Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున గురించి దేవా ఆలోచిస్తూ బాధ పడతాడు. దేవా ఫ్రెండ్స్ మిథునదే తప్పు అని మాట్లాడుతారు. మిథున గురించి తప్పుగా మాట్లాడితే చంపేస్తా అని దేవా అరుస్తాడు. మిథున వదిన మీద అంత ప్రేమ పెట్టుకొని ఎందుకు ఇలా దూరం అయిపోతారు అని వాళ్లు దేవాని అడుగుతారు. మిథునకు కూడా నీ మీద ఇప్పటికీ చాలా ప్రేమ ఉందని అంటారు. మిథునని బాధ పెట్టడం తప్పు అని అంటారు. ఈ విషయం గురించి మాట్లాడొద్దు అని దేవా అనేస్తాడు.

Continues below advertisement

రిషి రాత్రి ఇంట్లో అందరిని పిలుస్తాడు. అందరికీ యూఎస్‌ నుంచి గిఫ్ట్‌లు తీసుకొచ్చా హడావుడిలో మర్చిపోయా అని అంటాడు. ఇంత హడావుడి గిఫ్ట్‌ల కోసమా నేను ఇంకా మిథున మెడలో బలవంతంగా తాళి కట్టింది ఎవరో తెలిసిపోయిందేమో అని అనుకున్నాఅంటుంది. వాడు ఎవడో తెలిస్తే కాల్చేస్తా అని రిషి అంటాడు. రిషి ఇంట్లో అందరికీ గిఫ్ట్‌లు ఇస్తాడు. అందరికీ ఇచ్చిన తర్వాత మిథునకు ఇస్తాడు. మిథున తనకు గిఫ్ట్‌ వద్దు అనేస్తుంది. గిఫ్ట్ వద్దా నీ కోసం ఒక రోజు మొత్తం  వెతికి ఈ ట్రెడీషనల్ గిఫ్ట్ తెచ్చా నువ్వు వద్దు అంటే ఎంత బాధ పడతానో తెలుసా అంటాడు. వద్దు అని మిథున అంటే పరాయి వాళ్లు ఇస్తే తీసుకోకపోవడం మంచిది కానీ నేను నీ భర్త కాబోతున్నా కదా.. నువ్వు హ్యాపీగా తీసుకోవచ్చు అంటాడు.

హరివర్థన్, లలిత గిఫ్ట్ తీసుకోమని అంటారు. కాబోయే భర్తని బాధ పెట్టొద్దని అనడంతో మిథున చీర తీసుకుంటుంది. రిషి చాలా హ్యాపీగా ఫీలవుతాడు. అందరూ ముహూర్తాల గురించి మాట్లాడుకుంటారు. అలంకృత బావ మీద సెటైర్లు వేస్తుంది. ఇలాంటి మంచివాడు నీకు భర్తగా రావడం నీ అదృష్టం అని అంటారు. దేవా బాధ పడుతుంటే ప్రమోదిని దేవా దగ్గరకు వచ్చి మిథున పెళ్లి కుదిరిందంట నిజమా అని అడుగుతుంది. మిథునకు వాళ్ల మేనత్త కొడుకుతో పెళ్లి ఫిక్స్ అయిందని భాను చెప్పింది అది అబద్ధమా అని చెప్పు అంటుంది. అదే నిజం వదినా అని దేవా అంటాడు. మిథున వేరే వాళ్లతో తాళి కట్టించుకోదు అని అంటుంది. లేదు వదినా అదే నిజం అని దేవా అంటాడు. ప్రమోదిని కన్నీరు పెట్టుకుంటుంది. మిథునని నువ్వు శాశ్వతంగా వదిలేసినట్లేనా.. ఎందుకు దేవా నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావ్.. నీ భార్యకి పెళ్లి అంటే నీకు బాధగా లేదా అని అడుగుతుంది. 

Continues below advertisement

దేవా ప్రమోదినితో ఎందుకు వదినా బాధ మిథునను రిషి చాలా బాగా చూసుకుంటాడు. మిథున జీవితం బాగుంటుంది. అందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అని అంటాడు. మిథునకు రిషి, దేవా గుర్తొచ్చి వాళ్ల మాటలు తలచుకొని నిద్రలో ఉలిక్కి పడి లేస్తుంది. తీరా మిథునకు ఫీవర్ వస్తుంది. మందులు కోసం చూస్తే కనిపించవు. బయటకు వెళ్తుంది.. రిషిని చూసి పడుకోలేదా అని అడిగితే యూఎస్‌ టైమింగ్స్ కదా నిద్ర పట్టడం లేదు అని అంటాడు. ఇక మిథునకు ఫీవర్ అని తెలిసి హాస్పిటల్‌కి వెళ్దామని కంగారు పెడతాడు. మిథున వద్దు అన్నా వినడు.. మిథునని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్తాడు.

దేవా వర్షంలో తడుస్తూ మందు తాగుతూ ఉంటాడు. దేవాని భాను చూసి నా రాజా అనుకుంటూ గొడుగు తీసుకొని వెళ్తుంది. దేవాని అలా చూసి భాను ఏడుస్తుంది. రాజా ఏంట్రా నీ బాధ.. ఆ మిథునని మర్చిపోవడానికి తాగుతున్నావా అని భాను అడిగితే కాదు నన్ను నేను మర్చిపోవడానికి తాగుతున్నా అని దేవా అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.