Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా మిథున ఇద్దరూ బేబీ ఊరు బయల్దేరుతారు. మిథున దేవాని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. సెల్ఫీలు తీస్తుంది. చేయి పట్టుకొని చుట్టుకొని హగ్ చేసుకుంటుంది.  దేవా చిరాకు పడతాడు. మిథున దేవాతో కావాలనే నువ్వు గుంతల్లో పోనిచ్చి నేను నీ మీద పడేలా చేస్తున్నావని అంటుంది. దేవా తిడతాడు. 

దేవాని కావాలనే కితకితలు పెట్టి భుజం మీద చేయి వేసి ఇరిటేట్ చేస్తుంది. దాంతో దేవా జీప్ ఆపి వెనక్కి వెళ్లి  కూర్చొ అని మిథునని వెనక్కి పంపేస్తాడు. వెనక్కి వెళ్లిన మిథున దేవా పని చెప్తా అని బాబు డ్రైవర్ అని మాట్లాడుతుంది. డ్రైవర్ ఏంటి అని దేవా అంటే నేను వెనక్కి కూర్చొన్నా అంటే ఓనర్‌ని నువ్వు డ్రైవర్ అని మాటి మాటికి డ్రైవర్ బాబు అని ఇరిటేట్ చేస్తుంది. దేవాకి పాటలు పెట్టమని అంటుంది. దేవా పాటలు పెడితే ఎంజాయ్ చేస్తుంది. మాటి మాటికి డ్రైవర్ డ్రైవర్ అనడంతో దేవా బండి ఆపి మిథునని ముందుకు పిలుస్తాడు. ఏం మాట్లాడకుండా కామ్‌గా కూర్చొమని చెప్తాడు. 

ఆనంద్ కూలి పని చేసి అలిసిపోయి వచ్చి కూర్చొంటాడు. ప్రమోదిని చూసి టీ పెట్టి తీసుకొస్తానని అంటుంది. తర్వాత ఆనంద్ బాక్స్ చూసి దాని మీద కర్రల దుమ్ము చూసి తన మీద ఒట్టు వేయించుకొని అడుగుతుంది. ఆనంద్ ఏం కాదని తాను లెక్కలు రాసే ఉద్యోగమే చేస్తున్నానని అంటాడు. మీకు సరిపడిన జాబ్ రాకపోతే మీరు మానేస్తారేమో అని భయంగా ఉందని ప్రమోదిని అంటే ఈ సారి మీకు ఏం ఇబ్బంది పెట్టను నేనేం కర్రల పని చేయడం లేదు జాబ్ మానను అని చెప్తాడు. పాపం ఆనంద్‌ని చూస్తే జాలేస్తుంది. మిథున దేవాతో రోజు రోజుకి నువ్వు భర్తలా మారిపోతున్నావ్ అంటుంది. 

మిథున ఓ చోట పూల తోట చూసి దేవాని కారు ఆపించి పరుగున వెళ్లి ఆ పూల తోటలో ఎంజాయ్ చేస్తుంది. దేవా ఎంత పిలిచినా రాదు. దేవా వచ్చి పిలవడంతో ఓ పువ్వు తీసి ఇచ్చి ప్రపోజ్ చేస్తుంది. దేవా పువ్వు విసిరేసి మిథునని తీసుకెళ్లిపోతాడు. మరోవైపు పోలీస్ మిథున గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నువ్వు నాకు సొంతం అయితే తప్ప ఈ విరహ వేదన తగ్గదు డార్లింగ్ అనుకుంటాడు. కానిస్టేబుల్ ఎస్‌ఐ దగ్గరకు వచ్చి దేవా, మిథునలు వచ్చి ఊరు వెళ్తున్నారని అంటాడు. ఎస్‌ఐ ఎగిరి గంతేస్తాడు.. ఊరిలో ఏం చేసినా జడ్జికి ఏం తెలీదు తన మీద అనుమానం రాదు అనుకుంటాడు.  

మిథున ఆకలి అని ఓ హోటల్ దగ్గర ఆపించి తిందామని దేవాని తీసుకెళ్తుంది. మిథున ఓ పెద్ద లిస్ట్ ఆర్డర్ చేస్తుంది. తర్వాత దేవా ఆర్డర్ పెట్టమని అంటే దేవా షాక్ అవుతాడు. ఇదంతా నీకేనా మన ఇద్దరికీ కాదా అని కంగు తింటాడు. ఇక ఆర్డర్‌ తీసుకున్న వ్యక్తి ఇద్దరి గొడవ చూసి లేచిపోయి వచ్చారా అంటే అంత ఛాన్స్ నాకు ఎక్కడ ఇచ్చాడు అన్నయ్యా గుడిలో బలవంతంగా తాళి కట్టేశాడు అని చెప్తుంది. మిథునని అతను చెల్లామ్మా స్టోరీ చెప్పమ్మా అని అడుగుతాడు. దేవా వద్దని చెప్పినా వినకుండా మిథున మొత్తం చెప్తుంది. దేవా స్టోరీ విన్న అతను దేవా కోసం చపాతిలో ఆయిల్ క్యాన్సిల్ చపాతి క్యాన్సిల్ అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: అమ్మాయి గారు సీరియల్: కీర్తి, చైతన్యల్ని బతిమాలిన రాజు, రుక్మిణిలు.. రాజు, రూపల జీవితాల్లో ఏం జరగనుంది?