Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథునకు ముడుపు కట్టమని శారద చెప్తుంది. దేవా వెళ్లిపోతుంటే మిథున పట్టుకొని ఆపుతుంది. అత్తయ్యగారు నిన్ను నాకు తోడుగా ఉండమని చెప్పారు కదా ఎక్కడికి పారిపోతావు అని అంటుంది. 

Continues below advertisement

మిథున ముడుపు కట్టడానికి తన కోరికను పేపర్‌ మీద రాస్తుంది. ఏంటి స్టోరీలు రాసేస్తున్నావ్ అని దేవా అంటే నువ్వు మా నాన్నకి ఇచ్చిన ఒట్టు గట్టు మీద పెట్టాలి అని ఆ దిక్కుమాలిన రౌడీయిజం మానేసి నాతో జీవితాంతం కలిసి ఉండాలని కోరుకుంటున్నా అని అంటుంది. మిథునకు ముడుపు కట్టడానికి వెళ్లి కొమ్మని అందుకోవడానికి ఎగురుతూ జారి దేవా మీద పడిపోతుంది. దేవా మిథునని పట్టుకుంటాడు. ఇద్దరూ అలా చూస్తూ ఉండిపోతారు. 

నన్ను ఎందుకు పట్టుకున్నావ్ అని మిథున దేవాని అడుగుతుంది. ఒక మనిషి పడిపోతుంటే పట్టుకోవడం మానవత్వం అని దేవా అంటే కాదు ప్రేమ అని మిథున అంటుంది. మిథున దేవాని ఎత్తుకోమని చెప్తుంది. నేను ఎత్తుకోను అని దేవా అంటే అత్తయ్యా అంటుంది దాంతో దేవా మిథునని ఎత్తుకొని ముడుపు కట్టిస్తాడు. ముడుపు నుంచి అక్షింతలు ఇద్దరి మీద పడతాయి. మిథున చాలా హ్యాపీగా ఫీలవుతుంది. మన ఇద్దరినీ ఆ పార్వతి పరమేశ్వరు ఎలా దీవించారో చూశావా ప్రాణం పోయే చివరి నిమిషంలో కూడా మనం ఒకరి చేయి ఒకరు విడిచిపెట్టమని మిథున అంటుంది. 

Continues below advertisement

హరివర్ధన్, లలిత కూడా గుడికి వస్తారు. జడ్జి హరివర్ధన్‌ని కిడ్నాప్ చేయడానికి దేవుడమ్మ మనుషులు గుడికి వస్తారు. హరివర్దన్‌ని ఎవరూ చూడకుండా వచ్చేయండి.. దేవుడికి చూడటానికి వచ్చిన వాడిని డైరెక్ట్ దేవుడి దగ్గరకే పంపేయండి అని రౌడీలకు దేవుడమ్మ కాల్ చేసి చెప్తుంది. మిథున, దేవాలు హరివర్థన్ వాళ్లని చూస్తారు. లలిత అందరి పేరు మీద అర్చన చేయిస్తుంది. 

మిథున శారదతో అమ్మానాన్న వచ్చారు వెళ్లి పలకరిద్దాం రండి అంటుంది. దేవా రాను అని చెప్తాడు. అత్తామామల్ని అల్లుడు పలకరించాలి లేదంటే పొగరు అనుకుంటారురా అని మిథున తీసుకెళ్తుంది. మిథున అమ్మానాన్నల్ని పలకరిస్తుంది. దేవా నమస్కారం పెడతాడు. లలిత, శారద చక్కగా మాట్లాడుకుంటారు. మిథున మొక్కులు తీర్చుకుందాం అంటే వచ్చాం అని శారద అంటే నీకేం మొక్కులే అని లలిత అంటుంది. కొందరి మనసులు మారాలని మొక్కుకున్నా అని మిథున అంటుంది. కొన్ని మనసులు ఎప్పటికీ మారవు అని హరివర్ధన్ అనేసి వెళ్లిపోతాడు. 

హరివర్ధన్ లలితతో చిరాకు పడతాడు. దేవా వాళ్లు వస్తారు అని తెలిసుంటే నేను వచ్చేవాడినే కాదు అని అంటాడు. లలిత భర్తని ఊరుకోమని చెప్పి కాసేపు గుడిలో కూర్చొందామని అంటుంది. ఇక మిథున మొక్కు అంటూ నేల మీద తినడానికి కూర్చొంటుంది. శారద కోడలికి నేల మీద దేవుడికి నైవేద్యం పెట్టిన అన్నం కూర వడ్డిస్తుంది. దేవా చూసి షాక్ అయిపోతాడు. ఏయ్ ఏంటి ఇదంతా నేల మీద వేసుకున్నావ్ ఏంటి అని అడుగుతాడు. నేల మీద అమ్మవారి ప్రసాదం స్వీకరిస్తానని మొక్కుకున్నా ఇలా చేస్తే ముక్కోటి దేవతలు కనికరిస్తారు.. మనం సంతోషంగా ఉంటాం అని మిథున అంటుంది. మిథున అలా తినడానికి రెడీ అవ్వడం చూసి దేవా చాలా ఫీలవుతాడు. మన ఇద్దరం కలిసి ఉండాలి అనుకుంటే ఇలా చేయొచ్చు  కానీ నేను ఇష్టం లేదు అన్నా కూడా ఇలా చేయడం ఏంటి అని దేవా అడుగుతాడు. మిథున మాత్రం  నేల మీద తినడానికి సిద్ధపడుతుంది. 

మిథున తినడానికి రెడీ అవడం చూసి హరివర్ధన్ మిథునని ప్రశ్నిస్తాడు. నువ్వు ఈ హరివర్ధన్ కూతురివి ఇలా తినడం ఏంటి అని తిడతాడు. తాళి బంధం కోసం అని మిథున అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.