Chinni Serial Today Episode మహి గుడిలో పూజలు చేస్తాడు. చిన్ని ఎక్కడున్నా కనిపించేలా ఆశీర్వదించమని కోరుకుంటాడు. చిన్ని కూడా మహి, చందు, లోహితలు కనిపించేలా ఆశీర్వదించమని కోరుకుంటుంది. ఇక బాలరాజు గాయాలతో  నడవలేని స్థితిలో గుడి దగ్గరకు వస్తాడు. గుడి బయట భిక్షం ఎత్తుకున్న వాళ్ల దగ్గర్లో బలం లేక కూర్చొండిపోతాడు. 

లోహిత తన ఫ్రెండ్స్‌తో పాటు రెస్టారెంట్‌లో ఉంటారు. లోహిత రిచ్ ఫ్రెండ్‌ కార్డు తేవడం మర్చిపోతుంది. అందరూ తల పట్టుకుంటారు. బేరర్ కోప్పడుతుంటాడు. ఇంతలో అక్కడే ఉన్న వరుణ్‌ అంతా చూసి వచ్చి లోహిత బిల్ కడతాడు. లోహిత వరుణ్‌కి థ్యాంక్స్ చెప్తుంది. ఇక రెస్టారెంట్‌ నుంచి బయటకు వెళ్తూ వరుణ్ కారు బయట ఉండటం చూసి తుక్కలేస్తుంది. లోహిత రిచ్‌ ఫ్రెండ్‌ కారు పోవడంతో అంటతా ఆటో కోసం ఎదురు చూస్తుంటారు. వరుణ్ కారు దగ్గరకు  వెళ్లడం చూసి షాక్ అయిపోతుంది. వరుణ్‌ని కచ్చితంగా లైన్‌లో పెట్టాలని దగ్గరకు వెళ్లి డబ్బు తిరిగి పే చేస్తా నెంబరు ఇవ్వండి అని నెంబరు తీసుకుంటుంది. వరుణ్‌కి షేక్ హ్యాండ్ ఇచ్చి తర్వాత పడిపోయా అని కార్డు తీసుకురాని ఆ ఫ్రెండ్‌కి థ్యాంక్స్ చెప్తుంది.

స్వరూప మధుమిత జాతకం పంతులుకి చూపిస్తుంది. మీ కూతురుది చాలా గొప్ప జాతకం అమ్మ.. చాలా గొప్పింటి కోడలు అవుతుంది అమ్మా మీ కాబోయే అల్లుడు మీ అమ్మాయిని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడని చెప్తాడు. స్వరూప చాలా సంతోషపడుతుంది. తర్వాత మధుమితని కూడా ఆశీర్వదిస్తారు. వరుణ్ బావ ఏం చేస్తున్నాడో అని మహికి కాల్ చేస్తాడు. మహి వరుణ్‌తో నన్ను గుడులకు అని పంపి నువ్వు కాఫీ షాప్‌లో ఎంజాయ్ చేస్తున్నావా అని అంటాడు. వరుణ్‌ మహితో చిన్ని కోసమే కోరుకుంటున్నావ్ కదా బావ చిన్ని దొరుకుతుంది అని అంటాడు.

మధుమిత మహిని చూసి ఏయ్ పిల్లి గడ్డం అని పిలుస్తుంది. మహి చూసి నువ్వేంటి ఇక్కడ అంటే పోలియో డ్రాప్స్ వేస్తారంటే వచ్చానని నువ్వు వేయించుకుంటావా అని అంటుంది. నువ్వు ఎందుకు వచ్చావని అంటే నీకు మంచి మొగుడు రావాలని కోరుకోవడానికి వచ్చానని సెటైర్లు  వేస్తాడు. ఇక మహి 3 అడుగుల దూరం గురించి సెటైర్లు వేస్తుంది. కాలేజ్ మొత్తం రేపు నీకు పెళ్లి అయినా ఇలాగే 3 అడుగులు దూరం పాటిస్తావా అని సెటైర్లు వేస్తుంది. చంటి రావడంతో మ్యాడీరా మడ్డి ఫెలో అంటుంది. నవ్వుకుంటూ వెళ్లిపోతుంది.   

ఇంటికి వెళ్లడానికి మధుమితని చంటి పిలుస్తాడు. ఇక తల్లి, తమ్ముడితో కలిసి వెళ్తుంటుంది. ఆరు బయట మధు అడుక్కున్నవాళ్లకి ప్రసాదం పంచుతూ ఉంటుంది. బయట బాలరాజు దాహం దాహం అంటూ ఉంటాడు. అది విన్ని మధుమిత బొచ్చెలో నీరు పోస్తుంది. పులిహోర పెడుతుంది. పక్కనున్న అడుకున్న వాడు బాలరాజుకి నీరు ఇచ్చి పులిహోర తినమని అంటాడు. అత్యంత దయనీయస్థితిలో బాలరాజుని చూస్తే కన్నీరు రాక మానవు. మధుమిత వెళ్లడం చూసి ఆకలి తీర్చావా తల్లీ అని బాలరాజు కన్న కూతురికే రెండు చేతులు జోడించి దండం పెడతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: షాకింగ్.. విహారి కిడ్నాప్.. నడి రోడ్డు మీద కారు.. అర్థరాత్రి ఏం జరిగింది?