Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా, మిధున కలిసి వెళ్తుంటే దేవా మిధునని కొంచెం దూరం జరగమని చెప్తాడు. దాంతో మిధున నూరేళ్లు బతకాల్సిన వాళ్లం దూరం జరగడం ఏంటి అని అడుగుతుంది. దాంతో దేవా దీని కొటేషన్లు, టార్చరు భరించలేకపోతున్నా ఏదైనా వెయికిల్ పంపమని కోరుతాడు. ఇంతలో భాను ఆటో తీసుకొని వస్తుంది. నీ కోసమే ఆటో తీసుకొచ్చా జల్దీ రా రాజా అంటుంది. 

దేవా: ఇది పెట్టే టార్చర్ కంటే అదే నయం.  భాను:  దేవా చేతిని తన చేతిలో వేడుకొని ఆటోలో కూర్చొపెట్టి మిధునతో.. చూసినావా ఇది మా మధ్య ప్రేమ. మా మధ్యలోకి ఎవరూ రాలేరు. ఇప్పుడు ఆటోలో మా ప్రయాణం తర్వాత జీవిత ప్రయాణం. దేవా: ఏయ్ తింగరి త్వరగా వెళ్లాలి రా.భాను: వస్తున్నా రాజా. చల్ దొబేయ్ ఈ నుంచే కాదు నా రాజా జీవితంలో నుంచి.మిధున: నేను ఎందుకు వెళ్తాను. చూస్తూ ఉండూ ఈ మాంగల్యానికి బలమే ఉంటే ఈ ఆటో మధ్యలోనే ఆగిపోతుంది.భాను: ఏడ్చావ్. మిధున: దేవాతో నా బంధం బలమైనది అంటే ఈ ఆటో ఆగిపోవాలి. 

భాను, మిధున ఇద్దరూ వెళ్తూ ఉంటే మధ్యలో ఆటో ఆగిపోతుంది. ఇద్దరూ మిధునని చూసి షాక్ అయిపోతారు. మిధున వచ్చి ఇదీ నా తాళి పవర్ అనగానే దేవా రెండు చేతులు జోడించి దండం పెట్టి వెళ్లిపోతాడు. వెనకాలే మిధున వెళ్తుంది. ఏంటీ ఏంటీ కొత్త వరసా అని సాంగ్ వేసుకొని దేవా వెనక మిధున వెళ్తుంది. ఇక భాను మరో వ్యక్తి సాయంతో ఆటో తోసుకెళ్తూ ఉండగా గోడ మీద పోస్టర్లు అతికించి ఉంటాయి. దగ్గర కెళ్లి చూస్తే పురుషోత్తం అన్నకి స్వాగతం అని దానిలో మిధున, దేవాల ఫోటోలు ఉంటాయి. భాను ఆవేశంతో అన్నీ పోస్టర్లు చింపేస్తుంది. నీ పక్కన వేరే వాళ్లని చూస్తే తట్టుకోలేను రాజా అని ఏడుస్తుంది. దేవా అన్నలు పేపర్ చూస్తుంటే తోటి కోడళ్లు కూరగాయలు కట్ చేస్తుంటారు. మిధున అక్కడికి రాగానే సూర్యకాంతం మిధునతో గుడి దగ్గర ప్రసాదం అడుక్కోవడానికి వెళ్లావా అంటుంది. మిధున అవునని రేపటి నుంచి నా బదులు నిన్ను వచ్చి అడుక్కోమని అన్నారని అంటుంది. దాంతో సూర్యకాంతం నోరు మూసుకుంటుంది. 

