Nuvvunte Naa Jathaga Serial Today March 3rd: "నువ్వుంటే నా జతగా" సీరియల్: అగ్గి పుల్ల లాంటి ఆడపిల్ల నేను.. నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను.. దట్ ఈజ్ మిథున!
Nuvvunte Naa Jathaga Today Episode మిధున, దేవాలకు బస్తీ వాళ్లు పెళ్లి చేశారని భాను ఏడ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Nuvvunte Naa Jathaga Serial Today Episode మిధున, దేవాలకు బస్తీ వాళ్లు మళ్లీ పెళ్లి చేస్తారు. దగ్గరుండి మిధున తాళికి కుంకుమ పెట్టిస్తారు. దండలు మార్పిస్తారు. మిధున నుదిట కుంకుమ పెట్టిస్తారు. అది చూసి భానుమతి ఏడుస్తుంది. మిధున చాలా సంతోషంగా దేవా పక్కన కూర్చొని ఎంజాయ్ చేస్తుంటుంది.
మిధున ఫొటో గ్రాఫర్‌ని కూడా పిలిపించమని బస్తీ వాళ్లతో చెప్పి భర్తతో కలిసి హ్యాపీగా ఫొటోలు తీసుకుంటుంది. ఒకరికి ఒకరు స్వీట్స్ తినిపించుకుంటారు. ఇంటిళ్ల పాది అలా చూస్తుంటారు. ఇక దేవా, మిధున చేతిలో చేయి వేసి పట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్తాడు. భాను ఇంటికి వెళ్లి చాలా ఏడుస్తుంది. తల్లి ఏమైందని అడిగితే దేవా, మిధునలకు బస్తీ వాళ్లు మళ్లీ పెళ్లి చేశారని చెప్పి భాను తల్లిని పట్టుకొని ఏడుస్తుంది.
భాను: అమ్మా వాళ్లు ఇద్దరూ అలా దండలు మార్చుకుంటే చూసి తట్టుకోవడం నా వల్ల కాలేదమ్మా. దేవా నాకు దూరం అవుతాడేమో అని మస్త్ ఏడ్చినా. కూతురు ఏడుస్తుంటే బాధగా లేదా.
భానుతల్లి: నువ్వు ఏడుస్తుంటే కోపం వస్తుందే కడుపు మండిపోతుంది. అయినా ఎందుకు ఏడుస్తున్నావే నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వే మరి ఎందుకు ఏడుస్తున్నావే.
భాను: అమ్మ దేవా అంటే నాకు ప్రాణం అమ్మా. వాడు లేకుండా నేను బతకలేనమ్మా చావు అయినా బతకు అయినా వాడితోనే అనుకుంటున్నా ఇప్పుడు వాడు నాకు దక్కడు అంటే ఎట్లా అమ్మా.
భానుతల్లి: భాను ప్రేమ అంటే ఇద్దరి మనసులో ఉండాలే. ఇలా ఒక్కరు ప్రేమిస్తే ఇలానే ఉంటుంది. వాడిని మర్చిపోవే వాడికి నువ్వు ఇష్టం లేదే. నీకు మంచి సంబంధం చూస్తా నువ్వు పెళ్లి చేసుకోవాలి అంతే.
దేవా: వాళ్లకి ఇళ్ల పట్టాలు రావడానికి నేను కారణం కాదు పురుషోత్తం అన్న అని ఎంత చెప్పినా వినలేదు. ఈ దండ ఒకటి. ఛా కరెక్ట్‌గా తనని ఇంటి నుంచి పంపేయాలి అన్న టైంకి వచ్చేశారు. నా ప్రయత్నం ఆపేశారు. తనని ఇంట్లో నుంచి పంపాలి అనుకున్న ప్రతి సారి ఇలా గే జరుగుతుంది. ఇలా జరగడానికి కారణం ఏంటో తెలీడం లేదు
మిధున: శ్రీరస్తు శుభమస్తు అని పాట పాడుతుంది. ఇక దేవా మెడలో దండ లేకపోవడం చూసి దాన్ని వెతికి తీసుకొని జాగ్రత్తగా దులిపి పదిలంగా దాచుకుంటా అంటుంది. ఏంటి బ్యాంక్ లాకర్‌లో దాచేస్తావా అని అడుగుతాడు. ఎందుకు అంత కోసం అని మిధున అడిగితే చేసిందంతా పురుషోత్తం అన్న అయితే నాకు ఇలా నీతో ఏంటి ఇదంతా అని తిడతాడు. మిధున, దేవా ఏం మాట్లాడుకుంటున్నారా అని సూర్యకాంతం తలుపు చాటుగా వినడానికి ప్రయత్నిస్తుంది. శ్రీరంగం వచ్చి ఏం చేస్తున్నావ్ అంటే మాటలు విని త్రిపురకు చెప్పి డబ్బు సంపాదించుదామని అంటుంది. పురుషోత్తం అన్నకి రావాల్సిన క్రెడిట్ నాకు వచ్చిందని నాకు ఇబ్బందిగా ఉందని దేవా అంటే నువ్వు కూడా కష్టపడ్డావు కదా అని దేవా అంటాడు. పురుషోత్తం అన్న గురించి మాట్లాడకు అని దేవా మిధునకు వార్నింగ్ ఇస్తాడు. అలా అయింటే డాక్యుమెంట్లు చింపేసేదాన్ని అని అంటే చంపేసేవాడిని అని దేవా అంటాడు. దానికి మిధున అప్పుడు మీ చేతులు కాళ్లు కట్టేసి గదిలో ఓ మూలన పడేసేదాన్ని అని అంటే దేవాతో పాటు బయట నుంచి మాటలు విన్న కాంతం, రంగం కూడా నోరెళ్లబెడతారు. ఇద్దరూ గొడవ పడతారు. మిధున బయటకు వెళ్లడానికి డోర్ తీస్తే సూర్యకాంతం, రంగం ఇద్దరూ కింద పడిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: చెల్లిని చావగొట్టిన దీప.. కన్నకూతురి చెంప పగలగొట్టిన సుమిత్ర.. దీప విశ్వరూపం!