Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా నడిరోడ్డు మీద ఎమ్మెల్యే కొడుకుని దారుణంగా కొట్టడం నేను కల్లారా చూశాను అని మిథున సాక్ష్యం చెప్పడానికి ఒప్పకుంటుంది. ఇంట్లో అందరూ మిథున నిర్ణయానికి షాక్ అయిపోతారు. పోలీసులు దేవాని పోలీస్‌ స్టేషన్‌కి తీసుకెళ్తారు. మిథునకు కంప్లైంట్ ఇవ్వమని చెప్తారు.

Continues below advertisement

దేవా పురుషోత్తానికి ఫోన్ చేస్తా అంటే పోలీసులు చేయనివ్వరు. కోర్టుకి వెళ్లే వరకు దేవా ఎవరితో మాట్లాడకుండా చేయాలని అనుకుంటారు. మిథున పోలీస్ స్టేషన్‌లో దేవా మీద కంప్లైంట్ ఇస్తుంది. మిథున మనసులో దేవా నా మీద నీకు కోపం రావొచ్చు కానీ నీ ప్రాణాలు కాపాడుకోవడం కోసమే నేను ఇలా చేస్తున్నా అని అనుకొని కంప్లైంట్ ఇస్తుంది.

ఎస్‌ఐ ఎమ్మెల్యే దేవుడమ్మకి కాల్ చేసి నా ప్లాన్ సక్సెస్ అయింది మేడం.. దేవా భార్యని తీసుకొచ్చి కంప్లైంట్ ఇప్పించాను.. ఇక దేవా బతుకు జైలు పాలే అని అంటాడు. మిథున జడ్జి కూతురు అని దేవా మిథునల మధ్య గొడవలే ఉన్నాయి మిథున సాక్ష్యం చెప్తుంది అని అంటాడు. దానికి దేవుడమ్మ కోర్టు సాక్ష్యాలు ఏం అవసరం లేదు.. ఆ దేవాని ఈ రోజు రాత్రికే ఎన్‌కౌంటర్ చేసేయ్ అని అంటుంది. ఎస్‌ఐ కంగారు పడతాడు. ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది స్టేషన్‌లో ఏం జరిగినా నా మీదకు వస్తుంది.. కోర్టులో వాడికి శిక్ష పడుతుంది ఏం చేయలేను అని అంటాడు. వాడిని చంపుతావా లేదా అని దేవుడమ్మ అని వాడి సంగతి నేను చూసుకుంటా అని అంటుంది.

Continues below advertisement

శారద, సత్యమూర్తితో పాటు ఇంట్లో అందరూ బాధ పడుతుంటారు. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అని ఆనంద్ అంటే దానికి కాంతం ఇందులో అర్థం కాకపోవడానికి ఏం ఉంది.. ఆ  మిథున మన ఇంటికి వచ్చింది దేవాని తన భర్తగా ఒప్పించుకోవడానికి కాదు.. బలవంతంగా తాళి కట్టి దేవా మీద పగ తీర్చుకోవడానికి.. ఇన్ని రోజులు సాధు జంతువులా ఉండి సరిగ్గా టైంకి బుసకొట్టిందని అంటుంది. మిథున ఇలా చేస్తుందని అనుకోలేదని శారద ఏడుస్తుంది. మిథున వల్లే దేవా అరెస్ట్ అయ్యాడా అని ప్రమోదిని అంటే అవును అని కాంతం అంటుంది. మిథున వల్ల దేవాకి శిక్ష పడుతుందని అంటుంది.

శారద ఇద్దరు కొడుకులతో ఎవరైనా దేవాని కాపాడండిరా అని ఏడుస్తుంది. భార్యే అలా చేస్తే ఇంకెవరు ఏం చేయలేరు అని శ్రీరంగం అంటాడు. దేవా తప్పు చేయడు దానికి కారణం ఏదో ఒకటి ఉంటుంది అని అంటుంది. చట్టానికి కారణాలు అవసరం లేదు.. పైగా తప్పు చేశా అని దేవాకి భయమే లేదు..  దేవాని నేను దారిలో పెట్టేలేకపోయా ఇప్పుడు మిథున దేవాని దారిలో పెట్టాలి అనుకుంటుంది. మీరంతా ఎమ్మెల్యే అని అంటున్నారు.. పవర్లో ఉన్నారు అని ఆలోచిస్తున్నారు  కానీ అవతల ఉన్నది ఓ తల్లే కదా నీలా బాధ పడుతుంటుంది కదా అని సత్యమూర్తి అంటారు.

ప్రమోదిని అత్తని ఏడ్వొద్దని దేవా బయట ఉంటే ప్రాణాలు పోతాయి అన్నారు కదా అందుకే మిథున ఇలా చేసింది అంటుంది. మిథున చేసింది దేవాని కాపాడుకోవడానికే అయినా నా కొడుకుకి శిక్ష పడేలా చేసింది మిథునని క్షమించను అని అంటుంది. హరివర్ధన్ ఇంట్లో కూడా  మిథున దేవాని అరెస్ట్ చేయించడం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పటికైనా మిథున మారిందని త్రిపుర అంటుంది. మిథున వాడితో తెగతెంపులు చేసుకొని వచ్చేస్తుందని త్రిపుర అంటే అదే జరిగితే నా కూతురి జీవితం బాగుపడుతుంది. అలా అయితే నా కంటే సంతోషపడే వాళ్లు ఎవరూ ఉండరు అని హరివర్ధన్ సంతోషపడతాడు. త్రిపుర, రాహుల్, హరివర్ధన్ సంతోషపడతారు. మంచి రోజులు రానున్నాయని అనుకుంటారు.

సత్యమూర్తి ఇంట్లో రాత్రి అయినా సరే అందరూ చాలా టెన్షన్ పడుతుంటారు. శారద ఏడుస్తూనే ఉంటుంది. మిథునని ఇంట్లోకి తీసుకొచ్చి దేవాకి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చింది మీరే అని సూర్యకాంతం అంటుంది. ఇంతలో మిథున ఇంటికి వస్తుంది. మిథున ఇంట్లోకి వెళ్తుంటే శారద ఆపుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.