Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవాతో కలిసి బేబీ బామ్మ దగ్గరకు మిథునని ఇంట్లో వాళ్ల వెళ్లమని చెప్పడంతో మిథున గెంతులేస్తూ బ్యాగ్ సర్దుకుంటుంది. అది చూసి కళ్లుకున్న కాంతం ఏయ్ అసలు ఇదంతా నీ ప్లానే కదా అని అంటుంది. ఇదంతా నేనే చేశానని మిథున అంటే కాంతం షాక్ అయిపోతుంది. ఇదంతా ఎందుకు చేశావ్ అని అడిగితే దేవాని నా కొంగున కట్టుకోవడానికి చేశా అంటుంది.
కాంతం ఊడికిపోతూ రౌడీ లాంటి నా మరిదిని కొంగున కట్టేస్తావా అంటే అవును.. దేవాని తీసుకెళ్లి ప్రేమలో దించి అలా హనీమూన్ ప్లాన్ చేశా అని అంటుంది. అమ్మో అమ్మో అని కాంతం గుండె బాదుకుంటుంది. దేవా మిథున గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇద్దరి పేర్లు రాసుకొని మిథున గుడి దగ్గర జరిగిన దాన్ని తలచుకుంటూ ఉంటాడు. ఇంతలో దేవాకి నేత్ర కాల్ చేస్తుంది. ఇంట్లో సడెన్‌గా పవర్ పోయింది అని చెప్తుంది. దేవా ఎలక్ట్రీషియన్‌కి కాల్ చేస్తా అంటే నేత్ర చీకటిగా ఉంది ఒంటరిగా ఉన్నా భయంగా ఉంది అంటే దేవా వస్తానని చెప్పి నేత్ర ఇంటికి వెళ్తాడు.
దేవా ఫ్యూజ్ చెక్ చేస్తాడు. నేత్రకి ఫోన్ లైట్ ఆన్ చేయమని అంటే నేత్ర దేవాకి దగ్గరగా వెళ్తుంటుంది. డోర్స్ మూసేసి అసలు ఆట మొదలు పెడదాం అనుకొని నేత్ర వేళ్లే సరికి మిథున ఎంట్రీ ఇస్తుంది. నేత్ర షాక్ అయిపోతుంది. మిథున దేవా కరెంట్ కనెక్షన్ చూడటం చూస్తుంది. మా ఆయన ఎందుకు ఇటు వచ్చారు అని అడుగుతుంది. కరెంట్ పోయింది భయం వేసి దేవాకి కాల్ చేశా అని చెప్తుంది. దేవా ఫ్యూజ్ ఫిక్స్ చేస్తాడు. మిథునతో నువ్వేంటి గూడాఛారిలా ఇలా వచ్చావేంటి అని అడుగుతాడు. మీకు నిద్రలో నడిచి వచ్చే అలవాటు ఉందేమో అని భయంతో వచ్చానని అంటుంది. సర్లే పద అంటాడు. మిథున నేత్రతో రేపు ఉదయం మీరు బుక్ తీసుకురండి నేను అన్నీ నెంబర్లు మీకు ఇస్తాను. ఎమర్జన్సీలో చేసుకోవచ్చు అంటుంది.
నేత్ర తన ప్లాన్ మిస్ అయిందని తెగ రగిలిపోతుంది. మిథున అంత అమాయకురాలు కాదని అర్థమైందని నేత్ర అనుకుంటుంది. ఉదయం మిథున రెడీ అయి వస్తుంది. శారద మిథునతో నీ ప్రయత్నం, సంకల్పం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా అంటుంది. మిథున, ప్రమోదిని, శారద మాట్లాడుకోవడం చూసిన కాంతం ఈ ముగ్గురు ముందే ప్లాన్ చేసుకున్నారన్నమాట అనుకుంటుంది. దేవా బ్యాగ్ తీసుకొని వచ్చి ఇప్పుడు నానమ్మ దగ్గరకు వెళ్లడం అంత అవసరమా అని అంటే మిథున ఇద్దరి బ్యాగ్‌లు తీసుకెళ్లిపోతూ తను అలా అంటే వెళ్లడం అవసరమా అని అంటుంది. కాంతం మనసులో మేడం మిథున పెద్ద మహా నటిరా దేవుడా.. అంతా తనేప్లాన్ చేసి ఇప్పుడు ఇలా షో చేస్తుంది అనుకుంటుంది. నువ్వు చేసిన పనికి మేం అంతా మీ నానమ్మ దగ్గర అబద్ధాలు చెప్పాం. చేసింది అంతా చేసి రాను అంటావ్ ఏంట్రా బయల్దేరండి అని శారద అంటుంది. దాంతో దేవా మిథునకు బ్యాగ్ ఇచ్చి పద వెళ్దాం అని జీపులో లగేజ్ పెడతాడు.
దేవా మిథున ఇద్దరూ బయల్దేరుతారు. మిథున వాళ్లని చూసిన నేత్ర ఓ వ్యక్తికి కాల్ చేసి ఇద్దరూ ఏదో టూర్‌కి వెళ్లినట్లు ఉందని చెప్తుంది. ఇక అలంకృత ఇంట్లో అందరికీ అక్క, బావ వాళ్ల బామ్మ వాళ్ల ఊరు వెళ్లిందని చెప్తుంది. త్రిపుర, రాహుల్ అలంకృత మీద కోప్పడితే అక్క నాన్నకి ఇచ్చిన ఛాలెంజ్ గెలుస్తుందని అంటుంది. ఆ మాట మీ నాన్నతో చెప్పు అని త్రిపుర అప్పుడే వచ్చిన హరివర్దన్‌ని చూపిస్తారు. వర్క్ ఉందని అలంకృత వెళ్లిపోతుంది. హరివర్దన్ వచ్చి వాడి మనసులో మిథున లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వృథా అని అంటారు. లలిత మాత్రం భర్తతో సరిగ్గా వారంలో మిథున దేవా తనని ప్రేమిస్తున్నాడని నిరూపిస్తుందని అంటుంది. మిథున దేవా చేయి పట్టుకోవడం సెల్ఫీలు తీసుకుంటూ ఉంటుంది. దేవా ఇరిటేట్ అయిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: కీర్తి, చైతన్యల్ని బతిమాలిన రాజు, రుక్మిణిలు.. రాజు, రూపల జీవితాల్లో ఏం జరగనుంది?