Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode కార్తీక్ ఇంటికి తండ్రి శ్రీధర్ స్వీట్ బాక్స్ తీసుకొని వస్తాడు. కార్తీక్, కాంచనతలో నువ్వు నీ కొడుకు అవకాశవాదులు మీ అవసరం తీరిపోయిన తర్వాత ఎవరు ఏం చేసినా మీకు అనవసరం అని అంటాడు. నోరు లేస్తే చేతికి పని చెప్తా అని కార్తీక్ అంటాడు.
శ్రీధర్: ఇప్పుడు నువ్వు నీ తల్లి కోటీశ్వరులు కదా ఏమైనా చేస్తారు.
కాంచన: అసలు మాకు ఏంటండీ ఇది రెస్టారెంట్లో జ్యోత్స్న ఇంటి దగ్గర మీరు మమల్ని ఉంచరు. పోండి ఇక్కడి నుంచి.
శ్రీధర్: మీది మీకు వచ్చేసింది కదా పోతేలే.
కార్తీక్: ఏం వచ్చింది.
శ్రీధర్: అన్నీ తెలిశాయిలేరా శుభవార్త తెలిసింది. ఆస్తిలో మీకు రావాల్సిన వాటా మీ నాన్న రాసిచ్చాడు కదా. మీకు ఆస్తి రావడానికి కారణం నేనే.
కార్తీక్ తండ్రికి పిచ్చి పట్టనుందని వడ దెబ్బ తగిలి ఇలా పిచ్చి పిచ్చి వాగుతున్నాడని కుర్చీ వేసి కూర్చొపెట్టి వెటకారం చేస్తాడు. స్వప్న, కావేరిలు గుడ్ న్యూస్ అని మాట్లాడారు అని అనగానే అది జ్యోత్స్న పెళ్లి గురించి అని జ్యోత్స్న పెళ్లి ఫిక్స్ అయిందని అంటాడు. శ్రీధర్ షాక్ అవుతాడు. ఇక ఇదంతా దీప వల్లే అని దీప మెడలో తాళి కట్టి రోడ్డున పడ్డాడని అంటాడు. కార్తీక్ తండ్రిని తిడితే దీపనే ప్రశ్నిస్తాను అని దీప నీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పు నిన్ను పెళ్లి చేసుకోకపోయి ఉంటే వాడికి ఈ గతి పట్టేదా? నీ కూతురు కోసం కష్టాలు పడాల్సిన అవసరం ఏముంది? జోత్స్న భర్తగా ఆ యావత్‌ఆస్తికి వారసుడిగా బతకాల్సిన నా కొడుకు ఈ పెంకిటిళ్లులో బతకాల్సిన అవసరం ఏముంది? ఇదంతా నీ పాద దూళి మహిమ. దీప వల్ల నీ జీవితం సర్వనాశనం అయిపోయిందని అంటాడు. దీప మెడలో మూడు ముళ్లు వేశావ్ మునిగి పోయావ్.. ఇప్పటికైనా దీపని వదిలేస్తే జ్యోత్స్నని ఇచ్చి పెళ్లి చేస్తా అంటాడు.
కార్తీక్ తండ్రిని కొట్టడానికి కుర్చీ ఎత్తుతాడు. భార్య కోసం తండ్రిని కొట్టే అపవాదు నాకు వద్దని అంటాడు. దీప తనకు కోట్ల ఆస్తి అని కార్తీక్ అంటాడు. అన్నీ పోగొట్టుకున్న అనాథలు అని తిట్టుకుంటూ శ్రీధర్ వెళ్లిపోతాడు. కార్తీక్ దీపని తీసుకొని రెస్టారెంట్‌కి వెళ్తాడు. మధ్యలో కార్తీక్‌కి సత్య రాజ్ కాల్ చేస్తారు. దీప కన్నీరు పెట్టుకున్న కార్తీక్ చూస్తాడు. మీ నాన్న గారు చెప్పినట్లు జ్యోత్స్నని మీరు పెళ్లి చేసుకొని ఉంటే బాగుండేదని దీప అంటుంది.
కార్తీక్: నాకు జ్యోత్స్నని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని నీకు ముందు చెప్పా కదా. తనని నేను ఎప్పుడూ మరదలిగానే చూశాను. భార్యగా చూడలేని మనిషి పక్కన భర్తగా ఎలా ఉంటాం.
దీప: నా మెడలో తాళి కడతాను అని మీరు అనుకోలేదు కదా మరి భార్యగా చూడని నా పక్కన మీరు భర్తగా ఎలా ఉన్నారు. అంటే ఇది అబద్ధం ఏనా.
కార్తీక్: ఏం లాజిక్ దీప కానీ నాకు ఆన్సర్ ఉంది. నన్ను కాపాడిన మనిషితో నేను సంతోషంగా ఉన్నాను అంతే. ఇంత అడగకు దీప వదిలేయ్.
రోడ్డు మీద గౌతమ్ మరో అమ్మాయితో ఉండటం జ్యోత్స్న చూస్తుంది. దగ్గరకు వెళ్తుంది. గౌతమ్ ఆ అమ్మాయిని కిస్ చేయడానికి ప్రయత్నించడం దీప చూసి ఇంకా ఎంత మంది జీవితాలు నాశనం చేస్తావురా అనుకుంటుంది. గౌతమ్ కారు మీద రాయి విసరబోతుంది. కార్తీక్ వస్తే జరిగింది చెప్తుంది. వాడిని వదలకూడదు అనుకుంటుంది. గౌతమ్ వాళ్లు పెళ్లి చూపుల కోసం వస్తారు. గౌతమ్ ఇక్కడ అంతా మంచి జరగాలి అని గుడికి వెళ్లానని చెప్తాడు. అందరూ గౌతమ్‌కి ఇంప్రెస్ అయిపోతారు. ఇక సుమిత్ర జ్యోత్స్నని తీసుకొస్తుంది. జ్యోత్స్న అందానికి గౌతమ్‌తో పాటు తన తల్లిదండ్రులు కూడా ఫిదా అయిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.