Ammayi garu Serial Today Episode: విరూపాక్షిని పోలీసులు అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తీసుకెళ్తారు. ఆమె కోసం రూప, రాజు స్టేషన్‌కు వస్తారు. అసలు ఏం జరిగిందని అడగ్గా...తాను ఈ హత్య చేయలేదని చెబుతుంది. కానీ పోలీసులు చూపించిన వీడియోలో మేనేజర్‌ను నువ్వేకాల్చి చంపినట్లు ఉందని రూప వివరిస్తుంది. మనకు  ఉన్న సమస్యలు సరిపోనట్లు ఇప్పుడు ఇంకొకటా అని బాధపడుతుంది. నాన్న, నువ్వు దగ్గరవుతున్న సమయంలో మళ్లీ ఇలా జరిగింది ఏంటని ఏడుస్తుంది. అప్పుడు రాజు ఆమెను ఒక్క నిమిషం ఆగమని....అసలు మేనేజర్‌ దగ్గరకు మీరు ఎందుకు వెళ్లారని అడుగుతాడు. బస్తీ వాళ్లు ఆటోలు కొనుక్కోవడానికి దాచుకున్న సొమ్ములు తిరిగి ఇవ్వకపోతుంటే...తాను వెళ్లి అతన్ని బెదిరించి వారి సొమ్ము వాళ్లకు ఇవ్వాలని చెప్పానని విరూపాక్షి వివరిస్తుంది.
 
నేను అతన్ని బెదిరించినప్పుడు జనం కూడా అక్కడే ఉన్నారని....అంతమంది ఉండగా నేను ఎలా చంపగలుగుతానని అంటుంది. మీరు చంపనప్పుడు మీ గన్‌లో ఉండాల్సిన బుల్లెట్ అక్కడ ఎలా ఉందని ప్రశ్నిస్తాడు. అదే నాకు అర్థం కావడంలేదని ఆమె అంటుంది. మీ గన్‌ ఎవరికైనా ఇచ్చారా అంటే లేదు అని బదులిస్తుంది. మేనేజర్‌ బాడీలో ఉన్న బుల్లెట్‌ మీ గన్‌లో నుంచి వచ్చిందే కాబట్టి...ఆ గన్‌ మీరు కాకుండా ఎవరైనా ఉపయోగించి ఉండాలని రాజు చెబుతాడు. గన్‌ కారులో పెట్టి ఎక్కడికైనా వెళ్లావా గుర్తుచేసుకోమని రూప అడుగుతుంది.
 
మీ దగ్గరకు వస్తున్నప్పుడు మధ్యలో చిన్న గొడవ జరిగితే కారు దిగి వాళ్లకు సర్ధిచెప్పి వచ్చానని...అప్పుడే ఏదో జరిగి  ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తుంది. రాజు కూడా  అక్కడే బుల్లెట్ తీసి ఉంటారని చెబుతాడు.  మిమ్మల్ని ఎవరో ఫాలో అయ్యి ఈ  పని చేశారని అంటాడు. గన్‌ ఎక్కడ ఉందని అడగ్గా కారులోనే ఉందని...ఆ కారు ‌అనాథ శరణాలయం వద్దే ఉందని విరూపాక్షి చెబుతుంది.
 
రూపను తీసుకుని రాజు కారు వద్దకు బయలుదేరి వెళ్తాడు. అటు విజయాంబిక,దీపక్‌ సైతం ఎంతో సంతోషపడతారు. విరూపాక్షిని కరెక్ట్ సమయంలో ఇరికించామని ఆనందపడిపోతుంటారు. ఈ హత్య కేసు నుంచి ఆమె భయటపడటం అసాధ్యమని దీపక్‌ అంటాడు. చిట్‌ఫండ్ కంపెనీ మేనేజర్‌ను మనం చంపి...ఆ నేరం అత్తపై నెట్టేశామని తల్లితో అంటాడు. అప్పుడే అక్కడికి మందారం వస్తుంది. అందరూ బాధలో ఉంటే మీరు మాత్రం ఆస్తులు కొట్టేయడానికి ప్లాన్ చేస్తున్నారా అని మండిపడుతుంది. మీరు జీవితంలో మారరు అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
 
అనాథ ఆశ్రమం వద్దకు చేరుకున్న రాజు,రూప...విరూపాక్షి కారులో ఉన్న గన్‌కోసం వెతుకుతారు. అది కనిపించగానే జాగ్రత్తగా వేలిముద్రలు పడకుండా కర్చీఫ్‌తో బయటకు తీస్తారు. బుల్లెట్‌ కోసం గన్‌తీసిన వారి వేలిముద్రలు ఖచ్చితంగా ఈ గన్‌ మీద పడి ఉంటాయని...దీన్ని పరీక్షలకు పంపితే అసలు నిందితులు ఎవరో తెలిసిపోయి విరూపాక్షి గారిని నిర్ధోషిగా బయటకు తీసుకురావచ్చని చెబుతాడు. అమ్మను ఈకేసులో ఇరికించాల్సిన అవసరం అత్తయ్యకు తప్ప ఎవరికీ లేదని రూప అంటుంది. అటు సూర్య కూడా  తన భార్య హత్య చేసి ఉండదని గట్టిగా నమ్ముతుంటాడు. సరిగ్గా అప్పుడే రాజు, రూప అక్కడికి వస్తారు. అమ్మ తప్పుచేసి ఉండదని రూప తన తండ్రితో అంటుంది. అత్తయ్య,దీపక్ బావపైనే అనుమాం ఉందని చెబుతుంది. దీంతో విజయాంబిక  మండిపడుతుంది.అనవసరంగా మమ్మల్ని అనుమానించొద్దని అంటుంది. అప్పుడు రాజు కలుగజేసుకుని అమ్మగారి గన్‌లో నుంచి బుల్లెట్ దొంగలించి ఈ పనిచేసి ఉంటారని అంటాడు. అలా చేసి ఉంటే అమ్మగారి గన్‌మీద ఆ బుల్లెట్ తీసిన వారి వేలిముద్రలు పడే ఉంటాయని చెబుతాడు. ఈ మాటలు విని దీపక్‌,విజయాంబిక కంగుతింటారు.