Nuvvunte Naa Jathaga Serial Today Episode త్రిపుర దాస్ దేవాని కొడుతుంది. మిథున గురించి అడుగుతుంది. దాంతో దేవా తను నా భార్య.. నేను తాళి కట్టిన నా భార్య అని అరుస్తాడు. ఆదిత్య దగ్గర ఉన్న మిథునకు మెలకువ వస్తుంది. దేవా అరుస్తూ నా భార్య కనిపించని క్షణం నుంచి ఈ క్షణం వరకు నేను తనకోసం వెతుకుతూ అల్లాడిపోతున్నా అని తనకు ఏమవుతుందో అని భయంతో చస్తున్నా అని చెప్తాడు.
దేవా మాటలకు అపర్ణ దాస్ ఏం మాట్లాడకుండా ఆలోచిస్తూ వెళ్లిపోతుంది. మిథున లేచి ఆ గది మొత్తం చూస్తుంది. మిథున పెద్ద ఫొటో ఉంటుంది. డోర్ కొడుతుంది. ఎవరూ తీయరు. ఎక్కడున్నాను నేను నా పెయింటింగ్ ఎందుకు ఇక్కడు ఉంది అని అనుకుంటుంది. మొత్తం చూస్తూ ఎవరైనా ఉన్నారా అని అరుస్తుంది. ఫోన్ ఎక్కడో పడేశానని అనుకుంటుంది.
శారద ఏడుస్తుంటే ప్రమోదిని దగ్గరకు వచ్చి అత్తయ్య మిథున, దేవాలకు గొడవ జరిగి మిథున బయటకు వెళ్లుంటుంది కోపం తగ్గిన తర్వాత వస్తుందని ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. దానికి శారద మిథున కిడ్నాప్ అయింటుందని ఏదో పెద్ద ప్రమాదంలోనే ఉంటుందని ఏడుస్తుంది. ఇంతలో గయ్యాలి కాంతం వస్తుంది. మిథునని దేవా, మామయ్య అంగీకరించలేదు కదా ఇంకెందుకు ఈ ఏడుపులు నాకు అర్థం కావడం లేదని అంటుంది. శారద కాంతం మాటలకు సీరియస్‌గా చూసి వెళ్లిపోతుంది. బేబీ వచ్చి కోపంగా చూసి మోకాలిమీద నడవమని శిక్షిస్తుంది.
అపర్ణ దాస్ దేవాతో మిథున గురించి మళ్లీ అడుగుతుంది. దానికి దేవా మీరు నన్ను చంపినా పర్లేదు కానీ మిథున ప్రాణాలు కాపాడే అవకాశం ఇవ్వమని అడుగుతాడు. ఆడపిల్లని అడ్డు పెట్టుకొని ఆస్తి కాజేసే వెధవని కాదు అని అంటాడు. తన మెడలో బలవంతంగా తాళి కట్టినందుకు గిల్టీగా ఉంది తనని కాపాడే అవకాశం ఇవ్వమని వేడుకుంటాడు. ఏదో జరిగింది.. ఎవరో కావాలని తనని కిడ్నాప్ చేశారు దయచేసి అర్థం చేసుకోండి.. ఉరి శిక్ష పడే వాళ్లకి కూడా చివరి కోరిక అడుగుతారు. నాది ఇది చివరి కోరిక అనుకోండి ఒక్క అవకాశం ఇవ్వండి 24 గంటల టైం ఇవ్వండి తర్వాత నన్ను చంపేయండి అని అడుగుతాడు.
మిథున తనలో తాను దేవా నా కోసం వెతుకుతూ ఉంటాడు. మామయ్య వాళ్లు నాన్న వాళ్లు నా కోసం వెతుకుతుంటారు. గొడవ పడుతుంటారు. నన్ను దేవానే కిడ్నాప్ చేసుంటారని అనుకుంటారు. పాపం దేవా నా వల్ల చాలా ఇబ్బందులు అవమానాలు పడుతుంటారని అనుకుంటుంది. అపర్ణ దాస్ దేవాని నమ్మి విడిచిపెట్టి నీ భార్యని నువ్వే కాపాడుకో అని పంపిస్తుంది. కానిస్టేబుల్ అపర్ణతో అను అబద్ధం చెప్పుంటే మేడం అలా వదిలేశారు అంటే లేదు అతని కళ్లలో నిజం కనిపించింది ఆ అమ్మాయి కోసం తపించే ప్రేమ కనిపించిందని అంటుంది.
దేవా మిథున కోసం తిరుగుతూ ఉంటాడు. 24 గంటల్లో ఎక్కడున్నా నిన్ను తీసుకురావాలి మిథున నీ ప్రాణాలకు ఏమైనా జరిగితే మనిషిలా నేను చనిపోయినట్లే.. నన్ను నమ్ముకొని వచ్చిన నిన్ను కాపాడుకోవడం నా బాధ్యత నా కారణంగా నీకు ఎలాంటి పరిస్థితి వచ్చింది మిథున నాకు చాలా బాధగా ఉందని కన్నీరు పెట్టుకొని వెతుకుతుంటాడు. మిథున కూడా తను ఎక్కడ ఉందో తెలీక అందర్ని గుర్తు చేసుకొని ఏడుస్తుంటుంది.
హరివర్దన్ రాత్రి మిథునని తలచుకొని బాధ పడుతూ ఉంటాడు. హరివర్దన్ దగ్గర సత్యమూర్తి కూర్చొని పిల్లలు ఎలా ఉండాలో తండ్రి చెప్పాల్సిన అవసరం లేదు.. తండ్రిని చూసి నేర్చుకుంటారని నా కొడుకు నా దగ్గర చూసి ఏం నేర్చుకున్నాడో తెలీదు.. 60 ఏళ్ల జీవితంలో 30 ఏళ్ల టీచర్ అయినా గౌరవం మర్యాద సంపాదించా కానీ ఇప్పుడు మాత్రం దేవా వల్ల ఓ ఆడపిల్ల బాధ పడటం అవమానంగా ఫీలవుతున్నాం అని అంటారు. ఇక లలిత, శారద మాట్లాడుకుంటారు. మాస్టారుగా గెలిచిన నేను తండ్రిగా ఓడిపోయాను నా కొడుకుని మంచిగా పెంచలేకపోయాను అని ఏడుస్తాడు. లలిత శారదతో దేవా చాలా మంచోడని పొగుడుతుంది. మీరు మీ కూతుర్ని చాలా గొప్పగా పెంచారని సత్యమూర్తి హరివర్దన్‌తో చెప్తాడు. మీరు చాలా గ్రేట్ సార్ అని అంటాడు. మమల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉందని అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: షాకింగ్.. విహారి కిడ్నాప్.. నడి రోడ్డు మీద కారు.. అర్థరాత్రి ఏం జరిగింది?