Brahmamudi Serial Today March 17th:  ‘బ్రహ్మముడి’ సీరియల్ : ఇంట్లో వాళ్లకు నిజం చెప్పిన కావ్య – కావ్యను పిచ్చిదాన్ని చేసిన రుద్రాణి

Brahmamudi Today Episode: రాజ్‌ను చూశానని కావ్య ఇంటికి వచ్చి చెప్పినా ఎవ్వరూ నమ్మరు దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Continues below advertisement

Brahmamudi Serial Today Episode: కారులో వెళ్తున్న రాజ్‌ను ఆపడానికి పరుగెత్తుకెళ్లిన కావ్య దగ్గరకు వెళ్లి కళ్లు తిరిగి కింద పడిపోతుంది. వెంటనే రాజ్‌ గమనించి ఏమైందని అడుగుతారు. చుట్టుపక్కల జనాలు వచ్చి కళ్లు తిరిగి కింద పడిపోయినట్టు ఉంది. వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లండి అని చెప్తారు. సరేనని రాజ్‌ కారులో కావ్యను హాస్పిటల్‌కు తీసుకెళ్తాడు.  

Continues below advertisement

రాజ్‌ : డాక్టర్‌ ఏమైందో తెలియదు.. రోడ్డు మీద ఈవిడ ఉన్నట్టుంది కింద పడిపోయారు. కళ్లు తిరిగాయి అనుకుంట..

డాక్టర్‌:  పల్స్‌ బాగా లో అయిపోయింది ఐసీయూకి తీసుకెళ్లండి త్వరగా ఫాస్ట్‌

కావ్యను ఐసీయూకి తీసుకెళ్తారు. యామిని రాజ్ కు ఫోన్‌ చేస్తుంది.

యామిని: ఏంటి బావ నా మీద ఏమైనా కోపం వచ్చిందా..? వదిలేసి వెళ్లిపోయావేంటి..?

రాజ్‌: అదేంటి యామిని అలా అంటావు. నీ మీద నాకు కోపం ఎందుకు వస్తుంది.

యామిని: మరి ఎక్కడికి వెళ్లిపోయావు బావ

రాజ్‌:  ఇందాక రోడ్డు మీద ఒక అమ్మాయి కళ్లు తిరిగి పడిపోయింది. అందుకే హాస్పిటల్‌కు తీసుకొచ్చాను

యామిని: అందుకని నన్ను రోడ్డు మీద నిలబెడతావా..?

రాజ్‌:  అదేంటి అలా మాట్లాడతావు ఒక మనిషి ప్రాణం కన్నా ఏదీ ఎక్కువ కాదు కదా..?

యామిని: వీడు గతం మర్చిపోయినా.. మానవత్వం మాత్రం మర్చిపోలేదు. ( మనసులో అనుకుంటుంది.)  సరే బావ నువ్వు వచ్చే వరకు ఇక్కడే వెయిట్‌ చేస్తుంటాను త్వరగా వచ్చేయ్‌

రాజ్‌: ఎందుకు నువ్వు అక్కడ వెయిట్‌ చేయడం.. క్యాబ్‌లో వెళ్లిపోవచ్చు కదా

యామిని: లేదు నువ్వు వచ్చే వరకు ఇక్కడే వెయిట్‌ చేస్తా

 ఇంతలో డాక్టర్‌ లోపల నుంచి వస్తుంది.

రాజ్‌: ఆ అమ్మాయికి ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్‌

డాక్టర్‌: పెద్దగా సీరియస్‌ ఏం కాదు.. కళ్లు తిరిగి పడిపోయినట్టు ఉంది. సెలైన్‌ ఎక్కిస్తున్నాము ఒక అరగంటలో తీసుకెళ్లొచ్చు

రాజ్‌: ఓకే డాక్టర్‌ తను ఎవరో తెలియదు.. ప్రాబ్లమ్‌ ఏమీ లేదన్నారు కాబట్టి నేను వెళ్లిపోతాను. మా వాళ్లు ఎదురుచూస్తుంటారు. నేను బిల్లు కట్టేసి వెళ్లిపోతాను.

అని చెప్పి రాజ్‌ వెళ్లిపోతుంటే లోపల కావ్యకు స్పృహ వస్తుంది. రాజ్‌ గురించి అడుగుతుంది. ఇప్పుడే వెళ్లిపోయాడు అని చెప్తారు. వెంటనే కావ్య అక్కడి నుంచి బయటకు పరుగెత్తుకు వస్తుంది. రాజ్‌ కారులో వెళ్లిపోతాడు. రాజ్‌ మిస్‌ అయినా బతికే ఉన్నాడని కావ్య హ్యాపీగా ఫీలవుతుంది. మరోవైపు ఇంట్లో రుద్రాణి.. కావ్యకు పిచ్చి పట్టిందని చెప్తుంది.

రుద్రాణి: అమ్మా కావ్య మాటలు పట్టుకుని మీరంతా మౌనంగా ఉంటే  ఎలా ఇప్పటికైన నమ్మండి.. రాజ్‌ లేడు.. రాడు.. చనిపోయాడు

కావ్య: బతికే ఉన్నాడు. ( గట్టిగా అరుస్తుంది) అవును నా భర్త బతికే ఉన్నాడు. నా నమ్మకం బతికించింది. నా సంకల్పం గెలిపించింది. ఆయన ప్రాణాలతోనే ఉన్నారు. అత్తయ్యా మీకింకా కడుపుకోత లేదు. ఒక్క కన్నీటి చుక్క కూడా రాల్చాల్సిన అవసరం లేదు.  నేను నా కళ్లారా చూశాను

ఇందిరాదేవి: కావ్య ఏంటమ్మా నువ్వు చెప్పేది.

కావ్య: అయ్యో అమ్మమ్మ నేను చెప్తూనే ఉన్నానా..? ముందు నుంచి ఆయనకు ఏమీ కాదని నేను అంటూనే ఉన్నాను కదా..? ఆయనకు ఏమీ కాలేదు ఎప్పటిలాగే ఉన్నారు.

రుద్రాణి: అయిపోయింది. ఇప్పటి వరకు నాకు కాస్త అనుమానంగా ఉండేది. ఇప్పుడు పూర్తిగా కన్ఫం అయిపోయింది. కావ్యకు మతి భ్రమించింది. మతిస్థిమితం తప్పింది.

అని అనగానే.. కావ్య రుద్రాణిని తిడుతుంది. నువ్వు ఎప్పుడూ నా మాట నమ్మలేదు అంటుంది. అలాగే అప్పును కూడా సరిగ్గా ఎంక్వైరీ చేయలేదని వారిస్తుంది. ఏదేమైనా ఆయన బతికే ఉన్నారు అది చాలు నాకు అంటూ హ్యాపీగా ఫీలవుతుంది. ఇంతలో రుద్రాణి మరి రాజ్‌ ఎక్కడున్నాడు అని అడగ్గానే..రాజ్‌ ను  త్వరలోనే  తీసుకొచ్చి మీ అందరి ముందు నిలబెట్టకపోతే నా పేరు కావ్యే  కాదు అంటూ వెళ్లిపోతుంది. రుద్రాణి మాత్రం కావ్యకు కచ్చితంగా పిచ్చి ముదిరిందని.. వెంటనే హాస్పిటల్ కు చూపించాలని చెప్తుంది. మరోవైపు రాజ్‌ ఐడెంటిటీని మార్చేందుకు యామిని ట్రై చేస్తుంది. ఇంతటితో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

Continues below advertisement