Meghasandesam Serial Today Episode: డాన్స్‌ అకాడమీ నుంచి వచ్చిన భూమి పెళ్లికూతురుగా ముస్తాబయ్యి పెళ్లి పీటల మీద కూర్చుంటుంది. అందరూ హ్యాపీగా చూస్తుంటారు. శారద మాత్రం బాధపడుతుంది. పంతులు తాళి కట్టమని చెప్పగానే గగన్‌ తాళి కట్టబోతాడు. నక్షత్ర బాధపడుతుంది. తాళి కడుతున్న గగన్‌ ఆగిపోతాడు. పెళ్లి అయితే మా ఇంట్లో ఉండలేవా అని భూమి అడిగిన మాటలు గుర్తు చేసుకుంటాడు. తాళి కట్టకుండా అందరినీ చూస్తూ..

గగన్‌: ఏం పెద్ద మనిషి భూమి మా ఇంటికి కోడలిగా రావడం ఏంటని ఆశ్చర్యపోతున్నావు కదూ..? ఇప్పుడు నేను తాళి కడితే తను మా ఇంటి కోడలు అవుతుంది. కానీ నేను తాళి కట్టను

అంటూ తాళి విసిరిపడేస్తాడు గగన్‌. అందరూ షాకింగ్‌ గా చూస్తుంటారు. నక్షత్ర హ్యాపీగా ఫీలవుతుంది.

గగన్‌: ఏంటమ్మా ఆణిముత్యం ఆఖరి నిమిషంలో భూమి రియలైజ్ అయి పెళ్లి వద్దనుకుని వెల్లిపోయింది అన్నావు కదా మరి ఎందుకు తిరిగి వచ్చింది. సిగ్గు లేకా..?

శారద: రేయ్‌ గగన్‌ పిచ్చి పట్టిన వాడిలా ఏంట్రా ఆ మాటలు..?

గగన్‌: అమ్మా నువ్వేం మాట్లాడకు.. నువ్వే కాదు ఇక్కడ ఎవ్వరూ మాట్లాడొద్దు.. నేన అడిగిన వాళ్లు మాత్రమే సమాధానం చెప్పాలి. చెప్పమ్మా పెద్ద మనిషి భూమి ఎందుకు మళ్లీ తిరిగి వచ్చింది. సిగ్గు లేకా..? లేకపోతే పెళ్లికి నేను తప్పా వేరే గత్యంతరం లేకా..?

శరత్‌: రేయ్‌ గగన్‌.. ఏం మాట్లాడుతున్నావు.

గగన్‌: మిస్టర్‌ శరత్ చంద్ర ఇప్పటి వరకు నువ్వు మాతో డామినేటింగ్‌ గా మాట్లాడావు. మా జీవితాలతో ఆడుకున్నావు ఇప్పుడు నా టైం. ముహూర్తం టైంకి నీ కూతురు పందిరి వదిలేసి పోయింది. అప్పుడు నా పరువు పోతుంది. అదే తాళి కట్టబోతూ చీపో తాళి కట్టను అంటే అప్పుడు నీ పరువు పోతుంది. ఇది టిట్‌ ఫర్‌ టాట్‌ అంటే. నీకు తెలియాలి శరత్ చంద్ర ఒక్క మగాడు వదిలేసిన ఆడదాని బాధ ఎలా ఉంటుందో నీకు తెలియాలి. ఇప్పుడు నేను నీ కూతురిని వదిలేస్తున్నాను. ఏడ్చే నీ కూతురులో ఆ బాధ ఎలా ఉంటుందో నువ్వు ప్రతిరోజు చూడొచ్చు.  నాకు ఈ భూమి కంటే గొప్ప అమ్మాయి వస్తుంది. ఈ పెళ్లిని నేను క్యాన్సిల్ చేస్తున్నాను.

శరత్‌: రేయ్‌ గగన్‌ మమ్మల్ని అవమానించి వెళ్లిపోతున్నానని విర్రవీగుతున్నావు కదా..? చూస్తూ ఉండు వారం తిరిగే లోపు నా కూతురుకు ఘనంగా పెళ్లి చేస్తాను.

గగన్‌: నువ్వు ఎంత ఘనంగా పెళ్లి చేసినా  నువ్వు తెచ్చిన సంబంధాన్ని నాతో కంపేర్‌ చేసి లోకం మాట్లాడుతూనే ఉంటుంది శరత్‌ చంద్ర. భూమి మెడలో తాళి కట్టేవాడు నా అంత బాగున్నాడా లేడా..? నా అంత మంచోడా కాదా అని నాతో కంపేర్‌ చేస్తూనే ఉంటారు.  ఇలా కంపేర్‌ చేయడం నాకు కిక్కు ఇస్తే.. నీకు తలవంపుల లెక్క ఇస్తుంది.

శరత్‌: ఏయ్‌ తల వంచుకోవడం.. తలవంపులు తెచ్చుకోవడం నీకు అలవాటేమో కానీ నాకు అలవాటు లేదు. నేను తెచ్చిన సంబంధంతో కంపేర్‌ చేసి మాట్లాడాల్సి వస్తే నువ్వు నా వెంటుకతో సమానం. నీతో పెళ్లి తప్పిపోవడం మంచికేనని జనాలు మాట్లాడుకుంటారు.

గగన్‌: మాటదేముంది కానీ వాస్తవం నాలా కఠినంగా ఉంటుంది. నువ్వెంత ప్రయత్నించినా నా లాంటి క్యారెక్టర్‌ ఉన్న వాడిని తీసుకురాలేవు. ఇది నా చాలెంజ్.

శరత్‌: ఓకేరా..? నీ చాలెంజ్‌ ని నేను యాక్సెప్ట్‌ చేస్తున్నాను. కానీ నువ్వు ఓడిపోతే ఈ ఊరు వదిలి వెళ్లిపోవాలి

అంటూ శరత్‌ చంద్ర అడగ్గానే ఓకే వెళ్లిపోతాను అంటూ గగన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. భూమి, శారద, కేపీ ఏడుస్తుంటారు. పూరి వచ్చి శారదను ఓదారుస్తుంది. తర్వాత ఇంటికి వెళ్లిన గగన్‌ను శారద తిడుతుంది.

శారద: ఈ పెళ్లి ఎందుకు ఆపేసుకున్నావో చెప్పరా..?

గగన్: ఈ పెళ్లిని నేను ఆపుకోలేదు.. భూమియే పెళ్లి ఆపేసింది. వాళ్ల నాన్న కాళ్ల దగ్గర నన్ను కుక్కలా కట్టేయాలనుకుంటుందా..? నలుగురి ముందు నేను తన పరువు తీయలేక నేను అలా మాట్లాడాను.

అంటూ గగన్‌ బాధపడుతుంటాడు. మరోవైపు ఇంట్లో కూర్చున్న భూమి ఏడుస్తుంది. కేపీ సంతకం చేసిన డివోర్స పేపర్స్‌ కనిపించడం లేదని మీరా వస్తుంది. అవే తనే కాల్చేసినట్టు గుర్తు చేసుకుంటుంది భూమి. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!