస్‌ పెట్టిస్తామన్న ప్రతాప్‌  భోజనాలకు అందరూ కూర్చుని చక్రిని పిలవకపోవడంతో మహా చక్రి  ఎక్కడని అడుగుతుంది. మేం పిలిచామని కానీ అల్లుడుగారే ఇంకా రాలేదని ప్రతాప్ అంటాడు. మహా పిలవడంతో చక్రి భోజనానికి వస్తాడు. ఎవరూ వడ్డించకపోతే ఎలా తింటాడని అనగా....లలిత లేచి చక్రి ప్లేట్‌ నిండా నాలుగుఐదు కూరలతో వడ్డిస్తుంది.అంతపెడితే ఎలా తింటాడని మహా అనగా...ఆ  ఇంట్లో అంటే ఒక్క కూరే ఉంటుంది కాబట్టి తినలేడని...కానీ ఇన్ని కూరలు,ఇన్ని వెరైటీలు ఎప్పుడూ చూసి ఉండడుకదా ఎక్కువే తింటాడులే అని అంటుంది.భోజనం చేస్తుండగా ప్రతాప్‌ చక్రిని ఎన్నాళ్లుగా డ్రైవర్‌ ఉద్యోగం చేస్తున్నావని అడుగుతాడు.పదేళ్లుగా చేస్తున్నానని చె‌ప్పగా....డిగ్రీ  అయిపోగానే ఇదే పనిలో చేరావా అని అంటాడు.ఇప్పుడు అవన్నీ ఎందుకు నాన్న అని మహా అడ్డు చెబుతుంది. కాదమ్మా ఇంతకు ముందు అంటే అల్లుడుగారు ఒక్కరే ఉండేవారు కానీ ఇప్పుడు ఫ్యామీలో వచ్చింది కదా ఎక్కువ సంపాదించాలి కదా అని అంటాడు.అందుకే అల్లుడిగారితో బిజినెస్‌ చేయిద్దామని అనుకుంటున్నానని అంటాడు. నాకు బిజినెస్‌లు చేయడం రాదని చక్రి చెబుతాడు. నేను దగ్గర ఉండి చేయిస్తానని హామీ ఇస్తాడు.మహాను శాశ్వతంగా ఇక్కడే ఉంచేలా ప్లాన్‌                ఆ డ్రైవర్‌గాడిని వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి పంపిచేయమని లలిత ప్రతాప్‌ను కోరుతుంది.అందుకు ఓ మంచి ప్లాన్ వేశానని ప్రతాప్‌ ఆది, లలితతో చెబుతుండగా మహా అక్కడికి వస్తుంది. ఏం మాట్లాడుకుంటున్నారని అడగ్గా....ఏం ఉంటుంది నిన్ను శాశ్వతంగా ఇక్కడే ఉంచుకుని కళ్లల్లో పెట్టుకుని చూసుకోవాలనుకుంటున్నారని ఆది అంటాడు.దీనికి మహాకు కోపం వస్తుంది. నేను ఇక్కడే ఉండిపోవడానికి వచ్చానని ఎవరన్నారని అంటుంది. అందేంటే ఆ పనికిమాలిన ఇంట్లో ఎలా ఉంటావు అని లలిత కోప్పడుతుంది. నేను మంచి ఉద్యోగం చేసి నా కాళ్లపై నేను నిలబడే వరకు రానని చెప్పాను కదా నాన్న అని మహా అంటుంది.నీ ఇష్టం వచ్చినట్లే చేద్దామని అంటాడు. నాకు తెలిసిన ఫ్రెండ్‌కు చెప్పి నీకు ఉద్యోగం చూడమని చెబుతానని అంటాడు. మొన్న ఓ ఇంటర్వూకు వెళితే ఆ జుట్టుపోలిగాడు చెడగొట్టాడని చెబుతుంది. ఇంతలో ప్రతాప్‌ ఆదిని పిలిచి వాడిని మళ్లీ మన మహా జోలికి రావొద్దని గట్టిగా చెప్పమని చెబుతాడు. హమ్మయ్యా మావాళ్లు వాడిని వద్దంటున్నారంటే....నేను చక్రితో జరిగింది నిజమైన పెళ్లికాదని చెప్పొచ్చని మహా  అనుకుంటుంది. వాళ్లు ఏం ప్లాన్‌లు చేస్తున్నారో ఎలాంటి కుట్రలు పన్నుతున్నారో తెలియక చక్రి గింజుకుంటాడు.