ఆనంద్, శ్రీరంగం తల్లికి కాఫీ తీసుకురమ్మని చెప్తారు. దేవా మందులు తీసుకొని వచ్చి మీకు బుద్ధుందా అమ్మకి బాలేకపోతే మందులు తీసుకురావడం లేదని తిడతాడు. ఇంటి ఖర్చులకు శ్రీరంగం 200 ఇస్తున్నాడు కదా అని సూర్యకాంతం గొడవకు దిగుతుంది. ఇంతలో ప్రమోదిని ఎంట్రీ అయి ఉద్యోగం వచ్చి ఉంటే తను కూడా ఇచ్చేవాడని అంటుంది. ఇక దేవా ఏం ఇస్తున్నాడని ఆనంద్ అంటాడు. దానికి మిధున మా ఆయన్ని ఇంకొక్క మాట అంటే ఊరుకునేది లేదు అని అరుస్తుంది. అందరూ నోరెళ్ల బెట్టి చూస్తారు. దేవా కూడా నోరెళ్లబెడతాడు. మా ఆయన కూరగాయలు అవీ ఇవీ తెస్తారు. మొన్న పది లక్షలు ఇవ్వబోయారు అని మిధున  అంటే అందరూ నోరు మూసేస్తారు. ఇక ఇద్దరు వదినలు దేవాతో మా ఆయన అని సెటైర్లు వేస్తారు. ఆ సీన్ భలే కామెడీగా ఉంటుంది.

దేవా: మిధున ముందు కూర్చొని.. మా ఆయన.. మా ఆయన.. మేం ఇంత సీరియస్‌గా మా ఇంటి ఖర్చుల గురించి కొట్టుకుంటుంటే నువ్వు వచ్చి మా ఆయన అని లెక్కలు మాట్లాడావు చూడు నువ్వు సూపర్ బంగారం. మిధున: నా భర్తని ఎవరైనా ఏమైనా అంటే నేను ఊరుకుంటానా. దేవా: సందర్భం ఏదైనా గొడవ ఏదైనా నువ్వు మాత్రం నీ తాళి సిద్ధాంతం మర్చిపోవే. నువ్వు మొగుడు మొగుడు అని ఎంత నా వెంట తిరిగినా నా మనసులోనూ నా జీవితంలోనూ నీకు భార్య స్థానం ఇవ్వను.భాను: నాటకాలు ఆపరా. దేవా: అమ్మా..భాను: ఏంట్రా ఏమన్నావ్ నీ జీవితంలోనూ నీ మనసులో తనకు భార్య స్థానం లేదా మరి ఇదేంట్రా.మిధున: ఏంటండీ ఇది ఏముంది ఇందులో..దేవా: బిత్తర పోయి.. అసలీ పోస్టర్ ఏంటి? ఎవరు వేయించారు.భాను: నేనే నాకు తిక్కలేచి ఇలా వేయించాను. నాకు తెలుసు ఇదంతా నువ్వే వేయించావని.దేవా: ఈ పోస్టర్ ఫోటో నేను ఇప్పుడే చూస్తున్నా అసలు ఈ ఫొటో ఎలా వచ్చింది. సూర్యకాంతం: మాకు తెలీకుండా నువ్వు నీ భార్య ఎక్కడికి వెళ్లి ఫొటో తీయించుకున్నారు.దేవా: వదిన నేను అసలే పిచ్చ కోపంలో ఉన్నా కామెడీ చేయొద్దు.

దేవా ఎంత చెప్పినా అందరూ నువ్వు ఆ అమ్మాయి మీద నీకు ఇంత ఇష్టం ఉందా. ఇంతలో మిధున కాఫీ ఇవ్వాలా అండీ అంటే దేవా చంపేయ్‌వే నన్ను చంపేయ్‌వే అని అంటాడు. మిధున చిన్నగా నవ్వుకుంటుంది. భాను దేవా కాలర్ పట్టుకొని ఆ పోరి అంటే నీకు ఇష్టం అందుకే ఇలా పోస్టర్‌లో వేయించావ్ అంటుంది. దేవా సీరియస్‌గా ఈ ఫొటో వేయించిన వాడి అంతు తేల్చుతా అని బయటకు వెళ్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: ఫస్ట్‌ నైట్ ఆటల్లో సత్యకి అవమానం.. చివరి నిమిషంలో మెలిక.. సంజయ్ ఆశలు అడియాసలేనా!