Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా మిథున కోసం ఫొటో పట్టుకొని వెతుకుతూ ఉంటాడు. గతంలో మిథునని ఏడిపించిన రౌడీలు కనిపించడంతో వాళ్ల మీద అనుమానం వచ్చి వాళ్లని వెంటపడి వెంట పడి పట్టుకొని చితక్కొడతాడు. మిథున గురించి అడిగితే వాళ్లు తమకు తెలీదని ఎస్‌ఐ కూడా చావగొట్టాడని వాళ్లు చెప్తారు.
దేవా ఎస్‌ఐ ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? మిథున కోసం మిమల్ని కొట్టడం ఏంటి అని అడిగితే మీరు ఆ రోజు కొట్టి వెళ్లిన తర్వాత నా డార్లింగ్‌ని ఏడిపిస్తారా అని చితకొట్టాడని చెప్తారు. దాంతో దేవా తనలో తాను నేను మిథున ఇక్కడికి వస్తున్నాం అని వాడికి తెలుసన్న మాట మిథునని వాడే కిడ్నాప్ చేసుకుంటాడని అనుకొని ఆ ఎస్ఐని వెతుక్కొని వెళ్తాడు.
సత్యమూర్తి ఇంట్లో హరివర్దన్‌తో మీకు మిథున ఎంత ఇష్టమో మాకు అంతే మమకారం.. మూడు నెలలుగా మా ఇంట్లో మిథున ఉంది ఏనాడైనా ఇబ్బంది పెట్టామా? ఏ చిన్ని కష్టమైనా పెట్టామా?అని అంటాడు. మీ అమ్మాయి మెడలో వాడు బలవంతంగా తాళి కట్టడం క్షమించరాని నేరం నేను దాన్ని సమర్దించలేను కానీ ఈ తప్పు తప్ప ఇంకేం తప్పు వాడు చేయలేదు. మీరు మీ అమ్మాయి కోసం ఎంత బాధ పడుతున్నారో వాడు అంతే.. మీ అమ్మాయిని మీ ఇంటికి పంపాలి అంటూనే తనకి కోటలా కాపలా కాస్తున్నాడు. ఆడపిల్లని అడ్డు పెట్టుకుని డబ్బు సంపాదించే అంత వెదవ కాదు సార్ ముఖ్యంగా అమ్మాయిని చంపే అంత దుర్మార్గుడు కాదు సార్.. వాడు మీకు మాటిచ్చినట్లే మిథునని తీసుకొని వస్తాడు అని సత్యమూర్తి చెప్తాడు.
ఇక బామ్మ హరివర్దన్‌తో ఒక సమస్య వచ్చినప్పుడు శత్రువులు కూడా ఒక్కటవుతారు. మిథున కోసం మనం ఒక్కటి అవ్వాలి కనీసం మాకు తిట్టడానికైనా, మిథునని వెతకడానికి అయినా భోజనం చేయండి అని చెప్తుంది. లలిత, బామ్మ అందరూ చెప్పడంతో హరివర్దన్ భోజనానికి ఒప్పుకుంటాడు. అందరూ కలిసి భోజనం చేస్తారు. బామ్మ మనసులో మిథున వల్ల ఒక్కటి అవ్వాల్సిన ఫ్యామిలీ మిథున కోసం ఒక్కటైందని అనుకుంటుంది.
ఎస్ఐని వెతుక్కుంటూ దేవా వెళ్తుంటాడు. ఎస్‌ఐ దాసుని లేడీ గెటప్ వేయించి మిథునలా ఫీలై గులాబి పువ్వు పట్టుకొని తన ఫీలింగ్స్ చెప్పి ప్రపోజ్ చేస్తుంటాడు. వెనక నుంచి చూస్తే తను సేమ్ మిథునలానే దాసు ఉంటాడు. దేవా వచ్చి తను మిథునే అనుకొని మిథున అంటూ ఎస్‌ఐని వాయించేస్తాడు. మేం మిథున కోసం కంగారు పడుతుంటే నువ్వు కిడ్నాప్ చేస్తావా అని దేవా అంటాడు. ఎస్‌ఐ ఆపమని తను మిథున కాదు దాసుని మిథునలా రెడీ చేసుకొని నా విరహం చెప్తున్నా అని నువ్వేంట్రా ఇలా కొడుతున్నావ్ అని అంటాడు. ఇందాక నుంచి నువ్వు కొడుతుంటే నాకు దెబ్బల కంటే ఓ డౌట్ బలంగా కొట్టేస్తుంది. మిథున నీ దగ్గర లేదా మిథున కిడ్నాప్ అయిందా ఎవరు మిథునని కిడ్నాప్ చేశారు. నీ కంటే ఎక్కువ నాకు టెన్షన్‌గా ఉందని అంటాడు. మరి నువ్వు కిడ్నాప్ చేయకపోతే మిథున ఎక్కడ అనుకుంటారు. మిథునని ఎవరు కిడ్నాప్ చేసుంటారు? మిథున నువ్వు ఎక్కడున్నావ్ అనుకుంటాడు.
త్రిపుర దోమలు కుడుతున్నాయని నిద్ర లేచేస్తుంది. కాంతానికి నిద్ర లేపుతుంది. దోమలు కుడుతున్నాయి అని అంటుంది. దానికి కాంతం బెడ్‌సీట్, దోమల కాయిల్‌కి 10 వేలు అడుగుతుంది. త్రిపుర తిడుతూనే డబ్బులు ఇచ్చి వాటిని తీసుకుంటుంది. ఇక మిథున కోసం దేవా వెతుకుతూ ఉంటాడు. మిథునని కిడ్నాప్ చేసిన వ్యక్తి మిథునని ఆరాధించే ఆదిత్య అనిపిస్తోంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: 100 కోట్ల స్కామ్‌లో లక్ష్మీ.. సస్పెండ్ చేసిన విహారి..!