Nuvvunte Naa Jathaga Serial Today Episode సత్యమూర్తి దేవా కోసం గుడిలో హోమం చేస్తారు. మిధున, శారద వేరు వేరు ఆటోల్లో గుడికి వస్తుంటారు. మిధునకు తండ్రి కాల్ చేసి ఎక్కడున్నావ్ చెప్పు అని అంటాడు. దాంతో మిధున తను ఎక్కడుందో మామయ్య సత్యమూర్తికి తెలుసు ఆయన కనిపిస్తే అడుగు అంటుంది.
హరివర్దన్: అంటే అతను కూడా వచ్చారా. ఏయ్ నీకు అసలు బుద్ధి ఉందా. వాళ్ల ముఖం చూడాలి అంటే చిరాకు నాకు అలాంటిది వాళ్లు ఉన్న చోటుకి నన్ను రప్పిస్తావా. అసలు నువ్వేం చెప్పాలి అనుకున్నావ్ నాతో.
మిధున: ప్లీజ్ నాన్న మీరు కోప్పడకండి మీతో చాలా ముఖ్యమైన విషయం చెప్తా ప్లీజ్ నాన్న గుడిలో ఓ చోట హోమం జరుగుతుంది మీరు అక్కడికి రండి నేను వస్తా.
హరివర్దన్: సరే త్వరగా రా.
మిధున: హమ్మయ్యా మామయ్య ఉన్న చోటుకే నాన్న వెళ్తారు ఇక మామయ్యగారికి ఏం ప్రమాదం లేదు. నాన్న మీకు అబద్ధం చెప్పడం తప్పు అని తెలుసు కానీ నాకు మరో దారి కనిపించలేదు క్షమించండి.
హరివర్దన్ హోమం ఎక్కడ జురుగుతుందా అని గుడి మొత్తం తిరుగుతారు. ఇక శారద భర్తని తలచుకొని ఏడుస్తుంది. తనకు కీడు శంకిస్తుందని భర్తని కాపాడమని దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. హోమంలో పంతులు సత్యమూర్తికి కొడుకు పేరు అడుగుతారు. ఆయన మనసులో తండ్రి పరువు తీసిన నీచుడి పేరు నాకు పలకడం ఇష్టం లేదు కానీ శారద నీ కోసం తప్పడం లేదు అనుకొని పంతులుకి దేవా అని చెప్తారు.
ఇక మిధున దేవాకి కాల్ చేస్తుంది. దేవా కాల్ లిఫ్ట్ చేసి మిధునని ఎందుకు ఇందాక నుంచి కాల్స్ చేసి చంపుతున్నావ్ అని తిడతాడు. ముందు నేను చెప్పిది వినండి అని మీ శత్రువులు మీ మీద పగతో మీ నాన్న మీద అటాక్ చేస్తున్నారని ఓ రౌడీ వచ్చి చెప్పాడని మీ నాన్న గుడిలో ఉన్నారు వెళ్లి కాపాడండి అని చెప్తుంది. మిధున మాటతో దేవా హడావుడికి గుడికి బయల్దేరుతాడు. శారద గుడికి వచ్చేస్తుంది. ఇక పంతులు ముడుపు సత్యమూర్తికి ఇచ్చి రావిచెట్టుకు కట్టి రమ్మని దాంతో హోమం పూర్తి అవుతుందని చెప్తారు. సత్యమూర్తి ముడుపు తీసుకొని బయల్దేరుతారు. మిధున కూడా గుడికి వస్తుంది. ఓ వైపు శారద, మరోవైపు మిధున సత్యమూర్తి కోసం గుడి మొత్తం వెతుకుతారు. రౌడీలు మాస్టారు వెనక ఫాలో అయి చంపేయాలని వెళ్తారు. దేవా స్పీడ్‌గా వస్తుంటే కారుకి గుద్దేసి పడిపోతాడు. తర్వాత లేచి బండి స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వకపోవడంతో రోడ్డు మీద పరుగులు తీస్తాడు. ఇక రౌడీలు సత్యమూర్తిని ఫాలో అవుతారు.
