Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున దేవా మాటలు తలచుకొని బాధ పడుతుంటే హరివర్ధన్ వెళ్లి ఇప్పటికే నీకు జ్ఞానోదయం అవ్వాలి.. నువ్వంటే ప్రేమ లేని చోట నువ్వెంత ప్రేమ వెతుక్కున్నా వృథా ఎలాంటి ఉపయోగం ఉండదు అని చెప్తారు. అని చెప్తారు. ఇప్పటికైనా వాస్తవం అర్థం చేసుకో నీ జీవితానికి సంబంధించి సరైన నిర్ణయం తీసుకోమ్మా.. కన్నీటిని ఇక్కడితో వదిలేయకపోతే జీవితాంతం బాధ పడతావ్.. నువ్వు బాధ పడి మమల్ని బాధ పెట్టకు అని అంటాడు. మిథున చాలా ఏడుస్తుంది. దేవా కూడా ఏడుస్తాడు.
దేవాకి మిథున మీద ప్రేమ లేదని.. చచ్చినా మెట్టెలు పెట్టడు అని భార్యగా ఒప్పుకోడని భలే చెప్పావే అని రంగం కాంతాన్ని పొగిడేస్తాడు. నాకు అన్నీ ముందే తెలిసిపోతాయని కాంతం తనో బాబాలా బిల్డప్ ఇస్తుంది. మిథున దేవా ఇంటికి వచ్చేసుంటుంది. మిథున ఓ చోట బాధ పడుతూ ఉంటే సత్యమూర్తి తనకు జరిగిన అవమానం గుర్తు చేసుకొని కనీసం బట్టలు కూడా మార్చకుండా చిరిగిన బట్టలతోనే కూర్చొని ఉంటాడు. శారద సత్యమూర్తికి బట్టలు మార్చుకోమని చెప్తుంది. కాంతం అత్తతో షర్టు మార్చుకున్నంత మాత్రాన అంత మందిలో జరిగిన అవమానం మానిపోతుందా అని అంటుంది.
దేవా వల్లే అడుగడుగునా నాన్నకి అవమానాలే అని రంగం అంటాడు. ఇంతలో దేవా ఇంటికి వస్తాడు. శారద దేవాని ఆపి కొట్టి ఎందుకు ఇలా చేశావ్ రా మాకు మళ్లీ కడుపు కోతని తనకి కన్నీటి కోతని ఇచ్చావ్ ఎందుకు ఇలా చేశావ్‌రా అని నిలదీస్తుంది. కలిసిపోయిన రెండు కుటుంబాలను మళ్లీ విడిపోయేలా ఎందుకు చేశావ్‌రా.. దేవత లాంటి నీ భార్యని అందరి ముందు ఎందుకురా అంతలా బాధ పెట్టావ్ అని అడుగుతుంది. దేవా ఏం మాట్లాడడు.
సత్యమూర్తి లేచి వెళ్లిపోతూ రక్తం మరిగిన పులి మారుతుందని నమ్మడం ఎంత తప్పో.. వీడు మారాడని నమ్మడం మన తప్పు అంతే అమాయకత్వం వీడిని ఎంత నమ్మితే అంత మోసపోవాలి.. కొన్ని సార్లు గుడ్డిగా నమ్మినందుకు మన మీద మనకే అసహ్యం వేస్తుంది. ఒక ఆడపిల్ల కన్నీటికి చాలా శక్తి ఉంది ఆ ఉసురు అంత తేలికగా వదిలి పెట్టదు అని చెప్పి వెళ్లిపోతాడు. ప్రమోదిని దేవాతో మిథున అంటే నీకు ఎంత ఇష్టమో వీళ్లకి తెలీదు కానీ నాకు తెలుసు.. మిథునని నువ్వు నా భార్య అనడం నేను విన్నాను.. మిథున కోసం అంత ఆరాట పడిన నువ్వు ఈ రోజు మెట్టెలు తొడక్కుండా తనని ఎందుకు అంతలా బాధపెట్టావ్ అని అడుగుతుంది.
ఆనంద్ తమ్ముడితో నాన్నకి నీ మీద ఉన్న కోపం పోయిందిరా.. ప్రేమగా దగ్గరకు తీసుకుంటున్నారురా.. ఎందుకురా మళ్లీ దూరం అవుతున్నావ్ అని అంటాడు. శారద మళ్లీ నిజం చెప్పమని నిలదీస్తుంది. దేవా ఏం మాట్లాడకుండా ఏడుస్తున్న మిథునని చూసి మౌనంగా వెళ్లిపోతాడు. దేవా అద్దంలో చూసుకొని చా ఏం లైఫ్‌రా నీది అనుకొని చాలా ఏడుస్తాడు.
త్రిపుర తమ్ముడితో దేవా మెట్టెలు తొడగడు అన్నావ్ అలాగే జరిగింది.. మిథున ఇక దేవాకి దూరం అయిపోతుందని త్రిపుర అంటుంది. దానికి ఆదిత్య ఈ దూరం సరిపోదు అక్క మిథున దేవా మీద పెంచుకున్న నమ్మకం పోవాలి.. ఇంకా ఏదో జరగాలి.. అప్పుడే మిథున దేవాని వదిలేస్తుంది అని అంటాడు. అలా జరిగితే నువ్వు మిథున ఒక్కటవుతారని త్రిపుర చెప్పి వెళ్లిపోతుంది. ఆదిత్య తనలో తాను మిథున దేవా మీద నీకు ఉన్న ప్రేమ, నమ్మకం ఒకే దెబ్బకు పోయేలా చేస్తా ఏ భార్య తట్టుకోలేని మోసం చేయిస్తా.. దెబ్బ కొడతా.. దెబ్బకి నువ్వు ఆ దేవాని ఛీ కొట్టేలా చేస్తా అని అనుకుంటాడు.
శారద బాధ పడుతుంటే మిథున యాక్టివ్‌గా వెళ్లి అత్తయ్యా ఏంటి అత్తయ్యా ఎందుకు ఇలా బాధ పడుతున్నారు అని అంటుంది. నవ్వులతో సంతోషాలతో నిండిపోవాల్సిన ఈ ఇళ్లు ఏడుపుతో నిండిపోయింది అని ఏడుస్తుంది. చిన్ని విషయానికి ఇంతలా బాధ పడతారా.. నన్ను దూరం చేసుకోవాలని దేవా అనుకుంటే నేను దూరం అయిపోతానా.. తను నన్ను ఎంత దూరం పెట్టాలి అనుకుంటే నేను అంత దగ్గరవుతా జరిగిన విషయం మీరు మర్చిపోండి..నాలా సంతోషంగా ఉండండి అని చెప్తుంది.
ప్రమోదిని చూసి మనసులో అంత బాధ ఉంచుకొని సంతోషం నటిస్తావ్ అంటే మిథున కొన్ని క్షణాల వరకు బాధ పడ్డా కానీ ఇప్పుడు సంతోషంగా ఉన్నాను అంటుంది. నీ పెళ్లికి సంబంధించి ఏ తంతు రెండు కుటుంబాల మధ్య జరగలేదని బాధ పడ్డావ్ మొదటి సారి ఈ మెట్టెల తంతు జరుగుతుందని సంబరపడిపోయావ్ కానీ ఇప్పుడు బాధ లేదు అంటే ఎలా నమ్మాలి అంటుంది. దానికి మిథున ఆయన మనసులో నాకు భార్య స్థానం ఉంది.. నా మీద ప్రేమ ఉంది కానీ ఏదో సంఘటన తనని ఆపేసింది అదేంటో తెలుసుకోవాలి అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.