Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా మిథున టార్చర్ భరించలేక మిథునని షాపింగ్‌కి తీసుకెళ్తాడు. దేవా మిథున టచ్ అవుతుందని బైక్ ట్యాంక్ ఎక్కిపోతాడు. మిథున చూసి అస్సలు రొమాంటిక్‌ టచ్‌నే లేదు నువ్వేం మొగుడివిరా బాబు అని అంటుంది. ఎక్కువ మాట్లాడితే బండి మీద నుంచి తోసేస్తా అని దేవా అంటాడు. మిథున దేవా భుజం మీద చేయి వేయగానే ఇంకా వేయలేదు ఏంటా అని అనుకున్నా వేసేశావా.. బంటి ఎక్కితే చాలు రొమాన్స్‌నా అని కసురుకుంటాడు. 

మరోవైపు ఓ చెక్ పోస్ట్‌ దగ్గర పోలీసులు చెకింగ్ చేస్తుంటారు. దేవా వాళ్లని కానిస్టేబుల్ ఆపుతారు. ఎస్‌ఐ ఒక్క పిట్ట కూడా తనకు నచ్చింది తగలడం లేదు అనుకుంటూ మిథునని చూసి తగిలిందయ్యా అంటూ వాళ్ల దగ్గరకు వెళ్తాడు. మిథున వైపు పోలీస్ చూడటం మిథున ఇబ్బందిగా ఫీలవుతుంది. హెల్మెట్ లేకపోవడంతో దేవాకి ఫైన్ వేస్తారు. పోలీస్ అధికారి దేవా మిథున చుట్టూ తిరుగుతూ నువ్వు ఇంత మాస్‌గా ఉన్నావ్ బండి ఇంత క్లాస్‌గా ఉంది. బండి నీదేనా అని మిథునని వంకరా చూసి మాట్లాడుతాడు. దేవా గమనిస్తాడు. ఎస్‌ఐకి చిటెకలు వేసి ఇక్కడ చూసి మాట్లాడు అని అంటాడు. నామీదే చిటికెలు వేసి మాట్లాడుతున్నావా ఎవడ్రా నువ్వు అని దేవా కాలర్ పట్టుకుంటాడు. కానిస్టేబుల్ ఆపి పురుషోత్తం రైట్ హ్యాండ్ అని చెప్తాడు. పేపర్స్ అన్నీ ఉన్నాయ్ చూసి పంపండి అని దేవా అంటే చూస్తా వదిలిపెట్టకుండా చూస్తా అని వంకరగా మాట్లాడుతూ పేపర్స్ చింపేస్తాడు. 

దేవా బైక్ మీద నుంచి లేచి సిటీకి కొత్తగా వచ్చినట్లు ఉన్నావ్ నా గురించి తెలీదు ఇప్పటి వరకు ఓపిక పట్టా అని వార్నింగ్ ఇస్తాడు. దానికి ఎస్‌ఐ ఎత్తుకొచ్చిన దాని ముందు పరువు పోతుంది అనా అంటాడు. తన గురించి తప్పుగా మాట్లాడితే బాగోదు అని దేవా అంటాడు. ఎక్కడ నుంచి ఈ పిట్టని తీసుకొచ్చావ్‌రా.. రేటు ఎంతరా అని అంటాడు. రేయ్ తన గురించి ఇంకొక్క మాట అంటే చంపేస్తా అంటాడు. అదే మైనా నీ పెళ్లామా అని అంటే అవునురా తను నా భర్యా వైఫ్ ఆఫ్ దేవా అని మిథునని పట్టుకుంటాడు. బుక్ చేసుకున్న ప్రతీ ఒక్కడూ ఇలాగే అంటాడు అని ఎస్‌ అంటే దేవా ఎస్‌ఐని తోసేస్తాడు. ఎస్‌ఐ దేవాని కొట్టి రౌడీ గాడివి నన్ను కొడతావా అంటూ దేవాని అరెస్ట్ చేయిస్తాడు. 

మిథున కంగారు పడితే దేవా మిథునతో నువ్వు ఇంటికి వెళ్లు నేను వచ్చేస్తా అంటాడు. ఎస్ఐ ఇద్దరినీ చూసి ముందు వాడి సంగతి చెప్పి తర్వాత నీ సంగతి చూస్తా అంటాడు. పోలీస్ స్టేషన్‌లో దేవాని చితక్కొడతారు. వీడిని తీసుకొస్తే అది వస్తుందిరా అని ఎస్‌ఐ అంటాడు. ఇంతలో మిథున స్టేషన్‌కి వస్తుంది. ఎస్‌ఐ మిథునతో నీ కోసమే ఎదురు చూస్తున్నా అంటే గౌరవమైన వృత్తిలో ఉన్నావ్ ఎలా మాట్లాడాలో నేర్చుకో అని అంటుంది. ఎస్‌ఐ మిథునతో తప్పుగా మాట్లాడతాడు. నీలాంటి ఎంతో మంది అమ్మాయిలకు లిఫ్ట్ ఇచ్చా నీకు ఇవ్వాలా లిఫ్ట్ అని అంటాడు. దేవా విని రగిలిపోతాడు. తన గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోను అంటాడు. నా భర్తని కొట్టే రైట్ మీకు ఎవరు ఇచ్చారని ప్రశ్నిస్తుంది. 

ఎస్‌ఐ మిథునతో నిన్నూ లోపల వేయాలా అంటే నీకు నిజంగా అంత ధైర్యం ఉంటే నాకు జైలులో వేసి చూడు ఆ తర్వాత నువ్వు ఇక్కడ ఉంటే అసలు జాబ్‌లోనే ఉంటే అడుగు అని అంటుంది. దేవా మిథునని వెళ్లిపోమని అంటే ఇతని సంగతి తేల్చి నిన్నూ తీసుకెళ్తా అంటుంది. నువ్వు తోపువా అని అడుగుతాడు. దానికి మిథున అవును నేను తోపునే ఇంకొక్క దెబ్బ నా భర్త మీద వేసి చూడు అప్పుడు చెప్తా అని అంటాడు. మీ నాన్న ఏమైనా మూనార్ఖా అని అడిగితే అవును అని మిథున అంటుంది. ఇంతలో పెద్ద అధికారి అక్కడికి వచ్చి మిథునని చూసి మీరు ఏంటి మేడం ఇక్కడ అని అడుగుతాడు. ఎస్‌ఐ లేనిపోనివి చెప్పి మిథున మీద అరిస్తే మేడం ఎవరో తెలుసా జడ్జి హరివర్దన్ గారి కూతురు అని చెప్పగానే ఎస్‌ఐ షాక్ అయిపోతాడు. దేవాని రిలీజ్ చేసి దేవా, మిథున ఇద్దరికీ సారీ సార్.. సారీ మేడం అని చెప్తాడు. మిథున ఎస్‌ఐతో నీ ఉద్యోగానికి గౌరవం ఇచ్చి వదిలేస్తున్నా అని అంటుంది. ఎస్‌ ఐ రగిలిపోతాడు. జడ్జి కూతురు ఒక రౌడీ షీటర్‌కి భార్యనా ఇది ఎలా కుదరింది. కచ్చితంగా దీన్ని వదిలే ప్రసక్తే లేదు అని అనుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: అమ్మాయి గారు సీరియల్: బంటీ బతకడానికి కారణమైన రుక్మిణిని రూపలా చూసుకుంటున్న సూర్యప్రతాప్‌..!