Nuvvunte Naa Jathaga Serial Today Episode మిధున బట్టలు ఉతుకుతుంటుంది. దేవా తనని పుట్టింట్లో వదిలేయడం గుర్తు చేసుకొని దేవా మీద కోపం బట్టల మీద చూపిస్తుంది. ఇంతలో దేవా డబ్బుల బ్యాగ్‌తో అక్కడికి వస్తాడు. మిధునని ఆపి బట్టలు ఉతుకుతున్నట్లు లేదు కోపంతో నా గొంతు పిసుకుతున్నట్లుందని అంటాడు. 

మిధున: తప్పదండి కొంత మంది మనుషులే దారిలోకి రావడం లేదు ఇలాంటి బట్టలు దారిలోకి రావాలి అంటే ఇలాంటి ట్రీట్మెంట్ తప్పదు.దేవా: ఏడ్చావులే కానీ ఇంతకీ ఎవరి బట్టలు అవిమిధున: హా.. మా ఆయన బట్టలు. దేవా: ఏంటి నా బట్టలా.మిధున: థ్యాంక్స్ ఇప్పటికైనా మా ఆయన అని ఒప్పుకున్నందుకు.దేవా: అంత లేదు కానీ ఇదిగో ఇది తీసుకో. మిధున: ఏంటి ఇదిదేవా: కోటి రూపాయలు. మీ అయ్య నీకు కట్టిన రేటు.మిధున: ఏయ్ సెన్స్ లేదా అయ్యా ఏంటి అయ్యా మా నాన్న వయసులోనూ హోదాలోనూ అన్నింటిలోనూ పెద్దవాళ్లు అయ్యా అని మాట్లాడుతావేంటి.దేవా: అయ్యా కోపమే ఏది ఏమైనా నీ అయ్య అంటే నీకు ప్రేమే ఆయన్ను ఒక్క మాట అంటే కోపం తన్నుకొచ్చేసింది. మీ నాన్నకి మర్యాద ఇచ్చి మాట్లాడాలి అన్నావ్ కదా. సరే అలాగే మాట్లాడుతా మీ నాన్నగారు అయినటువంటి శ్రీ శ్రీ శ్రీ హరివర్థన్‌ గారు తన కూతురు అయిన నీకు కోటి రూపాయలు వెల కట్టి పంపారు. నిన్ను బతిమాలినా భయపెట్టినా వెళ్లడం లేదని నిన్ను ఇక్కడి నుంచి తరిమేయమని నాకు కోటి రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చారు. లంచం ఇచ్చారు.మిధున: మా నాన్న ఎంత నిజాయితీగా ఉంటారో నాకు తెలుసు. నేను ఇలా వచ్చినందుకు ఎంత బాధ పడుతుంటారో నాకు తెలుసు కానీ నా కోసం ఇలా వ్యక్తిత్వం చంపుకొనే పనులు చేయరు. నాన్న గురించి బాగా తెలుసు.దేవా: ఏం తెలుసు నీకు తొక్క మీ నాన్నలో పైకి కనిపించని ఇంకో మనిషి ఉన్నారు. మీ నాన్న కన్న కూతురి కోసం కోటి ఫిక్స్ చేశారు. నేను కిరాయి రౌడీ అయిన సరే ఇలాంటి పనికి మాలిన పనులు చేయను. నాకున్న టెంపర్‌కి మీ నాన్న దగ్గరకు వెళ్లి డబ్బు ఇచ్చేవాడిని కానీ నీ కోసమే ఇదంతా కాబట్టి నీకు ఇస్తున్నా. ఖర్చు పెట్టుకుంటావో ఇంకేం చేసుకుంటావో నీ ఇష్టం కానీ ఈ డబ్బు తీసుకొని నువ్వు వెళ్లిపో. లేదంటే మీ నాన్న నన్ను ఇంకేం చేస్తాడో. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఇలాంటి డబ్బు నా కాలి గోటితో సమానం. డబ్బుతో భయంతో ఈ దేవాని లొంగదీసుకోలేరు.

దేవా ఇంటికి రాహుల్, త్రిపుర వస్తారు. వాళ్లని చూసిన దేవా చిన్న వదిన సూర్యకాంతం మళ్లీ ఏం మాటలు అనడానికి వచ్చారో అని వాళ్లని అడిగి కడిగేస్తా అని వెళ్తుంది. నీతో మాట్లాడాలి అనుకుంటున్నాం వదిన అని రాహుల్ అంటాడు. చెప్పమని మిధున అంటే పర్సనల్‌గా మాట్లాడాలి అని త్రిపుర అంటుంది. దాంతో మిధున అది తన ఇళ్లు అని అందరి ముందు అన్నీ మాట్లాడుకోవాలని సీక్రెట్స్ ఏం లేవని అంటుంది. త్రిపుర మిధున చేయి పట్టుకొని లాక్కెళ్లి తీసుకెళ్లినా వినదు. అందరి ముందే మాట్లాడాలి అంటుంది. శారద చెప్పినా వినదు.