రౌడీలు సత్యమూర్తిని పొడిచే టైంకి హరివద్దన్ వచ్చి రౌడీ చేయి పట్టుకొని ఆపుతారు. దాంతో సత్యమూర్తి షాక్ అయిపోతారు. శారద, మిధున వచ్చి ఏం కాలేదు కదా అని అడుగుతారు. సత్యమూర్తి రెండు చేతులు జోడించి హరివర్దన్‌కి దండం పెట్టి నా ప్రాణాలు కాపాడిన మిమల్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను సార్ అని అంటారు.
శారద: జడ్జిగారు మీరు నా భర్తని కాపాడి నా పసుపు కుంకుమలు నాకు దక్కేలా చేశారు. మిమల్ని జీవితాంతం రుణపడి ఉంటాను.
హరివర్దన్: మీ కొడుకు నా కూతురి బంగారం లాంటి జీవితాన్ని తాళి కట్టి నాశనం చేశాడు అని వాడి మీద నేను పీకల్లోతు కోపంలో ఉన్నాను. మీరంతా అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కూతుర్ని నా నుంచి దూరం చేశారు అని బదులు తీర్చుకునే అంత ద్వేషంలో ఉన్నాను. జనరల్‌గా నా ప్లేస్‌లో ఇంకెవరైనా ఉంటే మీ ప్రాణం పోవాలి అనుకుంటారు. కానీ నాకు ప్రాణం విలువ తెలుసు కాబట్టి కాపాడాను. నా కొడుకు కారణంగా మీ కుటుంబం మొత్తానికి ఏదో ఒకరోజు ఇలా ప్రాణహాని ఉందని తెలుసుకోండి. మీ కొడుకు కారణంగా ప్రాణహాని ఉన్న వాళ్లలో ఇప్పుడు నా కూతురు కూడా ఉంది ఆ భయమే ఇప్పుడు నన్ను వెంటాడుతుంది. నా కూతురు నా పంచప్రాణాలు తన కోసం నేను ఏం చేయడానికి అయినా వదలను. మీ కొడుకు వల్ల నా కూతురికి ఏమైనా అయితే వాడితో సహా మొత్తం అందరినీ తగలబెట్టేస్తాను.
హరివర్దన్ తలదించుకుంటారు. శారద ఏడుస్తుంది. ఇక మిధున తండ్రి వెంట వెళ్తుంది. దేవా గుడికి వచ్చి తండ్రి కోసం వెతుకుతాడు. మిధున తండ్రితో సారీ చెప్తుంది. మామయ్యని కాపాడుకోవడానికే మిమల్ని రప్పించాను అని చెప్తుంది. నా కూతురు అర్జెంట్ అని చెప్తే ఏం అయిందో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వచ్చి గుడి మొత్తం పిచ్చోడిలా తిరిగానని అంటుంది. నాన్న ప్రేమతో ఎమోషన్స్‌తో ఆడుకోవడం ఏంటి ఇలా నాన్న పులి ఆటలు ఆడుకొని నన్ను పూర్తిగా చంపేయకు అని అంటారు. నా కూతురే సర్వసం అని బతికి నందుకు నా మీద ఇంత బాధ పెడుతున్నావేంటమ్మా అని నీకు ఏదైనా జరగరానిది జరిగితే ఆ క్షణమే నా ప్రాణం పోతుందని అని చెప్పి జడ్జి వెళ్లిపోతారు.
దేవా, జడ్జి ఎదురు పడతారు. ఒకర్ని ఒకరు చూసుకుంటారు. ఇక మెట్ల మీద శారద, సత్యమూర్తి కూర్చొని ఏ దేవత కరుణించిందని అందుకే ఇలా బతికాను అంటారు. దేవా, మిధున అక్కడికి వస్తారు. దేవా ఏమైంది నాన్న అని పట్టుకుంటే దేవాని సత్యమూర్తి తోసేస్తారు. మిమల్ని చంపాలి అనుకున్న వాడి ప్రాణాలు తీసేస్తా అని దేవా అంటే మాస్టారు కొడుకుని ఒక్కటి కొడతారు. నన్ను చంపేయ్‌రా అని బాధపడతారు. నీ నుంచి నాకు ఈరోజు వచ్చిన పరిస్థితి రేపు మీ అమ్మకి మీ అన్నావదినలకు చివరకు ఈ అమ్మాయికి వస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: బాలయ్యని ఫాలో అవ్వడం అంత ఈజీ కాదోయ్ గిరి.. జైలులో తాళి కట్టడానికి గిరి ప్లాన్!