Nindu Manasulu Serial Today Episode సిద్ధూ, ప్రేరణల కేఫ్‌లో డ్రగ్స్ ఉన్నాయని గణ తన టీమ్‌లో వస్తాడు. కేఫ్‌లో వెతికి కొన్ని ప్యాకెట్లు పట్టుకొని ఇవన్నీ డ్రగ్స్ అని అంటాడు. అందరూ షాక్ అయిపోతారు.
సాహితి గణకి దండం పెడుతూ సార్ ప్లీజ్ సార్ మా అన్నయ్య అలాంటి వాడు కాదు. ప్రేరణ మా అన్నయ్య అలా చేయరు.. ప్లీజ్ సార్ అని మీరు అనుకుంటే అయిపోతుంది అని గణని బతిమాలుతుంది. గణ సాహితి అందం చూస్తూ అలా ఉండిపోతాడు. ఇలాంటివి దొరికితే క్షణం కూడా వదలకుండా అరెస్ట్ చేయాలి కానీ మిమల్ని చూస్తుంటే మీరు ఇలాంటి పనులు చేస్తారు అని అనిపించడం లేదు. గతంలో ఇలాంటి కేసులో మనం అరెస్ట్ చేసిన వాడిని తీసుకురా అని సుధాతో చెప్తాడు. సుధాకర్ మిగతా వాళ్లని తీసుకెళ్తాడు.
విజయానంద్ మనసులో అరెస్ట్ చేయకుండా నీతులు చెప్తున్నావ్ ఏంట్రా అని అనుకుంటాడు. ఇక సుధాకర్ వాళ్లు శ్రీనుని తీసుకొస్తే ప్రేరణ, సిద్ధూ, కుమార్ అతన్ని గుర్తు పట్టి షాక్ అయిపోతారు. అతను గణ వాళ్లతో సరుకు దాయడానికి వచ్చా సార్ ఇక్కడ కాఫీ తాగాలి అని వచ్చి ఇక్కడ పెట్టాను తర్వాత తీసుకెళ్లాలి అనుకున్నా అని అంటాడు. గణ వాళ్లతో వీడిని తీసుకురావడం మంచిదైంది లేదంటే సిద్ధూ, ప్రేరణ దోషులయ్యే వారు అని అంటాడు. ప్రేరణ, సిద్ధూ వాళ్లతో ఇకపై చాలా జాగ్రత్తగా ఉండండి అని అంటాడు.
సాహితి గణకి థ్యాంక్స్ చెప్తుంది. సాహితికి గణ భర్త్‌డే విష్ చేసి షేక్ హ్యాండ్ ఇస్తే సిద్ధూ చెల్లి చేయి ఇవ్వకుండా ఆపుతాడు. దాంతో థ్యాంక్యూ అని సాహితి చెప్తుంది. గణ చిందులేసుకుంటూ వెళ్లిపోతాడు. అసలు వీడు ఎందుకు వచ్చాడు ఎందుకు వెళ్లిపోతున్నాడు.. అస్సలు వీడిని అర్థం చేసుకోలేం అని సుధా మనసులో అనుకుంటే అవను నన్ను ఎవరూ అర్థం చేసుకోరు నువ్వు అర్థం చేసుకోవడం లేదు నేను అలిగా అని గణ వెళ్లిపోతాడు.
విజయానంద్, గణ మీటింగ్ ఏర్పాటు చేస్తారు. గణని కొట్టలేక విజయానంద్ తన పీఏ విశ్వాసాన్ని కొడతాడు. ఎందుకు వదిలేశావ్.. అని తిడతాడు. గణ విజయానంద్‌తో ఆ సిద్ధూ మీ కొడుకే కదా ఆ రోజు కేసులో నుంచి విడిపించాలని తెగ ప్రయత్నించి ఇప్పుడు మీ కొడుకునే అరెస్ట్ చేయించాలని అనుకోవడం ఏంటి అని అడుగుతాడు. మీరు మీ కొడుకునే ఇబ్బంది పెట్టాలి అనుకుంటే నన్ను వదులుతారా నన్ను మోసం చేయరా అని గణ అంటాడు. నా లెక్కలు నాకు ఉన్నాయి నువ్వు వాడి కేఫ్ మూసేయాలి అంటాడు. నాకు క్లారిటీ ఇవ్వాలి అని గణ అంటే సిద్ధూ తనని కాదు అని సక్సెస్ కాకూడదు వాడిని ఆదిలోనే తొక్కేయాలి అంటాడు.
గణ విజయానంద్‌తో ఇలాంటి కేసులు కాదు సార్ ఇంకో పెద్ద పెద్ద కేసులు పెట్టాలి నేను ప్లాన్ చేస్తా అని అంటాడు. వీడేంటి సార్ ఇలా మాట్లాడుతున్నాడు అని విశ్వాసం అంటే వాడు గొర్రెలా తలాడిస్తే వాడుకుంటాం.. కుక్కలా తోకాడిస్తే కత్తిరిస్తాం అని అంటాడు.
సిద్ధూ చాలా కోపంగా ఉంటాడు. ప్రేరణ సిద్ధూ దగ్గరకు వెళ్లి మనం రేపు ఇంకాస్త త్వరగా రావాలి అని అంటుంది. సిద్ధూ కోపంగా కుర్చీ తన్నేస్తాడు. మా చెల్లి భర్త్‌డే ఫంక్షన్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు నువ్వు ఎందుకు నాకు చెప్పలేదు.. అని ప్రేరణ మీద అరుస్తాడు. ప్రేరణ చాలా భయపడిపోతుంది. దాంతో సిద్ధూ పెద్దగా నవ్వుతాడు. నువ్వు భయపడ్డావ్ కదా అని అంటాడు. ఏంటి ఇది అని ప్రేరణ అంటుంది. నిజానికి నువ్వు నాకు మంచి సర్‌ఫ్రైజ్ ఇచ్చావ్ అంటాడు. ఒక్క నిమిషం నా ఊపిరాగిపోయింది.. తప్పు చేశానేమో అని చాలా టెన్షన్ పడ్డాను అని అంటుంది. నువ్వేం తప్పు చేయవు నీ వల్ల నా చెల్లి హ్యాపీ, నేను హ్యాపీ అనిఅంటాడు. గణ ఎందుకు తన క్యారెక్టర్‌కి భిన్నంగా ప్రవర్తించాడు అసలు అది వాడే కాదు ఎందుకు అలా చేశాడో తెలుసుకోవాలని అనుకుంటారు.
గణ సాహితి ఫోటో చూస్తూ నీ కోసమే ఈ రోజు తగ్గాను.. మీ డాడీని అన్నని సాధించాలి అంటే నిన్ను నేను బాగా నమ్మించాలి. నిన్ను నా దారిలోకి తీసుకొచ్చి అందర్ని సాధిస్తా అని అనుకుంటాడు. ఇంత మంచి అవకాశం ఎందుకు వదిలేశావ్‌రా అని ఈశ్వరి గణని అడగటంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.