Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున భానుమతి ఆటోలో నేత్ర కోసం బయల్దేరుతుంది. భాను మిథునతో నువ్వు కాబట్టి సాఫ్ట్‌గా వకీల్‌సాబ్ దగ్గరకు వెళ్లి బెయిల్ అని అంటూ తిరుగుతున్నావ్ నేను అయితే ఈ కేసు పెట్టిన దాన్ని నాలుగు పీకి కేసు వాపస్ తీయించుకునేలా చేసేదాన్ని అని అంటుంది.
మిథున భానుతో నేను అదే చేయాలని వెళ్తున్నా అని చెప్తుంది. షాక్ అయిన భాను ఇది అలా చేసి నా రాజుని విడిపిస్తే మంచి భార్యగా ఇది మార్కులు కొట్టేస్తుందని అనుకొని ఆటో పక్కకి ఆపి నీతో పాటు నేను వస్తే నా రాజుని విడిపించడానికి మొత్తం నువ్వే చేసినట్లు క్రెడిట్ కొట్టేస్తావ్.. అందుకే నీ ప్రయత్నాలు నువ్వు చేయ్ నా ప్రయత్నాలు నేను చేస్తా అని మిథునని రోడ్డు మీద దింపేస్తుంది.
దేవాని చూస్తూ ఎస్‌ఐ రేయ్ నా మీదకే వస్తావా.. నా షర్ట్ పట్టుకుంటావా నన్ను రెచ్చగొడితే దాని రియాక్షన్ ఎలా ఉంటుందో నీకు చూపిస్తా. ఫిక్స్ అయిపో బతికినంత కాలం నువ్వు జైలులోనే బయటకు రాలేవు చూసుకో అని అంటాడు. నేత్ర లగేజ్ తీసుకొని బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తుంటే ఆదిత్య కాల్ చేస్తాడు. ఎక్కడున్నావ్ అని అడుగుతాడు. కోదాడ వెళ్లాలని బస్‌స్టాప్ దగ్గర వెయిట్ చేస్తున్నా మీరే దాక్కొమని చెప్పారని అంటుంది. నువ్వు ఎక్కడికీ వెళ్లకు నేను వస్తున్నా అని అంటాడు. ఎందుకు అని నేత్ర అడిగితే నిన్ను ఎక్కడికి పంపించాలో నాకు తెలుసు .. మిథున అటు వస్తుంది.. నువ్వు జాగ్రత్తగా తన కంట పడకుండా ఉండు నేను వచ్చి ఫోన్ చేస్తే బయటకు రా అని చెప్తాడు.
దేవా మిథునని తలచుకుంటూ బాధపడతాడు. ఇంతలో కానిస్టేబుల్ వచ్చి ఎంత పెద్ద విషయమైనా నువ్వు బాధ పడవు అలాంటిది కన్నీరు పెట్టుకుంటున్నావ్ అంటే నాకు షాకింగ్‌గా ఉందని అంటాడు. దానికి దేవా ఈ కన్నీరు నా కోసం కాదు మిథున కోసం.. నేను జైలుకి వెళ్తే మిథున తట్టుకొని బతకలేదు.. నా కోసం మిథున అందర్ని వదిలేసింది..ఈ లోకంలో తనకి నా కంటే ఎవరూ ఎక్కువ కాదని బతుకుతుంది. తనకి ప్రాణం సర్వస్వం నేనే.. నేను జైలుకి వెళ్తే తనేమైపోతుందా అని భయంగా ఉంది అని ఏడుస్తాడు. కానిస్టేబుల్ దేవాతో మీ ఇద్దరి మధ్య ఇంత ప్రేమ ఉంటే మా ఎస్‌ఐ లాంటి వాళ్లు మీకు ఏం చేయలేరు. మేడం మిమల్ని బయటకు తీసుకెళ్తారని చెప్తాడు.
ఆదిత్య లొకేషన్‌కి వస్తాడు. నేత్రి పిలిచి రాబోతుంటే మిథున అక్కడికి వస్తుంది. ముగ్గురు ఒకే దగ్గర నిల్చొంటారు. సరిగ్గా మిథున చూసే టైంకి నేత్ర దాక్కుంటుంది. మిథున ఆదిత్యని చూసి షాక్ అయిపోతుంది. ఆదిత్య నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది. నేత్ర ఇక్కడే ఉంది నువ్వు కూడా ఇక్కడే ఉందని అంటుంది. దానికి ఆదిత్య నీ కోసమే వచ్చా నువ్వు నేత్ర కోసం వెతుకుతూ టెన్షన్ పడుతున్నావ్ అని వచ్చానని అంటాడు. నేను ఇక్కడికి వస్తాను అని నీకు చెప్పలేదు కదా అయినా నేత్ర ఇక్కడ ఉందని నీకు ఎలా తెలుసు అంటే నువ్వు ఆటోలో వెళ్లడం చూసి నిన్ను ఫాలో అయ్యానని అంటాడు.
మిథున ఆదిత్యతో నువ్వు నా ఆటో ఫాలో అయితే ఆటో వెనక రావాలి కానీ ముందు ఎలా వచ్చావ్.. పైగా వేరే రూట్‌లో ఎలా వచ్చావ్ అని అడుగుతుంది. సిగ్నల్ పడి మిస్ అయ్యా కన్ఫ్యూజ్‌లో ఇలా వచ్చేశా నువ్వు ఎదురు పడ్డావ్ అని అంటాడు. ఇంతలో నేత్ర కాల్ చేయడంతో అర్జెంట్ కాల్ అని చెప్పి వెళ్లిపోతాడు. నేత్రతో మిథున నీ ఫోన్ ట్రేస్ చేస్తుంది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అక్కడ పడేసి పక్కనే ఉన్న పార్కుకి రా అని చెప్తాడు. తర్వాత రౌడీలకు కాల్ చేసి నేత్ర పార్క్ దగ్గరకు వచ్చింది చంపేయండి అని ఆదిత్య అంటాడు. మిథున లొకేషన్ కట్ అయిపోవడంతో నేత్రని ఎలా పట్టుకోవాలా అనుకుంటుంది.
ఆనంద్ తండ్రితో తమ్ముడిని కోర్టుకి తీసుకెళ్తున్నారని చెప్తాడు. సత్యమూర్తి కుప్పకూలిపోతాడు. రేప్ కేస్ అంటే మరి బయటకు దేవా రాడు అని కాంతం రెచ్చగొడుతుంది. సత్యమూర్తి ఏడుస్తూ ఈ లోకంలో మన కంటే దురదృష్టవంతులు ఉండరు శారద.. కొడుకు జీవితం నాశనం అయిపోతుంటే గుండెలు పగిలేలా ఏడ్వడం తప్ప ఏం చేయలేని పరిస్థితి అని ఏడుస్తాడు. మిథున దేవాని విడుదల చేసుకొని తీసుకొస్తుందని శారద అంటుంది. ఆనంద్, రంగం కూడా మిథున చూసుకుంటుంది అని అంటే వాడు రోడ్డు మీద గొడవ పడి జైలుకి వెళ్లలేదురా.. ఇది ఆడపిల్ల సమస్య వాడు విడుదల కావడం కష్టం అని అంటాడు. పిల్లలు అందరిలో వాడికే గొప్ప భవిష్యత్ ఉంటుంది అని కలలు కన్నా కానీ వాడి భవిష్యత్ నాశనం అయిపోయింది అని సత్యమూర్తి ఏడుస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.