త్రిపుర: నీ కోసం దేవా మాతో ఓ డీల్ పెట్టుకున్నాడు. నిన్ను మన ఇంటికి పంపిస్తాను అని చెప్పి కోటి రూపాయలు తీసుకున్నాడు. పరమేశ్వరి సాక్షిగా తాళి కట్టిన వాడు దేవుడు అని అన్నావ్ వాడితోనే బతుకు అన్నావ్ కానీ వాడు ఎలా నిన్ను అమ్మేశాడో చూశావా.శారద: మా దేవా అలాంటివాడు కాదు మీరు ఎందుకు ఇలాంటి నిందలు వేస్తున్నారో నాకు అర్థం కావడంలేదు. రాహుల్: వెయ్యికి రెండు వేలకి రౌడీయిజం చేసిన వాడు కోటి కోసం భార్యని అమ్మేయడా ఎందుకు వాడు సత్య హరిశ్చంద్రుడు అన్నట్లు మాట్లాడుతున్నారు.శారద: అవును నా కొడుకు అలాంటి వాడే. నా కొడుకు రౌడీనే కానీ డబ్బు కోసం అమ్మాయిని అమ్మేయడు. ప్రాణం పోయినా ఇలాంటి పనులు చేయడు.త్రిపుర: మీరు నమ్మరు అని తెలిసే వీడియో తీసుకొచ్చా కావాలి అంటే ఇది చూడండి అని వీడియో చూపిస్తుంది. 

మిధునని తీసుకెళ్లిపోతామని రాహుల్ చేయి పట్టుకొని లాక్కెత్తే మిధున ఆపి డబ్బు బ్యాగ్ తీసుకొని బయటకు వస్తుంది. అన్న చేతిలో డబ్బుల బ్యాగ్ పెట్టి కోటి సరిగా ఉందా లేదా చూసుకోండి అని అంటుంది. దేవా మీతో భేరం ఆడాడా మీరు దేవాతో భేరం ఆడారా అని నిలదీస్తుంది. అన్నీ దేవా తనతో చెప్పాడని మిధున అంటుంది. కోటి కోసం అమ్మేయాలి అనుకున్న వాడు నాకు ఎందుకు ఈ డబ్బు ఇస్తాడని అడుగుతుంది. దేవా మనసులో నేను వెళ్లిపోవాలి అని తప్ప డబ్బు మనిషి కాదని చెప్తుంది. మిధున మాటలకు దేవా తల్లి శారద చాలా సంతోషపడుతుంది. నన్ను తీసుకెళ్లడానికి మీరు చాలా దిగజారుతున్నారని అంటుంది. మీరు చేసిన ఈ పని వల్ల నాకు దేవా వ్యక్తిత్వం నిజాయితీ తెలిసిందని అంటుంది. ఇంకో సారి ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దని వార్నింగ్ ఇచ్చి అన్నావదినల్ని పంపిస్తుంది. 

తర్వాత మిధున తండ్రికి కాల్ చేస్తుంది. నాన్నే నాకు హీరో రోల్ మోడల్ అని మీరు అంటే పిచ్చి అని జడ్జి హరివర్ధన్ అంటే నీతికి నిజాయితికి మారు పేరని ఎవరికీ భయపడకుండా ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న మీరు మొత్తం వదిలేసి ఇంత చీప్‌గా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అని అంటుంది. మీ కూతురు ఇంటికి రావడం కోసం కోటితో నన్ను కొనాలి అనుకున్నారా అని తండ్రిని ప్రశ్నిస్తుంది. హరివర్థన్ మిధునని తిడతాడు.తనకు అంత అవసరం లేదని చెప్తాడు. మిధున జరిగింది అంతా చెప్తుంది. నాకు ఆ డబ్బు మేటర్ తెలీదు అని హరివర్ధన్ అంటే మిధున నమ్మదు. హరివర్ధన్ కొడుకు కోడల్నిపిలిచి డబ్బుతో భేరం పెట్టారా అని తిడతాడు. మీరు చేసిన పనికి నా కూతురి నాతో ఎలా మాట్లాడిందో తెలుసా అని అరుస్తాడు. ఇక మిధున దగ్గరకు తన అక్క ప్రమోదిని వస్తుంది. దేవా చాలా మంచి వాడని ఇంట్లో కొందరు తనని ద్వేషించినా భరిస్తాడని తండ్రి అంటే దేవాకి ప్రాణం అని తప్పని పరిస్థితుల్లో దేవా రౌడీ అయ్యాడని కానీ చాలా మంచివాడని చెప్తుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: తల్లిదండ్రుల్ని దారుణంగా అవమానించిన సంధ్య.. సంజయ్, బిగ్‌డాడీల కొత్త ఆట షురూ!